twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తమిళ బిగ్‌బాస్ హౌస్‌కు పోటెత్తిన వరద.. హోటల్‌కు కంటెస్టెంట్ల తరలింపు.. నిలిచిపోయిన షో!

    |

    బిగ్‌బాస్ తమిళం 4 షోకు ఊహించని షాక్ తగిలింది. తమిళనాడు రాష్ట్రాన్ని తుఫాన్ అతలాకుతలం చేయడంతో బిగ్‌బాస్ ఇంటిని కూడా వరదలు ముంచెత్తాయి. బిగ్‌బాస్ ఇంటిలోకి భారీగా వరద రావడంతో కంటెస్టెంట్లను మరో ప్రాంతానికి తరలించారు. ఇంకా మరిన్ని వివరాల్లోకి వెళితే..

    తమిళనాడులో భారీ వర్షాలతో

    తమిళనాడులో భారీ వర్షాలతో

    గత రెండు మూడు రోజులుగా తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురస్తున్నాయి. నివర్ తుఫాన్ జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. రెండు రోజులుగా విద్యుత్ సదుపాయానికి అంతరాయం కూడా కలిగింది. పలు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.

    బిగ్‌బాస్ హౌస్ జలమయం

    బిగ్‌బాస్ హౌస్ జలమయం

    ఇలాంటి పరిస్థితుల్లో చెన్నైలోని బిగ్‌బాస్‌ హౌస్‌ కూడా పూర్తిగా జలమయం అవ్వడంతో నిర్వాహకులు ఆందోళనకు గురయ్యారట. ఇంటి సభ్యులను వరద ముంపుకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకొన్నారు. ఇంటి సభ్యులను నగరంలోని ఫైవ్ స్టార్ హోటల్‌కు తరలించినట్టు సమాచారం.

    చెంబరాబక్కమ్ డామ్ గేట్లు ఎత్తివేయడంతో

    చెంబరాబక్కమ్ డామ్ గేట్లు ఎత్తివేయడంతో


    వరద ముంపు కారణంగా సమీపంలో ఉన్న చెంబారాబక్కమ్ డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో భారీగా బిగ్‌బాస్ హౌస్‌కు నీరు చేరింది. ఇంటిలోని కంటెస్టెంట్లు భయంతో వణికిపోయారు. నిర్వాహకులను తమను వేరే చోటికి తరలించాలని కోరడంతో వారిని ఫైవ్ స్టార్ హోటల్‌కు తరలించారు అని తమిళ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

    నాలుగు గంటలకుపైగానే

    నాలుగు గంటలకుపైగానే

    బిగ్‌బాస్ ఇంటిలోకి చేరిన నీటిని క్లియర్ చేయడానికి దాదాపు నాలుగు గంటలకుపైగానే సమయం పట్టింది. పాక్షికంగా ధ్వంసమైన ఇంటిని మళ్లీ పునరుద్దరించారు. దాదాపు 4 గంటలపాటు బిగ్‌బాస్ కంటెస్టెంట్లను హౌస్ నుంచి తరలించి హోటల్‌ ఉంచారు. బయట ఉన్న కెమెరాలకు ఎలాంటి నష్టం సంభవించలేదు. షోకు కొంచెం ఆటకం కలిగినా.. ప్రస్తుతం మళ్లీ యదావిధిగా కొనసాగుతున్నది.

    కంటెస్టెంట్లను హోటల్‌కు తరలింపు

    కంటెస్టెంట్లను హోటల్‌కు తరలింపు

    ఇంటి సభ్యులను గ్రూపుగా కాకుండా వేర్వేరుగా ఇంటి నుంచి తరలించినట్టు సమాచారం. ఈ సందర్బంగా కళ్లకు గంతలు కట్టి ఒకరిని మరొకరితో మాట్లాడకుండా చర్యలు తీసుకొన్నట్టు తెలిసింది. ఒకరిని ఒకరు కలుసుకోకుండా నిర్వాహకులు పక్కాగా జాగ్రత్తలు తీసుకొన్నట్టు సమాచారం.

     రాత్రికల్లా కంటెస్టెంట్లు ఇంటికి

    రాత్రికల్లా కంటెస్టెంట్లు ఇంటికి

    ఆ తర్వాత బిగ్‌బాస్ ఇంటిని ముంచెత్తిన నీటిని యుద్ధ ప్రాతిపాదికన పంపుసెట్లతో బయటకు పంపిచారు. ఆ తర్వాత అన్ని రకాలుగా పునరుద్ధణ చేసిన అనంతరం రాత్రికి కంటెస్టెంట్లను బిగ్‌బాస్ హౌస్‌కు చేర్చారు. అయితే నిర్వాహకులు అలాంటిదేమీ లేదు. ఇంటి సభ్యులు టాస్కులు చేస్తున్నారు. బిగ్‌బాస్ ఇంటిని వరద నీరు ముంచెత్తిందనే వార్తలన్నీ రూమర్లే అంటూ ఖండించారు.

    Recommended Video

    Tollywood Producres Meeting With AP CM YS Jagan Mohan Reddy
    నెటిజన్ల అసంతృప్తి

    నెటిజన్ల అసంతృప్తి

    ఇక బిగ్‌బాస్ కంటెస్టెంట్లను బయటకు తరలించే సమయంలో నిర్వాహకులు కాస్త కఠినంగా వ్యవహరించడంపై నెటిజన్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇంత కఠినంగా వ్యవహరించడం అవసరమా? వాళ్లు మనుషులే కదా అంటూ కొందరు కామెంట్లు విసిరారు.

    English summary
    Nivar Cyclone Effect for Bigg Boss Tamil 4: Contestants moved to Hotel
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X