బిగ్‌బాస్‌లో వానపాట.. టాలీవుడ్ హీరోయిన్ అందాల ఆరబోత.. యువ సెలబ్రిటీతో కెమిస్ట్రీ అదుర్స్
హిందీ బిగ్‌బాస్ 14 షో హాట్ హాట్‌గా సాగుతున్నది. ప్రారంభమై రెండు మూడు రోజుల్లోనే భారీగా గొడవలు, దారుణంగా దూషించుకోవడం జరిగిపోతున్నాయి. అంతేకాకుండా మహిళా కంటెస్టెంట్ల గ్లామర్ షో మంచి రొమాంటిక్ సినిమాను తలపించేలా ఉంది. ముఖ్యంగా టీవీ హీరో సిద్ధార్థ్ శుక్లా, నిక్కి తంబోలి మధ్య కెమిస్ట్రీ హాట్ టాపిక్‌గా మారింది. తాజా ఎపిసోడ్‌లో జరిగిన వేడి వేడి సంఘటనలు ఏమిటంటే..

సిద్ధార్థ్ శుక్లాను ఇంప్రెస్ చేసేందుకు
బిగ్‌బాస్ ఇంటిలో నామినేట్ అయిన మహిళా సభ్యుల్లో ఇమ్యునిటీ పొందాలంటే కంటెస్టెంట్ సిద్దార్థ్‌ను ఇంప్రెస్ చేయాల్సి ఉంటుంది. అందుకోసం సిద్దార్థ్ టాటూ ఆర్టిస్ట్‌గా మారారు. దాంతో లేడి సెలబ్రిటీలందరూ సిద్దార్థ్ వద్దకు వచ్చి టాటూలు వేయించుకొనే పనిలో పడ్డారు.

ఎద కింది భాగంలో టాటూ
సిద్దార్థ్ లాంటి ఆర్టిస్టుతో టాటూను ఎక్కడైనా వేయించుకోవడానికి సిద్దమనే విధంగా సెలబ్రిటీలు మీద పడ్డారు. ఓ సెలబ్రిటీ ఎద కింది భాగంలో టాటూ వేయించుకొన్నది. మరో సెలబ్రిటీ తన భుజంపై టాటూ వేయించుకొంటూ కనిపించారు. వయ్యారంగా ఉంటూ ఇమ్యునిటీ కోసం సిద్దార్థ్‌తో రొమాంటిక్‌గా వ్యవహరిస్తూ కనిపించారు.

వానపాటలో తడిసి ముద్దైన నిక్కి తంబోలి
ఇక సిద్దార్థ్‌ను ఇంప్రెస్ చేసే ప్రక్రియలో వానపాట సీన్ మొదలైంది. నిక్కి తంబోలి, రుబీనా లాంటి తారలు సిద్ధార్‌తో రొమాంటిక్‌గా డ్యాన్స్ చేశారు. నిక్కి తంబోలి, రుబీనా చేసిన డ్యాన్సులు హాట్ హాట్‌గా మారాయి. మెహ్రా చిత్రంలో రవీనా టాండన్, అక్షయ్ కుమార్ డ్యాన్స్ చేసిన టిప్ టిప్ బర్సా పానీకి సిద్ధార్థ్‌తోపాటు యువ సెలబ్రిటీలు రెచ్చిపోయి డ్యాన్స్ చేశారు.

బిగ్‌బాస్‌లో రొమాన్స్‌పై హాట్ హాట్‌గా చర్చ
టిప్ టిప్ బర్సా పానీ పాటలో సిద్దార్థ్, నిక్కి తంబోలి హాట్ హాట్‌గా డ్యాన్స్ చేశారు. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ బూతు సినిమాల్లోని పాటల కంటే దారుణంగా ఉందనే మాట సోషల్ మీడియాలో వినిపించింది. వానపాటపౌ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ జరుగుతున్నది. మహిళా సెలబ్రిటీ అందాలను టార్గెట్ చేసే విధంగా ఈ షో సాగుతుందనే మాట బలంగా వినిపిస్తున్నది.
Recommended Video

మోస్ట్ కాంట్రవర్సియల్ సెలబ్రిటీగా నిక్కి తంబోలి
ఇక ఇంటిలో నిక్కి తంబోలి రొమాంటిక్‌గా ఉండటమే కాకుండా తోటి కంటెస్టెంట్లతో ఘాటుగా ప్రవర్తిస్తున్నది. హీనా ఖాన్ లాంటి వారితో గొడవలు పెట్టుకొంటూ అందరి దృష్టిని తన వైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నారనే వాదన వినిపిస్తున్నది. మొతానికి నిక్కి తంబోలి వ్యవహారం బిగ్‌బాస్‌ను షేక్ చేస్తున్నది.


Click it and Unblock the Notifications











