3 రోజుల్లో ఎలిమినేట్ చేయండి.. బిగ్‌బాస్ గ్రాండ్ ఓపెనింగ్ రోజునే నాగార్జునకు షాకింగ్ రిక్వెస్ట్!
బిగ్‌బాస్ తెలుగు 8 రియాలిటీ షో గ్రాండ్‌గా మొదలైంది. ఇంటిలోకి ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా కంటెస్టెంట్లను పరిచయం చేస్తూ ఇంటిలోకి పంపారు. అలాగే కంటెస్టెంట్లను ఇంటిలోకి పంపుతుండగా రానా దగ్గుబాటి, నివేదా థామస్ స్టేజీ పైకి వచ్చి తమ సినిమాను ప్రమోట్ చేశారు. ఆ స్టేజీ మీద జరిగిన సరదా, ఫన్ ఎలా సాగిందంటే?
బిగ్‌బాస్ తెలుగు 8 గ్రాండ్ ఈవెంట్ లాంచ్ సందర్భంగా 35: చిన్న కథ కాదు సినిమా యూనిట్ తెరపైకి వచ్చారు. రానా దగ్గుబాటి, నివేదా థామస్, దర్శకుడు వచ్చారు. రానా ఈ సినిమాను ప్రజెంట్ చేస్తున్నారు. ఈ సందర్బంగా ఈ మూవీ ట్రైలర్‌ను ప్రదర్శించారు. ఈ సందర్బంగా మ్యాథ్స్ అంటే నాకు ఇష్టం అని నాగార్జున చెప్పారు.

అయితే ఇప్పటి వరకు జరిగిన ప్రమోషన్స్‌లో ఎవరూ కూడా మ్యాథ్స్ ఇష్టమని చెప్పలేదు. కానీ మీరు ఒక్కరే నాకు ఇష్టమని చెప్పారు అని నివేదా అన్నారు. అయితే నాగార్జున అమెరికాలో ఇంజనీరింగ్ చేశారని చెప్పారు. అలా ఫన్నీగా సంభాషణ జరిగిన తర్వాత వారికి ఓ టిస్టు ఇచ్చారు.
ఇదిలా ఉండగా నాగార్జున వారికి ఓ టాస్క్ ఇచ్చారు. మీరు ఇంటిలోకి వెళ్తున్నారు. దాదాపు వారం రోజులు ఉండాలని సూచించారు. అయితే సినిమా రిలీజ్ ఉంది. కాబట్టి మేము హౌజ్‌లో ఉంటే కుదరదు అని అంటే.. డైరెక్టర్ ఉంటాడు. ఆయన చూసుకొంటాడు అని నాగార్జున చెప్పాడు.
అయితే అదేం లేదు. మీరు కన్ఫెషన్ రూమ్ ఉంటుంది. అక్కడ నుంచి లైవ్ కెమెరాలతో మీరు మీ ప్రోమోషన్స్ చేసుకోవచ్చు అని అంటే.. అయితే ఓకే అక్కడి నుంచి ప్రమోషన్స్ చేసుకోవడం బాగుంటుంది అని అంటే... ఇక్కడ కూడా రానా భలే ప్లాన్ చేస్తున్నాడు అని అన్నారు.
అయితే నేను బిగ్‌బాస్ ఇంటిలోకి వెళ్తాను. కానీ నన్ను మాత్రం 3 రోజుల్లోనే ఎలిమినేట్ చేయండి అని నివేదా థామస్ రిక్వెస్ట్ చేశారు. అయితే రానాను 7వ రోజులు మాత్రం ఇంటిలో ఉండేలా చేస్తాను అని నాగార్జున కౌంటర్ ఇచ్చారు. అయితే ఐదు రోజులు వద్దు సార్.. ఆయన్నీ 5 రోజులు ఉంచండి.. దాంతో 35 అవుతుంది అని టైటిల్ జస్టిఫికేషన్ ఇచ్చారు.
అయితే మిమ్మల్ని ఇంటిలో ఉంచడం నాకు ఇష్టం లేదు. కానీ ఇంటిలోకి వెళ్లి ఉన్న రెండు జంటలతో ఓ గేమ్ ఆడించి బయటకు రండి. మాకు అంతే చాలూ అంటూ నాగార్జున వివరించారు. అయితే ఇంటిలోకి వెళ్లిన రానా.. రెండు జంటలు.. యష్మీ గౌడ, నిఖిల్.. అలాగే అభయ్, ప్రేరణతో గేమ్ ఆడించి బయటకు వచ్చారు.


Click it and Unblock the Notifications











