డాక్టర్ బాబుకు దీప ముద్దులు: పబ్లిక్‌లో అలాంటి పనులు.. భయంగా ఉందంటూ నిరుపమ్ షాకింగ్ పోస్ట్

తెలుగులో వచ్చే డైలీ సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు ఏళ్ల తరబడి నడస్తున్నాయంటే దానికి అదే కారణం. బుల్లితెర చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ప్రేక్షకాదరణను అందుకుంటూ మూడేళ్లుగా సక్సెస్‌ఫుల్‌గా ప్రసారం అవుతోంది 'కార్తీక దీపం' సీరియల్. దీనికి తెలుగింటి ఆడపడుచులంతా అడిక్ట్ అయిపోయారు. అంతలా ఇది ప్రభావం చూపుతోంది. ఇక, తాజాగా ఈ సీరియల్‌లో ఓ ట్విస్ట్ కనిపించింది. దీనికి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో హీరో నిరుపమ్ షాకింగ్ పోస్ట్ పెట్టాడు. ఆ వివరాలు మీకోసం!

‘కార్తీక దీపం' రావడానికి కారణం అదే

‘కార్తీక దీపం' రావడానికి కారణం అదే

తెలుగులో నెంబర్ వన్ సీరియల్‌గా వెలుగొందుతోంది స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'కార్తీక దీపం'. మలయాళ సూపర్ హిట్‌ సీరియల్ 'కరుతముత్తు'కు ఇది రీమేక్‌ అన్న విషయం చాలా మందికి తెలియదు. ఇక, ఇందులో హీరో డాక్టర్ బాబు.. దీపను పెళ్లి చేసుకుని అనుమానంతో వదిలేస్తాడు. ఆ తర్వాత ఆమెకు పుట్టిన కవలలు తల్లిదండ్రులను ఎలా కలిపారనేదే ఈ సీరియల్ కథ.

మన ఆడపడుచుగా దీప/వంటలక్క

మన ఆడపడుచుగా దీప/వంటలక్క

'కార్తీక దీపం' సీరియల్‌కు మొదటి నుంచీ విశేషమైన స్పందన వస్తోంది. ఫలితంగా దీనికి భారీ స్థాయిలో రేటింగ్ లభిస్తోంది. ఇక, ఇందులో హీరోయిన్‌గా చేస్తున్న ప్రేమీ విశ్వనాథ్‌కు కూడా అదే స్థాయిలో పాపులారిటీ వచ్చింది. ఆమె నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అంతేకాదు, ప్రతి ఒక్కరూ ఆమెను తమ ఆడపడుచుగా చేసేసుకున్నారు. దీంతో ఆమె తెగ పాపులర్ అయింది.

ఇండియాలోనే ఫస్ట్ సీరియల్.. రికార్డు

ఇండియాలోనే ఫస్ట్ సీరియల్.. రికార్డు

'కార్తీక దీపం' ముందు బుల్లితెరపై వచ్చే బడా హీరోల సినిమాలు సైతం తట్టుకోలేకపోతున్నాయి. అంతేకాదు, ఎన్నో చానెళ్లలో వస్తున్న కామెడీ షోలు సైతం దీని ముందు దిగదుడుపే అన్నట్లుగా ఉంటున్నాయి. అంతలా రేటింగ్ సాధిస్తోందీ వంటలక్క సీరియల్. ఆరంభం నుంచీ ఇదే రేంజ్‌లో రేటింగ్ రాబడుతూ ఇండియాలోనే ఈ ఘనత సాధించిన మొదటి సీరియల్‌గా నిలుస్తోంది.

1000 ఎపిసోడ్స్.. రసవత్తరంగా రన్

1000 ఎపిసోడ్స్.. రసవత్తరంగా రన్

'కార్తీక దీపం' సీరియల్ రోజు రోజుకూ కొత్త మలుపు తిరుగుతూ సాగిపోతోంది. దీంతో ప్రేక్షకులకు మరింత మజాను పంచుతోంది. ఈ మధ్యనే ఇది 1000 ఎపిసోడ్స్‌ను కూడా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే, ప్రతి రోజూ ఏదో ఒక ఆసక్తికరమైన అంశాన్ని జోడించి ఈ సీరియల్‌ను విజయవంతంగా ప్రసారం చేస్తున్నారు. దీంతో దీనికి ఫ్యాన్స్ మరింతగా పెరిగిపోతున్నారు.

కార్తీక దీపంలో ట్వీస్ట్.. ముద్దుతో అలా

కార్తీక దీపంలో ట్వీస్ట్.. ముద్దుతో అలా


తాజాగా 'కార్తీక దీపం' సీరియల్‌లో ఓ భారీ ట్వీస్ట్ కనిపించింది. అదే.. దీపకు క్యాన్సర్ ఉందన్న న్యూస్. దీనికి ఆమె చికిత్స చేసుకోడానికి నిరాకరించడం.. వెంటనే భర్త డాక్టర్ బాబు ఎంట్రీ ఇచ్చి ఆమెను మందలించడం జరిగింది. అదే సమయంలో వీళ్లిద్దరి మధ్య ముద్దు సీన్ కూడా పెట్టారు. దీనికి భారీ రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఈ వీడియో తెగ వైరల్ అయిపోతోంది.

నిరుపమ్/డాక్టర్ బాబు షాకింగ్ పోస్ట్

నిరుపమ్/డాక్టర్ బాబు షాకింగ్ పోస్ట్

ఇన్ని రోజులూ దీపను ద్వేషించిన డాక్టర్ బాబును.. అది సీరియల్ అన్న విషయాన్ని మర్చిపోయి మరీ తెలుగు ప్రేక్షకులు సైతం చీదరించుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు భార్యకు అతడు మద్దతుగా నిలవడంతో వాళ్లంతా యూటర్న్ తీసుకున్నారు. ఫలితంగా హీరోను ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిరుపమ్ తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ షాకింగ్ పోస్టును పెట్టాడు.

భయంగా ఉంది.. అలాంటివి చేయొద్దు

భయంగా ఉంది.. అలాంటివి చేయొద్దు

ప్రస్తుతం కార్తీక దీపం గురించి ట్రెండ్ అవుతోన్న నేపథ్యంలో నిరుపమ్ 'దీపని యాక్సెప్ట్ చేశానన్న ఆనందంలో నాకు గుడి కట్టేస్తారా ఏంటి? పూజలు, క్షీరాభిషేకాలు, హారతులు.. వామ్మో.. జనాలకి అంత పనిపెట్టుకోకూడదు.. అసలే కోవిడ్ టైం... సర్వేజనా మాస్కులే దిక్కు' అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. దీనిపై ఫ్యాన్స్ ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. దీంతో నిరుపమ్ హైలైట్ అయ్యాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X