ప్రేమీ విశ్వనాథ్‌పై నిరుపమ్ ఫైర్: షూటింగ్‌లో అలాంటి పనులు.. ఇన్‌స్టాలో కార్తీక దీపం పెయిర్ రచ్చ

'కార్తీక దీపం'.. దాదాపు మూడేళ్లుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతూ ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తోన్న సీరియల్ ఇది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ టెలివిజన్ రంగంలో హవాను చూపిస్తూ నెంబర్ వన్ ప్లేస్‌లో వెలుగొందుతోంది. ఈ సీరియల్ ద్వారా హీరోయిన్ ప్రేమీ విశ్వనాథ్ (దీప/వంటలక్క) ఎంతో ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే, తెలుగు నటుడు నిరుపమ్ పరిటాల కూడా మరింత క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలో వీళ్లిద్దరూ తాజాగా హైలైట్ అయ్యారు. దీనికి కారణం సోషల్ మీడియా డాక్టర్ బాబు చేసిన పోస్టే. ఆ సంగతులు మీకోసం!

‘కార్తీక దీపం' సీరియల్ నేపథ్యం ఇదే

‘కార్తీక దీపం' సీరియల్ నేపథ్యం ఇదే

బుల్లితెరపై నెంబర్ వన్ సీరియల్‌గా వెలుగొందుతోన్న 'కార్తీక దీపం' మొదట మలయాళంలో 'కరుతముత్తు' అనే టైటిల్‌తో ప్రసారం అయింది. అక్కడ ఇది సూపర్ హిట్ అయింది. అందులోనూ ప్రేమీ విశ్వనాథే హీరోయిన్‌గా చేసింది. కాకపోతే కథలో కొన్ని మార్పులు చేసిన డైరెక్టర్ కాపుగంటి రాజేంద్ర దీన్ని సక్సెస్ చేశారు. ఫలితంగా ఈ సీరియల్ టెలివిజన్‌పై హవాను చూపిస్తూ దూసుకెళ్తోంది.

ఇండియాలోనే నెంబర్ వన్ సీరియల్

ఇండియాలోనే నెంబర్ వన్ సీరియల్

'కార్తీక దీపం' సీరియల్‌కు తెలుగు ప్రేక్షకులు భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను అందిస్తున్నారు. అందుకే దాదాపు మూడున్నరేళ్లుగా వెయ్యికి పైగా ఎపిసోడ్స్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. అదే సమయంలో టీఆర్పీ రేటింగ్‌లోనూ సత్తా చాటుతూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే తెలుగులో నెంబర్ వన్ స్థానంలో నిలిచిన ఈ సీరియల్.. జాతీయ స్థాయిలో టాప్ ప్లేస్‌ను దక్కించుకుంది.

తెలుగింటి ఆడపడుచుగా వంటలక్క

తెలుగింటి ఆడపడుచుగా వంటలక్క

'కార్తీక దీపం' సీరియల్‌లో దీప అలియాస్ వంటలక్క పాత్రలో నటిస్తోంది మలయాళ బ్యూటీ ప్రేమీ విశ్వనాథ్. అద్భుతమైన నటనతో, హావభావాలతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ బ్యూటీ.. తద్వారా తెలుగింటి ఆడపడుచు అయిపోయింది. అంతేకాదు, చాలా తక్కువ సమయంలోనే మంచి పేరును సంపాదించుకుంది. తద్వారా వరుసగా ఆఫర్లను అందుకుంటూ సత్తా చాటుతోంది.

 హీరో నిరుపమ్ క్రేజ్ కూడా రెట్టింపుగా

హీరో నిరుపమ్ క్రేజ్ కూడా రెట్టింపుగా

బుల్లితెర శోభన్ బాబుగా పేరిందిన నటుడు నిరుపమ్ పరిటాల. 'కార్తీక దీపం' సీరియల్‌లో హీరో కార్తీక పాత్రలో నటిస్తోన్న అతడు కూడా తన సత్తాను నిరూపించుకుంటూనే ఉన్నాడు. అద్భుతమైన నటనతో లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంటున్నాడు. తద్వారా తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకున్నాడు. అదే సమయంలో పలు ఛానెళ్లలో సీరియళ్లు చేస్తూ హవాను చూపిస్తున్నాడు.

 ప్రేమీ విశ్వనాథ్‌పై నిరుపమ్ సెటైర్లతో

ప్రేమీ విశ్వనాథ్‌పై నిరుపమ్ సెటైర్లతో

నిరుపమ్ పరిటాల సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటాడన్న విషయం తెలిసిందే. తరచూ తనకు తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను అందులో పంచుకుంటూ ఉంటాడు. అదే సమయంలో సీరియల్ సెట్స్‌లో జరిగిన ఫన్నీ సంఘటనలను కూడా షేర్ చేసుకుంటాడు. ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో హీరోయిన్ ప్రేమీ విశ్వనాథ్‌పై సెటైరికల్ పోస్టు పెట్టి షాకిచ్చాడు.

Recommended Video

Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
వంటలక్క కాస్తా.. ఫొటోలక్కగా మారి

వంటలక్క కాస్తా.. ఫొటోలక్కగా మారి

తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎల్లో కలర్ టీషర్ట్ వేసుకున్న ఫొటోను షేర్ చేసిన నిరుపమ్.. 'సండేలో సో లవ్.. సీరియల్‌లో కోపంగా ఉన్నా కూడా షూటింగ్ తెగ పిక్స్ తీసేస్తుంది పాపం. ప్రేమీ విశ్వనాథ్ ఫొటోలక్క అయిపోతుందేమో పాపం' అంటూ సెటైర్ వేస్తూ పోస్ట్ పెట్టాడు. దీనికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఇక, ఈ పోస్టును ప్రేమీ కూడా లైక్ చేయడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X