Bigg Boss Telugu 7: ఈవారం నామినేషన్స్‌లో టాప్ కంటెస్టెంట్లు.. డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సే లేదు!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో ఉల్లాపుల్టాగా సాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అద్భుతమైన టాస్కులు, అంతకు మించిన ట్విస్టులతో షోను రసవత్తరంగా మార్చడంలో బిగ్ బాస్ టీం నిర్వాహకులు ఎప్పటికప్పుడు విజయవంతం అవుతున్నారు. అయితే 11వ వారంలో నో ఎలిమినేషన్ పెట్టి టిస్ట్ ఇచ్చిన బిగ్ బాస్ 12వ వారంలో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పారు. కానీ ఇది కూడా తారుమారు అయ్యే అవకాశం కనిపిస్తోంది. అందుకు కూడా చాలానే కారణాలు ఉన్నాయి. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

తాజాగా విడుదల అయిన ప్రోమో ప్రకారం.. పులి చాలా ఆకలిగా ఉందని చెప్పారు. అంటే డబుల్ ఎలిమినేషన్ ఉందని మరోసారి గుర్తు చేసేందుకు బిగ్ బాస్ ఇలా చెప్పారు. ముఖ్యంగా చాలా ఆకలి అని మెన్షన్ చేయడానికి కూడా కారణం అదే అని అర్థం అవుతోంది. ముఖ్యంగా ప్రేక్షకులతో పాటు హౌస్ మేట్స్ ను.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్స్ అని నమ్మించడానికే ఈ ప్రయత్నం అంతా. కానీ ఇన్ని ఏర్పాట్లు చేస్తుంటే చివరకు హ్యాండిచ్చే అవకాశం ఉందని, ఉల్టాపుల్టా కాబట్టి ఒకరినే ఎలిమినేటే చేస్తారని తెలుస్తోంది.

No Double Elimination in This Week Due to Top Contestants Are in Nomminations in this Week Bigg Boss Telugu 7

ముఖ్యంగా ఈ వారం నామినేషన్లలో టాప్ కంటెస్టెంట్లు ఉన్నారు. ప్రిన్స్ యావర్ తో పాటు శివాజి, అమర్‌దీప్, అంబటి అర్జున్, పల్లవి ప్రశాంత్, గౌతమ్ కృష్ణ, అశ్విని, రతికా రోజ్‌లు ఉన్నారు. ముఖ్యంగా హౌస్ మేట్స్ అంతా యావర్ మీద పడ్డారు. ఫౌల్ గేమ్ ఆడాడాని పదే పదే చెబుతున్న మిగతా కంటెస్టెంట్లు కూడా ఫౌల్ గేమ్ ఆడారు. కానీ ఎవిక్షన్ ఫ్రీ పాస్ పొందిన యావర్ తప్పుగా ఆడి గెలుచుకున్నాడని ఆయన వీడియోలు మాత్రమే చూపించడంతో.. అందరికీ నామినేన్ పాయింట్స్ దొరికాయి. ఇక అంతా చెలరేగిపోయారు.

12వ వారం ఎలిమినేషన్లలో ఎక్కువగా టాప్ కంటెస్టెంట్లే ఉండడం... ముఖ్యంగా శోభాశెట్టిని ఎవరూ నామినేట్ చేయకపోవడం, అలాగే ప్రియాంక కెప్టెన్ కాబట్టి ఆమెను కూడా ఎవరూ నామినేట్ చేయలేదు. ఇక మిగిలిన వాళ్లు అందరూ నామినేషన్స్ లోకి వచ్చారు. ఎక్కువగా టాప్ కంటెస్టెంట్లో నామినేషన్స్ లో ఉండడంతో వచ్చే వారం సింగిల్ ఎలిమినేషన్ మాత్రమే ఉండే ఛాన్స్ ఉంది. దీంతో పాటు ఈ వారం ప్రీ ఎవిక్షన్ పాస్ కోసం మళ్లీ పోటీ నిర్వహిస్తామని ఇప్పటికే నాగార్జున చెప్పారు. ఇలా చూసుకున్నా.. నామినేషన్స్ లో ఉన్న వాళ్లే ఫ్రీ ఎవిక్షన్ పాస్ దక్కించుకుంటే.. ఎలిమినేషన్ నుంచి సేవ్ అయ్యే అవకాశం మరింత ఎక్కువగా ఉంది.

No Double Elimination in This Week Due to Top Contestants Are in Nomminations in this Week Bigg Boss Telugu 7

ఇదే కాకుండా డబుల్ ఎలిమినేషన్ అని చెప్పిన బిగ్ బాస్.. ఇద్దరిని స్టేజీ మీదకు తీసుకవచ్చి.. మరొకరిని సీక్రెట్ రూంకు పంపే అవకాశం కూడా కనిపిస్తోంది. అన్ని సీజన్లతో పోలిస్తే కేవలం 24 గంటల పాటు మాత్రమే గౌతమ్ కృష్ణను సీక్రెట్ రూంలో ఉంచారు. అదంతా చూస్తుంటే మరోసారి ఎవరినైనా సీక్రెట్ రూంలో ఉంచితే అనుమానం రాకుండా ఉండాలనే బిగ్ బాస్ ఈ ట్విస్ట్ ఇచ్చాడని కూడా అనిపిస్తోంది. చూడాలా మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు కెప్టెన్ గా నిలుస్తారు, ఎవరు ఫ్రీ ఎవిక్షన్ పాస్ అందుకుంటారు అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X