బుల్లితెర శోభన్‌బాబు నిరుపమ్ ధమాకా.. హిట్లర్ గారి పెళ్ళాం సీరియల్‌తో మరోసారి
ఇప్పటి వరకు ఎన్నో కుటుంబ కథా నేపథ్యం ఉన్న డైలీ సీరియల్స్‌ను రూపొందించి ఎంతో మంది బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న జీ టెలివిజన్ తెలుగు మరో ఎమోషనల్ ఫ్యామిలీ సీరియల్‌తో ముందుకొస్తున్నది. జీ టెలివిజన్‌లో ఇప్పటికే ప్రసారమై దేశవ్యాప్తంగా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకొన్న గుడ్డన్ తుమ్సే న హో పాయెగా అనే సీరియల్ ఆధారంగా రూపొందుతున్న ధారావాహికకు 'హిట్లర్ గారి పెళ్లాం'గా పేరు పెట్టారు. ఈ సీరియల్ గురించి విషయాలు నటీనటుల ఎంపిక, ప్రసార సమయాల గురించి మరిన్ని వివరాలు..

టెలివిజన్ శోభన్ బాబుగా నిరుపమ్
టెలివిజన్ శోభన్ బాబుగా పేరు తెచ్చుకొన్న నిరుపమ్ పరిటాల హీరోగా అభినవ్ అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ సీరియల్‌లో హిట్లర్ పాత్రకు అభిమానులు ఫిదా అవ్వడం గ్యారెంటీ అనే విషయాన్ని చిత్ర యూనిట్ వ్యక్తం చేస్తున్నది. ఇక హిట్లర్‌కు జంటగా భానుమతి పాత్రలో గోమతి ప్రియా నటిస్తున్నారు. వీరితోపాటు అభినవ్ జాగర్లమూడి (ఏజే), సునంద మాలశెట్టి, కీర్తి జైధనుష్, మధుకృష్ణ తదితరులు నటించారు.

ఆగస్టు 17వ తేదీ నుంచి ప్రారంభం
కుటుంబ తరహా ప్రేక్షకులను ఆకట్టుకొనే విధంగా రూపొందించిన హిట్లర్ గారి పెళ్లాం సీరియల్ ఆగస్టు 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నది. ప్రతీ సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6.30 గంటలకు జీ తెలుగు, జీ తెలుగు హెచ్‌డీ ఛానెల్స్‌లో ప్రసారం అవుతుందని నిర్వాహకులు వెల్లడించారు. హిట్లర్ గారి పెళ్లాం సీరియల్ మరో మంచి సీరియల్‌గా ప్రేక్షకులను ఆకట్టుకోవడం గ్యారంటీ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

భానుమతి పాత్ర చుట్టే కథ అంతా
హిట్లర్ గారి పెళ్లాం సీరియల్‌లో భానుమతి పాత్ర చాలా భావోద్వేగంగా సాగుతుంది. ఆమె పాత్రపై ప్రేక్షకులకు సానుభూతి కలగడం సహజం. భానుమతి తన జీవితంలో ఏ పని తలపెట్టినా ఎదురు దెబ్బలు తగలుతుంటాయి. ఫెయిల్యూర్స్తో సాగుతున్న ఆమెను కుటుంబ సభ్యులు సూటిపోటి మాటలతో ఎత్తి పొడుస్తుంటారు. ఇక నీ వల్ల కాదు అని అవహేళన చేసిన ఫ్యామిలీకి ఎలాంటి సానుకూల ఫలితాలను చూపించిందనే విధంగా భానుమతి పాత్ర ఉంటుంది అని హిట్లర్ గారి పెళ్లాం యూనిట్ వెల్లడించింది.
Recommended Video

పెద్ద కుటుంబంలో కలతలు, కన్నీళ్లుగా
హిట్లర్ గారి పెళ్లాం సీరియల్‌లో ముగ్గురు కోడళ్ళు, హిట్లర్ లాంటి మామ లాంటి పాత్రలతో ఎమోషనల్‌గా సాగుతుంది. అభినవ్ జాగర్లమూడి (ఏజే)తో పెళ్లి జరగడంతో పెద్దింటికి అత్తగా భానుమతి వెళ్తుంది. అలాంటి పెద్ద కుటుంబంలో తను చేయాలనుకున్న పనిని సక్రమంగా చేయగలుగుతుందా? తనలోని లోపాలని అధిగమిస్తూ జీవితంలో విజయాన్ని సాధిస్తుందా? ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడి అందరికి ఎలా ఆదర్శంగా నిలుస్తుందనే కోణంలో సీరియల్ సాగుతుంది అని చిత్ర యూనిట్ తెలిపింది.


Click it and Unblock the Notifications











