For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రముఖ షోలో నిరుపమ్‌కు ప్రమాదం: గట్టిగా నెట్టడంతో కింద పడి.. ఒక్కసారిగా నేలకు గుద్దుకోవడంతో!

  |

  తెలుగులో సినిమా హీరోలపై ఎంతటి అభిమానం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ రేంజ్‌లో కాకపోయినా బుల్లితెరపై నటించే సీరియల్ హీరోలకు సైతం భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉంటుంది. ఇలా చాలా మంది తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫేమస్ అయిపోయారు. అందులో బుల్లితెర శోభన్ బాబుగా పేరొందిన నిరుపమ్ పరిటాల ఒకడు. 'కార్తీక దీపం'లో డాక్టర్ బాబుగా అసాధారణ నటనతో ఆకట్టుకుంటోన్న అతడు.. వరుస సీరియళ్లతో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ షోలో నిరుపమ్ పరిటాల ప్రమాదానికి గురయ్యాడు. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

  ‘కార్తీక దీపం'తో మారుమ్రోగుతోన్న పేరు

  ‘కార్తీక దీపం'తో మారుమ్రోగుతోన్న పేరు

  చాలా కాలం క్రితమే బుల్లితెర నటుడిగా గుర్తింపును అందుకున్నాడు నిరుపమ్ పరిటాల. సుదీర్ఘమైన కెరీర్‌లో అతడు ఎన్నో సీరియళ్లలో నటించాడు. అందులో ఎన్నో వాటిలో అత్యుత్తమ నటనను కనబరిచాడు. ఇక, 'కార్తీక దీపం' అతడి కెరీర్‌నే మార్చేసింది. ఇందులో డాక్టర్ బాబుగా నిరుపమ్ చేసే యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఫలితంగా అతడి పేరు మారుమ్రోగుతోంది.

  'కార్తీక దీపం' హీరోయిన్ పర్సనల్ లైఫ్ ఫొటోలు: ఆమె రియల్‌గా ఎలా ఉంటుందో తెలిస్తే షాక్ అవుతారు!

  ఫ్యాన్స్ అసోషియేషన్స్ కూడా ఏర్పాటు

  ఫ్యాన్స్ అసోషియేషన్స్ కూడా ఏర్పాటు

  'కార్తీక దీపం' సీరియల్ పుణ్యమా అని నిరుపమ్‌ పరిటాలకు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీ స్థాయిలో పెరిగిపోయింది. మా డాక్టర్ బాబు.. మా డాక్టర్ బాబు అంటూ అతడి పేరు జపిస్తున్నారు. అతడి పేరిట సోషల్ మీడియాలో ఎన్నో అభిమాన సమూహాలు ఏర్పాటు అయ్యాయి. అంతలా అతడి ప్రభావం కనిపిస్తోంది. ఈ ఎఫెక్టుతోనే నిరుపమ్‌కు వరుసగా సీరియల్, సినిమా ఆఫర్లు వస్తున్నాయి.

  ‘హిట్లర్ గారి పెళ్లాం'తో మరో ఛానెల్‌ ఎంట్రీ

  ‘హిట్లర్ గారి పెళ్లాం'తో మరో ఛానెల్‌ ఎంట్రీ

  నిరుపమ్ పరిటాల 'కార్తీక దీపం'తో పాటు 'హిస్టల్ గారి పెళ్లాం' అనే సీరియల్‌లోనూ నటిస్తున్నాడు. జీ తెలుగులో ప్రసారం అవుతోన్న ఇందులో గోమతి ప్రియ ఫీమేల్ లీడ్‌గా నటిస్తోంది. ఇది 'గుడాన్ తుమ్‌సే నా హో పాయేగా' అనే హిందీ సీరియల్‌కు రీమేక్‌గా ప్రసారం అవుతోంది. ఇందులో కూడా నిరుపమ్ అదిరిపోయే నటనతో ఆకట్టుకుంటున్నాడు. కోరమీసం లుక్‌తో ఫిదా చేసేస్తున్నాడు.

  సీరియస్‌గా సీరియళ్ల మధ్యన సంగ్రామం

  సీరియస్‌గా సీరియళ్ల మధ్యన సంగ్రామం

  ప్రస్తుతం జీ తెలుగులో 'సూపర్ సీరియల్ ఛాంపియన్‌షిప్' అనే షో ప్రసారం అవుతోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి ఇందులో సూర్యకాంతం వర్సెస్ త్రినయని సీరియల్ నటీనటుల మధ్య పోటీ జరగబోతుంది. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో యాంకర్ ప్రదీప్ తనకు కాబోయే భార్య అంటూ ఓ ఫొటోను పట్టుకుని రచ్చ చేశాడు.

  'మా' ప్రెసిడెంట్‌గా నందమూరి బాలకృష్ణ: మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు.. అందుకే వెయింటింగ్ అంటూ!

  హిట్లర్‌లా ఎంటరైన నిరుపమ్.. పంచులు

  హిట్లర్‌లా ఎంటరైన నిరుపమ్.. పంచులు

  జీ తెలుగులో ప్రసారం అవుతోన్న 'సూపర్ సీరియల్ ఛాంపియన్‌షిప్'లో భాగంగా వచ్చే ఆదివారం హిస్టర్ గారి పెళ్లాం - వైదేహీ పరిణయం సీరియళ్ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. దీనికి నిరుపమ్ పరిటాల హిట్లర్‌లాగ ఎంట్రీ ఇచ్చాడు. అంతేకాదు, ఆరంభం నుంచే హీరోయిన్ మీద పంచులు వేస్తూ రచ్చ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది.

  గట్టిగా నెట్టడంతో కింద పడిన నిరుపమ్

  గట్టిగా నెట్టడంతో కింద పడిన నిరుపమ్

  'సూపర్ సీరియల్ ఛాంపియన్‌షిప్'లో భాగంగా నిరుపమ్ పరిటాల ఉయ్యాల మీద కూర్చుని ఓ గేమ్ ఆడుతున్నాడు. సరదాగా సాగుతుండగా.. అంతలో వెనుక ఉన్న వ్యక్తి గట్టిగా నెట్టడంతో ఉయ్యాల మీద ఉన్న నిరుపమ్ కింద పడిపోయాడు. దీంతో అందరూ భయంతో వణికిపోయారు. పైనుంచి పడిన సమయంలో కింద స్పాంజ్‌లు ఉండడంతో నేలకు గుద్దుకున్నా గాయాలు కాలేదు.

  English summary
  Karthika Deepam Hero Nirupam Paritala Recently Participated in Super Serial Championship Show. He Fell Down and Met An Accident in This Show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X