Don't Miss!
- Sports DC vs SRH:ట్రావిస్ హెడ్, షెహ్బాజ్ అహ్మద్ విధ్వంసం.. ఢిల్లీ ముందు భారీ లక్ష్యం
- News సుమలత దెబ్బకు మాజీ సీఎం హడల్, ఇంతవరకు ప్రచారం చెయ్యలేదు, అసలు మ్యాటర్ !
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
ప్యాంటులో అది పెట్టుకొంటావా? సిగ్గు లేదా.. బిగ్‌బాస్ కంటెస్టెంట్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ హిందీ రియాలిటీ షోలో గందరగోళ తీవ్ర స్థాయిలో ఉంది. కంటెస్టెంట్ల మధ్య విపరీతమైన చేష్టలు ఇంటి సభ్యులనే కాకుండా నెటిజన్లను ఆగ్రహానికి గురిచేస్తున్నది. ముఖ్యంగా దక్షిణాది హీరోయిన్, చీకటి గదిలో చితక్కొట్టుడు చిత్రం ఫేమ్ నిక్కి తంబోలి వ్యవహారం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నది. ఆమె చేస్తున్న హంగామా ఎలా ఉందంటే...
ఇంట్లో, సోషల్ మీడియాలో రచ్చ రచ్చ
కొద్ది రోజుల క్రితం ఓ టాస్క్ సందర్భంగా చేసిన చేష్టలతో నిక్కి తంబోలి జాతీయ వ్యాప్తంగా వివాదం అయ్యారు. ఓ గేమ్‌లో ప్యాంటులోని లోదుస్తుల్లో ఆక్సిజన్ మాస్క్‌ను పెట్టుకోవడం అందర్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. ఈ వవ్యహారంపై బిగ్ బాస్‌లోని పవిత్ర పునియా, కామ్యా పంజాబీ లాంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్యాంటులో మాస్క్ పెట్టుకోవడంపై సిగ్గులేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికి ఈ ఘటనపై నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
రాహుల్ వైద్యను ఓదార్చేందుకు
ఇలా బయట ట్రోల్స్ జరుగుతున్న సమయంలో రాహుల్ వైద్యతో విభేదాలు పరిష్కరించుకొనేందుకు నిక్కి తంబోలి ప్రయత్నించింది. నీతో మరోసారి మాట్లాడానే ప్రయత్నం చేస్తున్నాను. నిన్ను ఈ విషయంలో ఓదార్చాలనే విషయంతో వచ్చాను. ఆ ఘటన కారణంగా మనం ఇద్దరం విడిపోవద్దు. నీవు నాతో మాట్లాడకపోతే నాకు చాలా బాధగా ఉంది అంటూ రాహుల్ వైద్యను నిక్కి బతిమిలాడింది.
నీ ముఖం చూస్తేనే రోత
అయితే ప్యాంటులో మాస్క్ వివాదానికి కారణమైన రాహుల్ వైద్యకు నెటిజన్లు, తోటి కంటెస్టంట్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నది. నిక్కి తంబోలి వ్యవహారంపై అనుసరించిన తీరు ఆకట్టుకొన్నదనే మాట వినిపిస్తున్నది. నేను టాస్క్‌లో ఎందుకు ఏడ్చానో తెలుసా? నీవు చేసిన పని చాలా దారుణంగా ఉంది. నేను ఎప్పటికీ ఆ ఘటనను మరిచి పోలేను. నేను నీతో మాట్లాడను. నీ ముఖం చూస్తేనే రోత పుడుతున్నది అంటూ వైద్య కామెంట్ చేశారు.
నిక్కి మా వాడిని బుట్టలో వేసుకొనే..
ఇక నిక్కి తంబోలి గురించి సింగర్, బిగ్‌బాస్ కంటెస్టెంట్ కుమార్ సాను తల్లి రీటా మాట్లాడుతూ.. నా కొడుకును బుట్టలో పడేసుకొన్నట్టు కనిపిస్తున్నది. మా వాడు కూడా ఆమె ఆకర్షణకు లోనయ్యాడేమో అనిపిస్తున్నది. ఇంటిలో నా కొడుకు తోడుగా ఒకరు.. అలాగే నిక్కి తోడుగా మా అబ్బాయి కలిసి ఉండటం సంతోషం కలిగిస్తున్నది అంటూ రీటా చెప్పారు.