For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కాలేజ్‌ టైమ్‌లో అలాంటి పనులు.. ఆ ఉద్దేశం లేకపోయినా: నిరుపమ్ భార్య మంజుల షాకింగ్ కామెంట్స్

  |

  గ్లామర్ ఫీల్డులో ప్రేమాయణాలు సర్వసాధారణమైన విషయాలు. సినీ రంగంలో ఎంతో మంది డేటింగ్‌లు చేస్తుంటారు. నచ్చితే తమ బంధాన్ని వివాహం వరకూ తీసుకెళ్లడం.. లేకుంటే మధ్యలోనే బ్రేకప్‌లు చెప్పేయడం వంటివి చేస్తుంటారు. ఇది వెండితెర మీదే కాదు.. ఈ మధ్య కాలంలో బుల్లితెరపైన కూడా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా తెలుగు టెలివిజన్ రంగంలో ఇప్పటికే పలువురు ప్రేమ వివాహాలు చేసుకున్నారు. అందులో 'కార్తీక దీపం' హీరో నిరుపమ్ పరిటాల ఒకడు.

  తోటి నటి మంజులతో చాలా కాలం ప్రేమాయణం సాగించిన అతడు.. కొన్నేళ్ల క్రితం ఆమెను వివాహమాడాడు. అప్పటి నుంచి బుల్లితెరకు దూరమైన మంజుల.. తాజాగా ఓ స్పెషల్ ఈవెంట్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఓ సీక్రెట్‌ను లీక్ చేసింది. ఆ సంగతులు మీకోసం!

  బుల్లితెరపై నిరుపమ్ పరిటాల హవా

  బుల్లితెరపై నిరుపమ్ పరిటాల హవా

  సుదీర్ఘ కాలం పాటు సినీ రంగంతో పాటు బుల్లితెరపై తనదైన శైలి నటనతో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ప్రముఖ నటుడు ఓంకార్ కుమారుడే నిరుపమ్ పరిటాల. ఫేమస్ యాక్టర్ కుమారుడిగా బుల్లితెరపైకి అడుగు పెట్టాడతను. కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రలతో మెప్పించిన అతడు.. ఆ తర్వాత హీరోగా మారి కొన్ని ధారావాహికల్లో నటించాడు.

  ఇలా వరుస సీరియళ్లతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. అద్భుతమైన నటనతో పాటు హావభావాలను చక్కగా పలికిస్తూ ఇప్పుడు నిరుపమ్ పరిటాల తెలుగు బుల్లితెరపై స్టార్ హీరోగా వెలుగొందుతోన్న విషయం తెలిసిందే.

  అందాలు ఆరబోసి షాకిచ్చిన రష్మిక మందన్నా: ఆమెను ఇంత ఘాటుగా ఎప్పుడూ చూసుండరు!

  అలా మొదలైన ప్రేమ... వివాహంతో

  అలా మొదలైన ప్రేమ... వివాహంతో

  కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే నిరుపమ్ పరిటాల 'చంద్రముఖి' అనే సీరియల్‌లో హీరోగా పని చేశాడు. అందులో కన్నడ బ్యూటీ మంజుల హీరోయిన్‌గా చేసింది. ఈ సీరియల్ జరుగుతోన్న సమయంలోనే వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇలా చాలా కాలం పాటు ఒకరినొకరు ప్రేమించుకున్న వీళ్లిద్దరూ.. తర్వాత ఈ విషయాన్ని ఇంట్లో చెప్పారు. ఇక, వీళ్ల బంధానికి ఇరు కుటుంబాలకు సంబంధించిన పెద్దలు సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిరుపమ్.. మంజుల వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

  కార్తీక దీపం నిరుపమ్ క్రేజ్ పెంచింది

  కార్తీక దీపం నిరుపమ్ క్రేజ్ పెంచింది

  బుల్లితెర స్టార్ నిరుపమ్ పరిటాలకు యాక్టర్‌గా మంచి గుర్తింపు ఉంది. ఈ కారణంగానే అతడికి అభిమానులు కూడా భారీగా పెరిగారు. ఇక, 'కార్తీక దీపం' సీరియల్ వల్ల హీరో కార్తీక్ పాత్రలో నటిస్తోన్న మన బుల్లితెర శోభన్ బాబుగా పేరిందిన నటుడు నిరుపమ్ పరిటాల కూడా తన సత్తాను నిరూపించుకుంటూనే ఉన్నాడు.

  అద్భుతమైన నటనతో లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. తద్వారా తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకున్నాడు. అదే సమయంలో పలు ఛానెళ్లలో సీరియళ్లు చేస్తూ హవాను చూపిస్తున్నాడు. దీంతో అతడి పేరు మారుమ్రోగిపోతోంది.

  టాప్‌ను అమాంతం పైకి లేపిన విష్ణుప్రియ: అందాలు కనిపించేలా ఘాటు ఫోజులతో రచ్చ

  సొంత మనిషి అయిన డాక్టర్ బాబు

  సొంత మనిషి అయిన డాక్టర్ బాబు

  సూపర్ హిట్ సీరియల్ 'కార్తీక దీపం'లో అందరి దృష్టిని ఆకర్షించింది అందులో హీరోయిన్‌గా నటిస్తోన్న ప్రేమీ విశ్వనాథ్ మాత్రమే. మలయాళ పరిశ్రమకు చెందిన ఆమెను.. ఈ సీరియల్ కోసం తెలుగులోకి తీసుకొచ్చారు. ఇక్కడ కూడా అదిరిపోయే నటనతో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకుంది. ఆమెతో పాటే ఇందులో డాక్టర్ బాబుగా నటించిన నిరుపమ్ పరిటాల కూడా మంచి ఆదరణను అందుకుంటున్నాడు. అతడి పాత్రను సొంతం చేసుకున్న తెలుగు అభిమానులు.. మా డాక్టర్ బాబు మా డాక్టర్ బాబు అంటూ సొంత మనిషిలా చూసుకుంటున్నారు ప్రేక్షకులు.

   చాలా రోజుల తర్వాత భార్యభర్తలు

  చాలా రోజుల తర్వాత భార్యభర్తలు

  వివాహం తర్వాత నిరుపమ్ పరిటాల వరుసగా సీరియళ్ల మీద సీరియళ్లు చేస్తూ దూసుకుపోతున్నాడు. అయితే, మంజుల మాత్రం గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉంటోంది. అడపాదడపా కొన్ని స్పెషల్ ఈవెంట్లు, ఇంటర్వ్యూల్లో మాత్రమే ఆమె సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే ఆదివారం జీ తెలుగులో ప్రసారం కాబోతున్న 'అల బృందావనములో' అనే షోలో వీళ్లిద్దరూ జంటగా పాల్గొన్నారు. ఇక, ఈ ఈవెంట్‌ను శ్రీముఖి హోస్ట్ చేయగా.. టాలీవుడ్ హీరోలు సుధీర్ బాబు, శ్రీ విష్ణు, సుశాంత్‌లు స్పెషల్ గెస్టులుగా వచ్చారు. అలాగే, సీరియల్ నటీనటులు ఎంట్రీ ఇచ్చారు.

  Intinti Gruhalakshmi August 26th Episode: లాస్యకు మాధవి షాక్.. వాళ్ల పొరపాటుతో నందూ కంపెనీ దివాళా

  పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన మంజుల

  పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన మంజుల

  కృష్ణాష్టమిని పురస్కరించుకుని ప్రసారం చేయబోతున్న 'అల బృందావనములో' ఈవెంట్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో అదిరింది షో కమెడియన్లు తమదైన స్కిట్లతో నవ్వించారు. అలాగే, శ్రీముఖిపై దారుణమైన పంచులు వేస్తూ ఆటపట్టించారు. ఇక, హీరోలు ముగ్గురూ తమ తమ సినిమాల ప్రమోషన్ కార్యక్రమాలు చేయడంతో పాటు వాళ్ల పర్సనల్ విషయాలను కూడా అందరితో షేర్ చేసుకున్నారు. ఇక, ఈ ఈవెంట్‌‌కు వచ్చిన మంజుల పరిటాల తన కాలేజ్ రోజుల్లో జరిగిన ఓ పర్సనల్ విషయాన్ని కూడా లీక్ చేసి అందరికీ షాక్ ఇచ్చేసింది.

  Recommended Video

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  సిగ్గుతో అలా బదులిచ్చిన నిరుపమ్

  సిగ్గుతో అలా బదులిచ్చిన నిరుపమ్

  ఈ ఈవెంట్‌లో పర్సనల్ సీక్రెట్స్‌ షేర్ చేసుకోమని శ్రీముఖి అడిగింది. దీంతో మంజుల మాట్లాడుతూ 'కాలేజ్‌లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ సిగరెట్ ట్రై చేయాలని అనుకుంది' అని చెప్పింది. దీంతో అందరూ నోరెళ్లబెట్టేశారు. అప్పుడు శ్రీముఖి 'నిరుపమ్ గారికి క్లోజ్ వేయండి' అంటూ అతడిపై ఫోకస్ చేసింది. ఆ తర్వాత మంజుల 'నాకైతే ఆ ఉద్దేశం లేదు' అంటూ బదులిచ్చింది. అప్పుడు నిరుపమ్ 'ఉద్దేశాల గురించి ఎందుకులే కానీ, ఆ తర్వాత ఏమైందో చెప్పు' అని భార్యను అడిగాడు. దీంతో అందరూ పగలబడి నవ్వుకున్నారు. ఈ ప్రోమో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

  English summary
  Karthika Deepam Hero Nirupam Paritala Recently Participated in Ala Brundavanamlo With His Wife Manjula. In This Show She Did Shocking Comments on Smoking.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X