twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కంటెస్టెంట్లు అందరికీ షాకిచ్చిన బిగ్ బాస్: ఇకపై అందరూ ఎలిమినేషన్‌ జోన్‌లోనే!

    |

    తెలుగులో బిగ్ బాస్‌కు లభించే ఆదరణ మరే షోకూ దక్కదనడంలో సందేహం లేదు. అంతలా ఈ రియాలిటీ షో కొన్నేళ్లుగా బుల్లితెరపై ప్రభావాన్ని చూపిస్తోంది. అందుకే వరుసగా మూడు సీజన్లను కూడా పూర్తి చేసుకోగలిగిందీ షో. కొద్ది రోజులుగా ప్రసారం అవుతోన్న నాలుగో సీజన్‌కు సైతం మంచి స్పందనే వస్తోంది. ఇప్పటికే ఈ సీజన్ 80 రోజులు పూర్తి చేసుకుంది. ఇలాంటి తరుణంలో బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న ఏడుగురు కంటెస్టెంట్లకు కోలుకోలేని షాక్ ఇచ్చారు షో నిర్వహకులు. ఏకంగా అందరినీ ఎలిమినేషన్ జోన్‌లోకి నెట్టేశారు. అసలేం జరిగింది.? పూర్తి వివరాలు మీకోసం.!

    ఈ సీజన్ చాలా ప్రత్యేకం.. రికార్డుల పర్వం

    ఈ సీజన్ చాలా ప్రత్యేకం.. రికార్డుల పర్వం

    తెలుగులో బిగ్ బాస్ షో ఎంత స్పెషల్ అనేది దానికి వస్తున్న స్పందనను బట్టి అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో ఈ షో ప్రభావం ఎంతుంది అనే విషయం మాత్రం ఇప్పటి వరకు నమోదైన రికార్డులను బట్టి లెక్కించవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ పూర్తయిన మూడు సీజన్లకు మించిన రేటింగ్‌తో నాలుగో సీజన్‌ సాగిపోతోంది. ఫలితంగా రికార్డులు క్రియేట్ అవుతున్నాయి.

    షోలో కీలక మార్పులు.... సూపర్ సక్సెస్

    షోలో కీలక మార్పులు.... సూపర్ సక్సెస్

    బిగ్ బాస్ షో తెలుగులో ఎప్పుడు ప్రసారం అయినా మంచి ఆదరణను అందుకుంటోంది. అదే సమయంలో షో జరిగే తీరుపై పలు సందర్భాల్లో విమర్శలు సైతం వెల్లువెత్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో నాలుగో సీజన్‌ను సరికొత్తగా డిజైన్ చేశారు. ఇందులో భాగంగానే గతంలో చూడని టాస్కులు తీసుకొచ్చారు. కొన్ని సర్‌ప్రైజ్‌లూ అమలు చేశారు. దీంతో షో సూపర్ సక్సెస్ అవుతోంది.

    ఆ టాస్కును మార్చారు.. అసిస్టెంట్ కూడా

    ఆ టాస్కును మార్చారు.. అసిస్టెంట్ కూడా

    గతంలో జరిగిన అన్ని సీజన్లలోనూ కెప్టెన్సీ టాస్క్‌ ఒకేలా సాగింది. కానీ, ఈ సీజన్‌లో మాత్రం దానిలో చాలా మార్పులు చేశారు. అంతేకాదు, ఈ సారి కెప్టెన్‌కు అసిస్టెంట్‌గా ఓ పోస్టును క్రియేట్ చేశారు. అదే రేషన్ మేనేజర్ పదవి. లగ్జరీ బడ్జెట్ టాస్క్ ద్వారా హౌస్‌మేట్స్ గెలుచుకున్న రేషన్ సరుకులను సరిపడా వాడేందుకు ఈ పోస్టును తీసుకు వచ్చారు నిర్వహకులు.

    కాపీ ఆరోపణలు.. చివరి విజయం ఆమెదే

    కాపీ ఆరోపణలు.. చివరి విజయం ఆమెదే

    బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో వారం మధ్యలో జరిగే టాస్కులన్నీ కొత్తగానే సాగుతున్నాయి. అయితే, కెప్టెన్సీ టాస్కులో మాత్రం కొత్తదనం చూపించేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు షో నిర్వహకులు. ఇందుకోసం వేరే భాషల్లో వచ్చే కంటెంట్‌ను తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా, ఈ సారి కెప్టెన్సీ టాస్క్‌లో ఎక్కువ సార్లు పోటీ చేసి ప్రస్తుత కెప్టెన్‌గా ఉంది దేత్తడి హారిక.

    కంటెస్టెంట్లు అందరికీ షాకిచ్చిన బిగ్ బాస్

    కంటెస్టెంట్లు అందరికీ షాకిచ్చిన బిగ్ బాస్

    బిగ్ బాస్ షో చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం జరిగేది మినహాయిస్తే ఇంక మూడు వారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ తర్వాత గ్రాండ్ ఫినాలే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ షోలో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. దీంతో షో రంజుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఏడుగురు కంటెస్టెంట్లకూ భారీ షాక్ ఇవ్వబోతున్నారు షో నిర్వహకులు.

    Recommended Video

    Bigg Boss 4 Telugu : ఈ వారం బిగ్ బాస్ నుంచి దివి ఎలిమినేటెడ్!
    కంటెస్టెంట్లందరూ ఎలిమినేషన్‌ జోన్‌లోనే

    కంటెస్టెంట్లందరూ ఎలిమినేషన్‌ జోన్‌లోనే

    తాజా సమాచారం ప్రకారం... బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో ఇకపై కెప్టెన్ ఉండడట. ప్రస్తుతం ఉన్న దేత్తడి హారికనే చివరి కెప్టెన్ అని తెలుస్తోంది. అంటే వచ్చే మూడు వారాలు ఎవరికీ ఇమ్యూనిటీ లభించదు. సో.. అందరు కంటెస్టెంట్లూ ఎలిమినేషన్ జోన్‌లో ఉన్నట్లే లెక్క. ఒకవేళ నామినేట్ కాని వాళ్లో.. ఏదైనా స్పెషల్ పవర్ గెలుచుకున్న వాళ్లో తప్పించుకునే చాన్స్ ఉంటుంది.

    English summary
    Bigg Boss is the Telugu language version of the reality TV series Bigg Boss, which itself is an adaptation of the Dutch series Big Brother. It airs on Star Maa and streams on digital platform Hotstar. Season 1 was hosted by Jr NTR premiered on 16 July 2017.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X