బిగ్‌బాస్‌లో అతడి చెడ్డీలు ఉతికిన నిక్కి తంబోలి.. ఈ కంటెస్టెంట్ చర్యలు నిజంగా ఊహాతీతమే
బిగ్‌బాస్ హిందీ రియాలిటీ 14 సీజన్‌లో అనూహ్యమైన సంఘటనలు చోటుచేసుకొంటున్నాయి. ముఖ్యంగా నిక్కి తంబోలి వ్యవహారం రచ్చగా మారింది. ఆక్సిజన్ మాస్క్‌ను ఇటీవల తన ప్యాంటులో పెట్టుకొన్న ఆమె తాజాగా తన తోటి లోదుస్తులను ఇంట్లో ఉతకడం మరో రచ్చకు దారి తీసింది. ఈ వ్యవహారంలో ఏం జరిగిందంటే...

అండర్‌వేర్లు, బట్టలు ఉతికాను
ఇటీవల పవిత్ర పునియా, నిక్కి తంబోలి ఇంట్లో జరిగే విషయాలను పంచుకొన్నారు. తాజా ఎపిసోడ్‌లో బకెట్ నిండా బట్టలు మోసుకొంటూ నిక్కి తంబోలి కనిపించంది. ఇజాజ్ తనను బట్టలు ఉతకమన్నాడు. అందుకే నేను అతడి అన్ని బట్టలు ఉతికాను. అతని అండర్ వేర్లు, జిమ్ షార్ట్స్ అని ఉతికాను. వాటిని ఆరేసేందుకు బయటకు వచ్చాను అంటూ నిక్కి తంబోలి చెప్పింది.

ఆడపిల్లతో ఎలా ఉతికిస్తావు...
తాజా ఎపిసోడ్‌లో కంటెస్టెంట్ పవిత్ర పునియా షాకింగ్ విషయాన్ని అందరి ముందు బయటపెట్టింది. తోటి కంటెస్టెంట్ ఇజాజ్ ఖాన్‌ను నిలదీసింది. నిక్కి తంబోలి చేత నీ అండర్‌వేర్లు ఉతికించావా? అని అడిగిన ప్రశ్నకు సమాధానం అవును అంటూ రావడంతో మండిపడింది. ఒక ఆడపిల్లతో నీ లోదుస్తులు ఎలా ఉతికిస్తావు అంటూ ఘాటుగా స్పందించింది.

నా ఫన్ మూడ్‌ను పాడు చేయకు
పవిత్ర పునియా ప్రశ్నలకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఇజాజ్ ఖాన్ సమాధానం ఇస్తూ.. అది విషయం సరదాగా చేసిన పని. దానిని తప్పుగా అర్థం చేసుకొని.. ఆ ఫన్ మూడ్‌ను పాడు చేయకు అంటూ అని కామెంట్ చేశాడు. కెప్టెన్ కావడంతో తనకు సంబంధించిన అన్ని పనులు చేయాలని సూచించాను. నిక్కి తంబోలి నాకు ప్రత్యేకం కాదు. తాను ఇచ్చిన పనిలో భాగంగా నా బట్టలతోపాటు చెడ్డీలు కూడా ఉతికింది అంటూ ఇజాజ్ ఖాన్ వివరణ ఇచ్చాడు.

లేనిపోని వివాదం సృష్టించకు.. ఇజాజ్ ఖాన్
ఇక పవిత్ర పునియా ఈ విషయాన్ని బయటపెట్టడంపై ఇజాజ్ ఖాన్ భగ్గుమన్నాడు. మజా విషయాలను కూడా ఇలా కొందరు కిరికిరి చేస్తున్నారు. 10 రోజులు కలిసి ఉన్నప్పటికి.. ఇలాంటి విషయాలను అర్ధం చేసుకోరా? అంటూ పవిత్రను తప్పుపట్టారు. ఈ విషయంపై వారి మధ్య భారీగానే గొడవ జరిగింది.

నిక్కి తంబోలి ట్రెండింగ్‌గా
ఇలాంటి ఊహతీతమైన చర్యలతో నిక్కి తంబోలి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. నిక్కి చేసే పనులు, ముక్కుసూటిగా మాట్లాడే తత్వం మాకు బాగా నచ్చింది అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. ప్యాంటులో మాస్క్ దాచుకొన్న ఘటన వైరల్ కావడంతో ఆమె వ్యవహారం ట్రెండ్ అవుతున్నది. నిక్కి తంబోలి తెలుగుు ప్రేక్షకులకు సుపరిచితమే. చికటి గదిలో చితక్కొట్డుడు, కాంచన, తిప్పరా మీసం చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే.

బిగ్‌బాస్ టాప్ 5లో గ్యారెంటీ అంటూ
ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారిన నిక్కి తంబోలి.. బిగ్‌బాస్ 14లో టాప్ 5లో ఉండటం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఆమె ప్రవర్తన, ధరించే దుస్తులు బిగ్‌బాస్ షో ప్రేక్షకుల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇంటిలో ఆమె స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారి అందర్ని ఆకట్టుకోవడమే కాకుండా వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్నది.


Click it and Unblock the Notifications











