twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్ బాస్‌ తెలుగు సీజన్ 3: గుత్తా జ్వాలకు కోపమొచ్చింది, డీల్ నచ్చలేదా?

    |

    బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కాక పోయినా ఆమె పేరు తరచూ టాలీవుడ్ సర్కిల్‌లో వినిపిస్తూనే ఉంటుంది. అందుకు కారణం జ్వాల ఎక్కువగా సినిమా రంగానికి చెందిన వ్యక్తులతో క్లోజ్ రిలేషన్‌ మెయింటేన్ చేయడమే.

    ఆ మధ్య నితిన్ హీరోగా వచ్చిన 'గుండె జారి గల్లంతయ్యిందే' సినిమాలోని ఓ పాటలో గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వడంతో గుత్తా జ్వాల మూవీ ఇండస్ట్రీలో సెటిలవ్వాలనుకుంటోందనే వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే అలాంటి ప్రయత్నాలు ఆమె చేయలేదు.

    గుత్తా జ్వాలకు కోపమొచ్చింది

    గుత్తా జ్వాలకు కోపమొచ్చింది

    త్వరలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో మరోసారి గుత్తా జ్వాల పేరు హాట్ టాపిక్ అయింది. ఈ సీజన్లో జ్వాల కూడా పాల్గొనబోతోందనే రూమర్స్ హల్ చల్ చేస్తున్నాయి. ఈ వార్తలతో ఆగ్రహానికి గురైన జ్వాల ట్విట్టర్ ద్వారా రియాక్ట్ అయ్యారు. నేను బిగ్ బాస్ చేయడం లేదు, అవి రూమర్స్ మాత్రమే అని స్పష్టం చేశారు.

    డీల్ నచ్చలేదా?

    డీల్ నచ్చలేదా?

    రెమ్యూనరేషన్ విషయంలో డీల్ కుదరకే జ్వాల ఈ రియాల్టీ షోలో పాల్గొనడానికి నో చెప్పిందనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి. కారణాలు ఏమైనా ‘బిగ్ బాస్ తెలుగు 3'లో గుత్తా జ్వాల ఉండబోదని స్పష్టం అయింది. అయితే ఈ షోలో కంటెస్ట్ చేసేది ఎవరు? అనేది త్వరలో అఫీషియల్‌గా వెల్లడికానుంది.

    ఈ సారి హోస్ట్ ఎవరబ్బా?

    ఈ సారి హోస్ట్ ఎవరబ్బా?

    మరో వైపు ఈ సారి షో హోస్ట్ చేసేది ఎవరు? అనే విషయంలో కూడా ఉత్కంఠ నెలకొని ఉంది. మొదటి సీజన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, రెండో సీజన్ నాని హోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మూడో సీజన్ చేయడానికి నాని నో చెప్పడంతో... నాగార్జునను రంగంలోకి దింపుతున్నట్లు టాక్.

    బిగ్ బాస్ తెలుగు 3

    బిగ్ బాస్ తెలుగు 3

    ప్రస్తుతం వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో... ఈ టోర్నమెంట్ ముగిసిన తర్వాత బిగ్ బాస్ షో తెలుగు 3వ సీజన్ ప్రారంభించే అవకాశం ఉంది. ఈ సారి షో కోసం టాప్ సెలబ్రిటీలను ఎంపిక చేస్తున్నారని, ఈ మేరకు ప్రయత్నాలు మొదలైనట్లు టాక్.

    English summary
    "No big boss for me!!! All false rumours!!" Gutta Jwala tweeted. Jwala Gutta is a retired left-handed Indian badminton player. Born in Wardha to a Chinese mother and a Telugu father, she began playing badminton at a young age.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X