Nirupam Paritala వెధవ పనుల్లో సాయం చేస్తేనే ఫ్రెండ్?.. డాక్టర్ బాబు పోస్టు వైరల్

బుల్లితెర శోభన్ బాబు అన్నా.. బుల్లితెర సూపర్ స్టార్ అన్నా కూడా వాటికి నిరుపమ్ పరిటాల సరిగ్గా సరిపోయే కటౌట్. ఆయన నటించిన సీరియల్స్ తెలుగు బుల్లితెరపై సెన్సేషన్ క్రియేట్ చేశాయి. చంద్రముఖి సీరియల్ తన పర్సనల్ జీవితాన్ని మార్చేస్తే.. కార్తీకదీపం సీరియల్ తన యాక్టింగ్ కెరీర్‌ను పీక్స్‌కు తీసుకెళ్లింది. ఇక హిట్లల్ గారి పెళ్లాం సీరియల్‌తో నిర్మాతగానూ నిరుపమ్ పరిటాలకు మంచి సక్సెస్ వచ్చింది. అలా నిరుపమ్‌కు బుల్లితెరకు విడదీయలేని బంధం ఏర్పడింది.

‘చంద్రముఖి'తో ప్రేమ, పెళ్లి

‘చంద్రముఖి'తో ప్రేమ, పెళ్లి

చంద్రముఖి సీరియల్‌తో నిరుపమ్ పరిటాల, మంజుల మధ్య స్నేహం ఏర్పడింది. హీరో హీరోయిన్లుగా నటిస్తూనే.. ప్రేమలో పడిపోయారు. ఈ సీరియల్ ముగిసే లోపు జంటగా మారిపోయారు. అలా నిరుపమ్, మంజుల కెరీర్‌లో ఈ సీరియల్‌కు ప్రత్యేక స్థానం ఏర్పడింది.

డాక్టర్ బాబుగా..

డాక్టర్ బాబుగా..

కార్తీక దీపం సీరియల్‌తో రెండు తెలుగు రాష్ట్రాల్లో నిరుపమ్ పరిటాల ఫుల్ ఫేమస్ అయ్యాడు. డాక్టర్ బాబు, కార్తీక్ అంటూ అభిమానులు ముద్దుగా పిలుస్తుంటారు. నిరుపమ్ అని పిలవడం కూడా మానేశాడు. ఎక్కడకు వెళ్లినా కూడా డాక్టర్ బాబు అని పిలుస్తుంటారు. అంతటి ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు.

హిట్లర్ గారి పెళ్లాం..

హిట్లర్ గారి పెళ్లాం..

జీ తెలుగులో వచ్చిన హిట్లర్ గారి పెళ్లాం ధారావాహికతో నిరుపమ్ పరిటాల ప్రొడక్షన్ కంపెనీ ప్రారంభించాడు. హిట్లర్ గారి పెళ్లాం ఏడాది పాటు ఓ రేంజ్‌లో నడిచింది. అయితే ఈ సీరియల్‌ను అర్దాంతరంగా ముగించినట్టు అనిపించింది. దీంతో అభిమానులు పార్ట్ 2 తీయమని కోరుతుంటారు.

 నెట్టింట్లో సందడి..

నెట్టింట్లో సందడి..

ప్రస్తుతం నిరుపమ్ పరిటాల ఏ సీరియల్‌లోనూ నటించడం లేదు. కొన్ని ప్రాజెక్టులు చర్చల దశల్లోనే ఉన్నాయని అన్నాడు. అలా ఇప్పుడు నిరుపమ్ తన అభిమానులను యూట్యూబ్ వీడియోల ద్వారా, ఇన్ స్టాగ్రాం పోస్టుల ద్వారా పలకరిస్తుంటాడు. ఆయన వేసే ప్రాసలు, పంచులు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే.

ఫ్రెండ్ షిప్ డే..

ఫ్రెండ్ షిప్ డే..

హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే.. మనం చేసే వెదవ పనులకి సపోర్ట్ చేసే వాడినే మనం ఫ్రెండ్ అంటాం.. వాళ్లలో మంచి వెదవలు కూడా ఉంటారు.. వాళ్లని వదులుకోకండి.. నా ఇన్‌స్టా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్ షిప్ డే శుభాకాంక్షలు అంటూ నిరుపమ్ వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X