For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రిలేషన్‌షిప్‌పై నోరు జారిన నిరుపమ్: అక్కడ ఒకరు.. గదిలో మరొకరు అంటూ ఘోరంగా!

  |

  సాధారణంగా సినిమా హీరోలు, హీరోయిన్లకు మాత్రమే అభిమానులు ఉంటారన్న విషయం తెలిసిందే. అయితే, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సీరియళ్లలో నటించే వాళ్లకు కూడా ఫ్యాన్స్ ఉంటారు. అలా తెలుగు టెలివిజన్‌పై భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న వారిలో బుల్లితెర శోభన్ బాబుగా పేరు తెచ్చుకున్న నిరుపమ్ పరిటాల ఒకరు. 'కార్తీక దీపం' సీరియల్ ద్వారా అతడు మరింతగా ఫేమస్ అయ్యాడు. అదే సమయంలో వరుసగా సీరియళ్లను చేస్తూ దూసుకెళ్తోన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ స్పెషల్ ఈవెంట్‌లో నిరుపమ్ పరిటాల ఊహించని విధంగా కామెంట్లు చేశాడు. దీంతో పక్కనే ఉన్న అతడి భార్య మంజుల ఒక్కటి కొట్టేసింది. అసలేం జరిగిందో మీరే చూడండి!

  బుల్లితెరపై నిరుపమ్ సందడిగా

  బుల్లితెరపై నిరుపమ్ సందడిగా

  ప్రముఖ నటుడు ఓంకార్ కుమారుడిగా నిరుపమ్ పరిటాల బుల్లితెరపైకి అడుగు పెట్టాడు. కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రలతో మెప్పించిన అతడు.. ఆ తర్వాత హీరోగా మారి కొన్ని ధారావాహికల్లో నటించాడు. ఇలా వరుస సీరియళ్లతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. అద్భుతమైన నటనతో పాటు హావభావాలను చక్కగా పలికిస్తూ సుదీర్ఘ కాలంగా నిరుపమ్ సందడి చేస్తోన్నాడు.

  Bigg Boss Winner: బిందు మాధవి అందాల ఆరబోత.. తొలిసారి అలాంటి డ్రెస్‌లో కనిపించడంతో!

   ఆ హీరోయిన్‌తో ప్రేమ వివాహం

  ఆ హీరోయిన్‌తో ప్రేమ వివాహం

  నిరుపమ్ పరిటాల 'చంద్రముఖి' అనే సీరియల్‌లో హీరోగా పని చేశాడు. అందులో మంజుల హీరోయిన్‌గా చేసింది. ఈ సీరియల్ జరుగుతోన్న సమయంలోనే వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇలా చాలా కాలం పాటు ఒకరినొకరు ప్రేమించుకున్న వీళ్లిద్దరూ.. తర్వాత ఈ విషయాన్ని ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

  కార్తీక దీపంతో మరింతగా క్రేజ్

  కార్తీక దీపంతో మరింతగా క్రేజ్

  బుల్లితెర స్టార్ నిరుపమ్ పరిటాలకు యాక్టర్‌గా మంచి గుర్తింపు ఉంది. ఈ కారణంగానే అతడికి అభిమానులు కూడా భారీగా పెరిగారు. ఇక, 'కార్తీక దీపం' సీరియల్ వల్ల హీరో కార్తీక్ పాత్రలో నటించిన అతడు తన సత్తాను నిరూపించుకున్నాడు. అద్భుతమైన నటనతో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను భారీ స్థాయిలో సంపాదించుకున్నాడు. తద్వారా తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకున్నాడు.

  టాప్ విప్పేసి షాకిచ్చిన బిగ్ బాస్ లహరి: తొలిసారి ఓ రేంజ్‌లో అందాల ఆరబోత

   జంటగా టీవీ కపుల్ హడావిడి

  జంటగా టీవీ కపుల్ హడావిడి


  పెళ్లి తర్వాత నిరుపమ్ పరిటాల వరుసగా సీరియళ్ల మీద సీరియళ్లు చేస్తూ దూసుకుపోతున్నాడు. అయితే, మంజుల మాత్రం గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉంటోంది. అడపాదడపా కొన్ని స్పెషల్ ఈవెంట్లు, ఇంటర్వ్యూల్లో మాత్రమే ఆమె సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే ఆదివారం స్టార్ మాలో ప్రసారమైన 'ఈ వర్షం సాక్షిగా' అనే ఈవెంట్‌లో వీళ్లు జంటగా పాల్గొన్నారు.

  కీర్తి, మానస్ డ్యాన్స్.. కామెంట్లు

  కీర్తి, మానస్ డ్యాన్స్.. కామెంట్లు

  'ఈ వర్షం సాక్షిగా' ఈవెంట్లో 'కార్తీక దీపం' నటులు మానస్, కీర్తి రొమాంటిక్ డ్యాన్స్‌తో సందడి చేశారు. ఆ సమయంలో హోస్టుగా ఉన్న అవినాష్ 'మన హనీమూన్ ట్రిప్ కోసం ఒకడు ఆన్‌లైన్‌లో అప్లై చేస్తూనే ఉన్నాడు. అది రిజెక్ట్ అవుతూనే ఉంది' అని అన్నాడు. అప్పుడు అర్జున్ 'మా మహేశ్ ఎన్నిసార్లు చేసినా రిజెక్ట్ చేస్తున్నావంట. వాడు రావాల్సిన ప్లేస్‌లో ఇంకెవడో వస్తే చేయడా మరి' అని కామెంట్ చేశాడు.

  యాంకర్ స్రవంతి ఓవర్ డోస్ ట్రీట్: ఈ డ్రెస్‌ ఏంటో.. ఆ ఫోజులేంటో.. చూస్తే షాకే!

  మహేశ్ గురించి కీర్తికి ప్రశ్నలు

  బుల్లితెర నటులు మహేశ్, కీర్తి చాలా కాలంగా ప్రేమాయణం సాగిస్తున్నారన్న కామెంట్లతో హైలైట్ అవుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 'ఈ వర్షం సాక్షిగా' ఈవెంట్‌లో కీర్తి, మానస్‌కు జంటగా ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే యాంకర్ శ్రీముఖి.. 'నీ మదిలోని గదిలో మహేశ్ ఎక్కువగా ఉంటాడా? లేక మానస్ ఎక్కువగా ఉంటాడా' అంటూ కీర్తిని చిలిపి ప్రశ్నలు అడిగింది.

  మదిలో ఒకరు.. గదిలో ఒకరని

  మదిలో ఒకరు.. గదిలో ఒకరని

  కీర్తిని శ్రీముఖి అడిగిన ప్రశ్నకు అక్కడే ఉన్న నిరుపమ్ పరిటాల స్పందించాడు. ఆ వెంటనే అతడు 'ఏ మదిలో ఒకరు.. గదిలో ఒకరు ఎందుకు ఉండకూడదు' అంటూ ఊహించని విధంగా కామెంట్ చేశాడు. దీంతో పక్కన ఉన్న మంజుల అతడి వీపుపై ఓ దెబ్బ వేసింది. కాగా, నిరుపమ్ చేసిన ఈ కామెంట్‌ హాట్ టాపిక్ అవుతోంది. దీంతో ఈ ఎపిసోడ్ తెగ హైలైట్ అయిపోయింది.

  English summary
  Karthika Deepam Hero Nirupam Paritala and His Wife Manjula Participated in Ee Varsham Sakshiga Event.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X