Nirupam Paritala డాక్టర్ బాబుకు రెమ్యూనరేషన్ ఎంత? ఒక్కో ఎపిసోడ్‌కు నిరుపమ్ పారితోషికం ఎంత?
ప్రస్తుత కాలంలో సినిమాల కంటే ఎక్కువ సీరియల్స్ కే ఎక్కువ గుర్తింపు వస్తున్నాయి. హీరోలను ఎలా అయితే గుర్తుపడుతున్నారో.. సీరియల్ నటులను కూడా అలాగే గుర్తుపడుతున్నారు. గుర్తింపు మాత్రమే కాదు హీరోలకు తగ్గట్టుగా పారితోషికాలు అందుకుంటున్నారు. వాళ్ల రెమ్యూనరేషన్ కూడా కళ్లు చెదిరేలా ఉంటుంది. మరి బుల్లితెరపై మెగాస్టార్ గా కొనసాగుతున్న ఒక హీరో రెమ్యూనిరేషన్ ఎంతో తెలుసుకుందాం.
నిరుపమ్ పరిటాల.. ఈ పేరు గురించి ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కార్తీక దీపం సీరియల్ తో నిరుపమ్ ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుందో అందరికి తెల్సిందే. ఇక ఈ సీరియల్ కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇందులో డాక్టర్ బాబు, వంటలక్క అంటే ఇష్టపడే ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు. డాక్టర్ బాబుగా, కార్తీక్ గా నిరుపమ్ ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

చంద్రముఖి సీరియల్ తో బుల్లితెరకు పరిచయం అయిన నిరుపమ్.. తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యాడు. ఆ తరువాత వరుస సీరియల్స్ తో బిజీగా మారాడు. అయితే సినిమా హీరోగా మారాలని సినిమాల్లో కూడా ట్రై చేశాడు. కానీ, ఆడిషన్స్ కు వెళ్లిన ప్రతిసారి సీరియల్స్ లో నటిస్తున్నాడు అని పక్కన పెట్టేవారట. అది నచ్చక ఎన్నో సినిమా అవకాశాలను వదులుకున్నాడట నిరుపమ్. ఇక ఆ సమయంలోనే కార్తీక దీపం సీరియల్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డాక్టర్ బాబు గా నిరుపమ్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. సొంతపేరును కూడా మర్చిపోయేలా డాక్టర్ బాబు.. డాక్టర్ బాబు అని పిలవడం మొదలుపెట్టారు.
ఇక ఈ సీరియల్ కు ముందూ తరువాత నిరుపమ్ చాలా సీరియళ్లలో నటించినా ఈ సీరియల్ స్థాయిలో ఆ సీరియళ్లకు రేటింగ్ రాలేదు.. కానీ, కార్తీక దీపం సీరియల్ అతని జీవితాన్ని మార్చేసింది. బుల్లితెరపై మెగాస్టార్ ను చేసింది. ఈ సీరియల్ తరువాత నిరుపమ్ రెమ్యూనరేషన్ కూడా పెంచేశాడు. అంతకు ముందు ఎపిసోడ్ కు రూ. 22 వేలు తీసుకొనే ఈ నటుడు.. ఇప్పుడు దానికి డబుల్ అందుకుంటున్నాడట. అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రస్తుతం కార్తీక దీపం.. ఇది నవ వసంతం సీరియల్ కు నిరుపమ్ ఒక్కో ఎపిసోడ్ కు రూ. 40 వేలు అందుకుంటున్నాడట.
ఇప్పటివరకు సీరియల్ హీరోల్లో అంత రెమ్యూనిరేషన్ ఎవరు అందుకోలేదు. సీరియల్ హీరోగా హయ్యెస్ట్ పారితోషికం అందుకుంటున్న హీరో నిరుపమ్ అని చెప్పొచ్చు. ప్రతిరోజు సీరియల్స్ షూటింగ్ జరగకపోయినప్పటికీ రెండు సీరియల్ షూటింగ్స్ ఒకేరోజు జరిగితే ఆరోజు నిరుపమ్ ఆదాయం లక్షకు పైగా ఉంటుందని సమాచారం.

ఇక పారితోషికం మాత్రమే కాదు.ఇప్పటివరకు నిరుపమ్ నికర ఆస్తులు విలువ కూడా బాగానే ఉందని తెలుస్తోంది. హైదరాబాద్ లో నిరుపమ్ కు 80 లక్షల రూపాయల ఫ్లాట్ ఉందని వైజాగ్ లో 5 కోట్ల రూపాయల విలువ చేసే ప్రాపర్టీ ఉందని తెలుస్తోంది. వీటితో పాటు నిరుపమ్ కు సొంతంగా రెండు కార్లు ఉన్నాయని సమాచారం. ఇవే కాకుండా నిరుపమ్ నిర్మాతగా కూడా మారాడు.
ఒకపక్క హీరోగా, ఇంకోపక్క నిర్మాతగా రెండు చేతుల సంపాదిస్తున్నాడు. జీ తెలుగులో ప్రసారం అవుతున్న హిట్లర్ గారి పెళ్ళాం సీరియల్ కు నిరుపమ్ నే నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇక అప్పుడప్పుడు సినిమాల్లో కూడా కీలక పాత్రల్లో కనిపిస్తూ మెప్పిస్తున్నాడు. ఇంకోపక్క నిరుపమ్ భార్య మంజుల కూడాబాగానే సంపాదిస్తోంది. మరి ముందు ముందు ఈ జంట సీరియల్స్ లోనే మంచి పొజిషన్ కు వెళ్తారేమో చూడాలి.


Click it and Unblock the Notifications










