ఈ వారం తెలుగు ఆడియన్స్ కి పండగే.. ఓటీటీలో ఏడు సినిమాలు.. ఏమేమంటే?

కరోనా కేసులు భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో భారత దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ ఆంక్షలు అన్నీ సడలించారు. ఇప్పటికే తెలంగాణలో థియేటర్లు పూర్తి స్థాయిలో నడుస్తూ ఉండగా ఆంధ్రప్రదేశ్ లో ఒక ఆట తక్కువగా ఆడిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని సినిమాల నిర్మాతలు రిస్క్ చేసి థియేటర్లలో విడుదల చేస్తోంటే మరికొందరు మాత్రం నేరుగా ఒటీటీలలో రిలీజ్ చేస్తున్నారు. జనం అంతా ఇళ్లకే పరిమితవుతున్న నేటి రోజుల్లో ఇప్పుడు వరుసగా చాలా సినిమాలు ఓటిటిలో రిలీజ్ కానున్నాయి. ప్రస్తుతానికి ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే కొన్ని ఆసక్తికర సినిమాల విషయానికి వస్తే దాదాపుగా ఈ వారం ఐదు సినిమాలు ఓటీటీ వేదికగా రిలీజ్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే

ఆరు సినిమాలు ఒక వెబ్ సిరీస్

ఆరు సినిమాలు ఒక వెబ్ సిరీస్

ఇక ఈ సినిమాలలో నితిన్ యొక్క మాస్ట్రో ప్రధానమైనది. ఈ సినిమా డిస్నీ + హాట్‌స్టార్‌లో డైరెక్ట్-టు-ఒటీటీ విడుదల కాబోతోంది. ఇవి కాక మరో చిన్న చిత్రం, ప్రియురాలు కూడా సోనీలైవ్‌లో నేరుగా స్ట్రీమ్ కాబోతోంది. ఇక డిస్నీ + హాట్‌స్టార్‌లో అన్ హెర్డ్ అనే ఒక కొత్త వెబ్ సిరీస్ యొక్క సీజన్ 1 కూడా ఈరోజు నుంచే స్ట్రీమ్ కాబోతోంది. తమిళ చిత్రం అనబెల్‌ సేతుపతి సేతుపతి (హాట్‌స్టార్‌లో) మరియు హిందీ చిత్రం అంకహి కహనియా (నెట్‌ఫ్లిక్స్) తెలుగు డబ్బింగ్ వెర్షన్‌లు ఈరోజు విడుదలవుతున్నాయి. గత నెలలో థియేటర్లలో విడుదలైన సునీల్ కనబడుటలేదు మరియు సుశాంత్ యొక్క 'ఇచ్చట వాహనాలు నిలువ రాదు' ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఆ సినిమాలు కూడా ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారు.

నితిన్ మాస్ట్రో

నితిన్ మాస్ట్రో

యువ హీరో నితిన్ మాస్ట్రో అనే థ్రిల్లర్‌లో నటించిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఈ సినిమా థియేటర్స్‌లో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమా ఈ రోజు నుంచి హాట్ స్టార్‌లో అందుబాటులోకి రానుంది. హిందీలో ఘన విజయాన్ని అందుకున్న 'అంధాధూన్' సినిమాకు తెలుగు రీమేక్‌‌గా ఈ సినిమాని మేర్లపాక గాంధీ తెరకెక్కించారు. ఈ రోజు నుంచి అంటే రాత్రి 12:00 గంటల నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అయ్యేందుకు సిద్దం అవుతుంది.. సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హిందీ అంధధున్ చిత్రానికి ఇది రీమేక్ కావడం తో సినిమా పై మరింత ఆసక్తి నెలకొంది.

ప్రియురాలు

ప్రియురాలు

పృథ్వీ మేడవరం, కౌషిక్ రెడ్డి, కల్పాల మౌనిక, కామాక్షి భాస్కర్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా "ప్రియురాలు". రామరాజు సినిమా బ్యానర్ మీద రామరాజు, అజయ్ కర్లపూడి ఈ సినిమాని నిర్మించారు. నిర్మాణ బాధ్యతలు చూస్తూనే "ప్రియురాలు" చిత్రానికి దర్శకత్వం వహించారు రామారాజు. ఇక ఈ సినిమా ట్రైలర్ సినిమా మీద ఆసక్తి పెంచింది. ఎక్స్‌‌ట్రా మారిటర్ అఫైర్స్, ఎక్స్‌‌ట్రా మారిటల్ లవ్ అని చెబుతూ ట్రైలర్ లో ఆసక్తి రేపిన ఈ సినిమా సోని లివ్‌‌ ఓటీటీలోఈ నెల 17న అంటే ఈరోజు రాత్రి 12:00 గంటల నుండి స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది.

డిస్నీ + హాట్‌స్టార్‌లో అన్ హెర్డ్

డిస్నీ + హాట్‌స్టార్‌లో అన్ హెర్డ్


భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో సామాన్యుడి దృక్పథాన్ని ఆవిష్కరించిన డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొట్టమొదటి తెలుగు స్పెషల్ ఈ 'అన్‌హెర్డ్'. స్పెషల్ సంభాషణలను కలిగిన ఈ సిరీస్ 17 సెప్టెంబర్ 2021 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీం కాబోతోంది. ఆదిత్య కె.వి రచించి, దర్శకత్వం వహించిన ఈ అన్‌హెర్డ్‌ను ఎల్లనార్ ఫిల్మ్స్‌కు చెందిన రాధిక లావు నిర్మించారు. బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్ర్యం కోసం భారతదేశ పోరాటంలో పుట్టుకొచ్చిన సిద్ధాంతాల చుట్టూ హైదరాబాద్ నగరం మార్పుకు కేంద్రంగా ఎలా మారిందో ఈ సీరీస్ లో చూపించారు. ఈ సీరీస్ లో శ్రీనివాస్ అవసరాల, బాలాదిత్య, చాందిని చౌదరి, ప్రియదర్శి మరియు అజయ్‌ లాంటి టాలెంటెడ్ నటులు ఉన్నారు.

అనబెల్‌ సేతుపతి

అనబెల్‌ సేతుపతి

విజయ్‌ సేతుపతి, తాప్సీ కలిసి నటించిన హారర్‌ కామెడీ 'అనబెల్‌ సేతుపతి', ఈ సినిమా తెలుగు, తమిళంతో పాటు మొత్తం 5 భాషల్లో తెరకెక్కింది. ఈ నెల 17న అంటే ఈరోజు అర్ధరాత్రి డిస్నీ+హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమ్ కానుంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది.. రాజమహల్‌ చుట్టూ తిరిగే హారర్‌ కామెడీ కధలు మనకు కొత్త కాదు అలాంటి కధతోనే మన ముందుకు వస్తున్నారు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్‌, రాజేంద్ర ప్రసాద్‌, జగతిబాబు, సురేఖవాణిలు కీలకపాత్రల్లో నటించారు. హిందీ చిత్రం అంకహి కహనియా (నెట్‌ఫ్లిక్స్) తెలుగు డబ్బింగ్ వెర్షన్‌ కూడా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతోంది.

Recommended Video

Cinema Bandi Trailer Review | బాహుబలి లా విజువల్ వండర్ కాదు ! || Filmibeat Telugu
సునీల్ కనబడుటలేదు - సుశాంత్ 'ఇచ్చట వాహనాలు నిలువ రాదు'

సునీల్ కనబడుటలేదు - సుశాంత్ 'ఇచ్చట వాహనాలు నిలువ రాదు'

సునీల్ ప్ర‌ధాన పాత్ర పోషించిన చిత్రం క‌న‌బ‌డుట‌లేదు. ఓ మిస్సింగ్ కేసు, మ‌ర్డ‌ర్, ఇన్విస్టిగేష‌న్‌ నేపథ్యంలో క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి ఎమ్‌. బాలరాజు దర్శకత్వం వహించగా కొన్నాళ్ళ క్రితం థియేటర్లో రిలీజ్ అయింది. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించలేదు, ఈ క్రమంలో సినిం ఓటీటీలో స్ట్రీం కానుంది, వర్మకు చెందిన స్పార్క్ ఒటీటీలో ఈ సినిమ అందుబాటులోకి రానుంది. సుశాంత్ అక్కినేని హీరోగా నటించిన 'ఇచ్చట వాహనులు నిలుప రాదు' సినిమా ఆహా లో అందుబాటులోకి రానుంది.

Read more about: aha disney hotstar sonyliv
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X