For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  No.1 Kodalu నిర్మాత మృతి.. తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో మరో విషాదం

  |

  కరోనా మహమ్మారి ఎవర్నీ వదలడం లేదు. సెలబ్రిటీల నుంచి సామాన్యుల దాకా ప్రతి ఒక్కరినీ టెన్షన్ పెడుతోంది. కరోనా మొదటి వేవ్ కాస్త ఫర్వాలేదు అనిపించినా రెండో వేవ్ మాత్రం అనేక మందిని బలి తీసుకుంటోంది. కరోనా వచ్చి తగ్గాక కూడా అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే తెలుగు టెలివిజన్ రంగానికి సంబంధించి యాంకర్ ప్రదీప్ తన తండ్రిని పోగొట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా తెలుగు టెలివిజన్ రంగానికి చెందిన ఒక ప్రముఖ నిర్మాత కన్నుమూసినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే

  సీరియల్ నిర్మాత

  సీరియల్ నిర్మాత


  దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కరోనా సెకండ్ వేవ్ ధాటికి దాదాపు అన్ని సినిమాలు షూటింగ్ లతో పాటు సీరియల్ షూటింగ్ కూడా నిలిచిపోయాయి. ఇప్పటికే దాదాపు నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ సుమారు పది పదిహేను రోజుల నుంచి ఇళ్లలోనే గడుపుతున్నారు. అయితే తాజాగా తెలుగు టెలివిజన్ రంగానికి చెందిన ఒక ప్రొడ్యూసర్ కన్నుమూసినట్లు సమాచారం.

  హార్ట్ స్ట్రోక్ తో బాధపడుతూ

  హార్ట్ స్ట్రోక్ తో బాధపడుతూ

  జీ తెలుగు ఛానల్ లో నెంబర్ వన్ కోడలు అనే డైలీ సీరియల్ నిర్మాత హరీష్ చిగురుపాటి ఈ రోజు మే 29 తెల్లవారుజామున కన్నుమూశారు అని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన వయస్సు 41 సంవత్సరాలు.. ఆయన హార్ట్ స్ట్రోక్ తో బాధపడుతూ హాస్పిటల్ లో చేరినట్లు తెలుస్తోంది. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు.

  కరోనా బారిన పడి

  కరోనా బారిన పడి

  ఇక హరీష్ ఈ మధ్యనే కరోనా బారిన పడి కోలుకున్నాడని తెలుస్తోంది. ఆ తర్వాత ఆయనకు కార్డియాక్ అరెస్ట్ కాగా దానికోసం శస్త్రచికిత్స కూడా చేయించుకున్నట్లు టెలివిజన్ ఇండస్ట్రీ వర్గాల సమాచారం.. ఈరోజు తెల్లవారుజామున నిద్రలో ఉండగా ఆయనకు గుండెపోటు రావడంతో అప్పటికప్పుడు ఆయనను హాస్పిటల్ కి తరలించారు. అయితే హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూసినట్లు సమాచారం. ఆయన స్వస్థలమైన విజయవాడలో అంత్యక్రియలు జరుగుతున్నాయి.

  సుధాచంద్రన్ సంతాపం

  సుధాచంద్రన్ సంతాపం


  ఇక నెంబర్ వన్ కోడలు సీరియల్ లో ప్రధాన పాత్ర పోషిస్తున్న సుధా చంద్రన్ ఆయన మరణానికి సంతాపం తెలియజేశారు. సోషల్ మీడియా వేదికగా సుధా చంద్రన్ హరీష్ కి సంతాపం వ్యక్తం చేశారు. ఈ రోజు ఉదయం చాలా షాకింగ్ వార్త చూస్తూ మేల్కొన్నానని పేర్కొన్న ఆమె, హరీష్ చాలా తక్కువ మాట్లాడతాడని, చాలా మంచి వ్యక్తి అని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిని కోల్పోవడం బాధ కలిగిస్తోందని సుధా చంద్రన్ పేర్కొన్నారు.

  Sharwanand Sends Legal Notice To His Producers, చిచ్చు పెట్టిన కోట్లు ! || Filmibeat Telugu

  మిస్ అవుతూనే ఉంటాం


  ఇక ఈ సీరియల్ లో హీరోయిన్ పాత్రలో నటిస్తున్న నటి మధుమిత కూడా ఆయన మరణానికి తన సంతాపం వ్యక్తం చేశారు. నెంబర్ వన్ కోడలు షో వెనుక ఉన్న వ్యక్తి, ఈ షోకి మూల కారణం, ఎవరివల్ల ఈ షో చేస్తున్నామో, ఆయనే మనందరికీ దూరమయ్యారు. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను సార్ మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటామని ఆమె పేర్కొన్నారు.

  English summary
  Zee telugu's No.1 Kodalu producer Harish, 41, passed away in the wee hours of today (May 29). He reportedly suffered a heart stroke and was declared dead by the doctors.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X