twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కార్తీక దీపం డాక్టర్ బాబులో ఈ యాంగిల్ కూడానా?.. వంటలక్కను వదిలేసి కూతుళ్లతో కలిసి రచ్చ

    |

    కార్తీకదీపం సీరియల్, డాక్టర్ బాబు అలియాస్ కార్తీక్ అలియాస్ నిరుపమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆ మధ్య ఓ వారం రోజులు సీరియల్‌లో కనిపించకపోయే సరికి అభిమానులు తల్లడిల్లిపోయారు. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేశారు. డాక్టర్ బాబు గొంతు మారిందని, డబ్బింగ్ కూడా వేరే వారు చెబుతున్నారని ఫ్యాన్స్ తెగ ఫీలయ్యారు. డాక్టర్ బాబుగా సీరియల్‌లో నిరుపమ్ ఎంత సీరియస్‌గా ఉంటాడో.. బయట అంత సరదాగా ఉంటాడు. సోషల్ మీడియాలో నిరుపమ్ చేసే అల్లరి అంతా ఇంతా కాదు.

    Recommended Video

    Karthika Deepam Vantalakka Live Video || కార్తీక దీపం సీరియల్‌ నుంచి తప్పుకోవడం పై దీప క్లారిటీ !
    పిల్లలతో సందడి..

    పిల్లలతో సందడి..

    కార్తీకదీపంలో హిమ పాత్రలో సహృద, శౌర్య క్యారెక్టర్‌లో కృతిక ఎంత బాగా నటిస్తున్నారో అందరికీ తెలిసిందే. కృతిక అయితే ఏకంగా సినిమాల్లోనూ ఆఫర్లు కొట్టేసింది. ఈ ఇద్దరూ సోషల్ మీడియాలో నానా హంగామా చేస్తుంటారు. తెరపై కనిపించే వీరికి సోషల్ మీడియాలో సందడి చేసే వీరికి మధ్య ఎంతో తేడా ఉంటుంది. ఈ పిల్లలతో నిరుపమ్ రచ్చ రచ్చ చేస్తుంటాడు.

    షూటింగ్ గ్యాప్‌లో..

    షూటింగ్ గ్యాప్‌లో..

    షూటింగ్ గ్యాప్‌లో ఈ ముగ్గురు కలిసి చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఈ పిల్లలను ప్రాణాలు తీసేస్తున్నారంటూ నిరుపమ్ తన బాధను చెప్పుకుంటాడు. రెస్టారెంట్లకు వెళ్లినా ఎక్కడికి వెళ్లినా పిల్లలు ఆడేసుకుంటున్నారని వారి గురించి చెబుతుంటాడు.

    ఆన్ స్క్రీన్ అల్లరి..

    ఆన్ స్క్రీన్ అల్లరి..

    తెరపై ఎంత సీరియస్‌గా కనిపించినా, కథ పరంగా వేర్వేరుగా ఉన్నా కూడా ఒక్కసారి ప్యాకప్ చెప్పాక కార్తీకదీపం టీం మొత్తం రచ్చ రచ్చ చేస్తుంటారు. ఈ పిల్లలిద్దరూ కూడా నిరుపమ్‌తో చాలా సన్నిహితంగా ఉంటారు. నిరుపమ్ కూడా పిల్లలతో ఎంతో సరదాగా ఉంటాడు.

    వంటలక్క సైతం..

    వంటలక్క సైతం..

    వంటలక్క అలియాస్ దీప అలియాస్ ప్రేమీ విశ్వనాథ్ కూడా ఆన్ స్క్రీన్‌లో ఎంతో సందడి చేస్తుంటుంది. పిల్లలతో కలిసి అల్లరి చేస్తుంటుంది. ముఖ్యంగా షూటింగ్ గ్యాప్‌లో కృతికతో కలిసి రచ్చ చేస్తుంటుంది. క్యారవ్యాన్‌లో, లొకేషన్‌లలో అలా పక్కన కూర్చుని ముచ్చట్లు పెడుతుంటారు.

    తాజాగా అలా..

    తాజాగా డాక్టర్ బాబు వంటలక్కను వదిలేసి.. తన ఇద్దరూ కూతుళ్లు (హిమ, శౌర్య)తో డ్యాన్స్ చేశాడు. కాటుక కనులే అంటూ ఆన్ స్క్రీన్ డాటర్స్‌తో క్యూట్ స్టెప్పులు వేశాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. డాక్టర్ బాబు దుమ్ములేపేశాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

    English summary
    Nirupam Paritala Dance Video with Shourya And Hima, Nirupam Paritala Wife manjula Account Is Hacked, Old a/c hacked..plz unfollow the old a/c n show ur love on the new I’d manjula_nirupam 😊 swipe left for the new page.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X