కార్తీకదీపం ‘డాక్టర్ బాబు’ భార్యకూ తప్పని కష్టాలు.. ప్రేమను కురిపించండని కోరిన నిరుపమ్
ప్రస్తుతం మనం ఉన్నది సోషల్ మీడియా కాలంలోనే. ఈ సోషల్ మీడియా వల్ల ఎంత మంచి ఉందో.. అంతే స్థాయిలో చెడు కూడా ఉంది. మంచికి వాడుకునే వారి కన్నా చెడు పనులకు వాడే వారి సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. సాధారణ ప్రజలకు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ అవుతాయో లేదో తెలియదు గానీ సెలెబ్రిటీల ఖాతాలు మాత్రం హ్యాక్‌కు గురవుతుంటాయి. తాజాగా కార్తీక దీపం ఫేమ్ నిరుపమ్ భార్య సోషల్ మీడియా ఖాతా కూడా హ్యాక్ అయిందట.

కార్తీకదీపంతో సెన్సేషన్..
నిరుపమ్ అంటే చాలా మందికి తెలియక పోవచ్చు. అయితే డాక్టర్ బాబు, కార్తీక్ అంటే మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు ప్రతీ మహిళా గుర్తు పడుతుంది. కార్తీకదీపం సీరియల్ సత్తా అలాంటిది మరి. అందులో కార్తీక్ అలియాస్ డాక్టర్ బాబు పాత్రలో నిరుపమ్ నటనకు అందరూ ఫిదా అవుతుంటారు.

డాక్టర్ బాబుగానే గుర్తింపు..
ఇక నిరుపమ్ అనేది సొంత పేరైనా కార్తీక దీపం అంతలా క్లిక్ అవ్వడంతో అందులోని పాత్ర పేరే అందరికీ గుర్తుంటుంది. అలానే పిలుస్తారు కూడా. అయితే నిరుపమ్‌కు సోషల్ మీడియాలో భారీగానే ఫాలోయింగ్ ఉంటుంది. అతని భార్య మంజుల కూడా సీరియల్ నటియే. మంజుల పరిటాలకు కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.

అకౌంట్ హ్యాక్..
మంజుల ఇన్‌స్టాగ్రాం అకౌంట్ హ్యాక్ అయింది. మాములూగా మంజులకు అందులో దాదాపు యాభై వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఇలా హ్యాక్ అవ్వడంతో వారు ఒక్కసారిగా షాక్ అయినట్టున్నారు. ఆ అకౌంట్ వల్ల ఎవరికైనా ఏదైనా సమస్యలు వస్తాయేమో అని ఆలోచించి నిరుపమ్ ముందుగానే అందర్నీ హెచ్చించాడు.

కొత్త అకౌంట్..
పాత అకౌంట్ హ్యాక్ అయింది.. కొత్త అకౌంట్‌ను దయచేసి ఫాలో అవ్వండి.. మళ్లీ ప్రేమను కురిపించండి అని నిరుపమ్ కోరాడు. దీంతో మళ్లీ అందరూ ఆ కొత్త అకౌంట్‌ను ఫాలో అవుతూ మంజులపై ప్రేమను కురిపించారు.
Recommended Video

పెళ్లి రోజు..
అయితే నేడు ఈ డాక్డర్ బాబు నిజమైన పెళ్లి రోజు. మంజుల, నిరుపమ్‌లు ఒక్కటైన ఈ రోజును గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకున్నారు. మీ అందరి ప్రేమా ఆప్యాయతల వల్ల వివాహా వార్షికోత్సవ వేడుకలు ఇలా జరిగాయి అంటూ కేక్ కట్ చేస్తోన్న ఫోటోలను నిరుపమ్ షేర్ చేశాడు.


Click it and Unblock the Notifications











