‘బిగ్ బాస్ 3’: ఈ వారం ఎలిమినేషన్ లేదు.. అసలు కారణం ఏంటో తెలిస్తే అవాక్కవుతారు!

గత వారం సరిగ్గా ఇదే రోజు.. 'బిగ్ బాస్' సీజన్ - 3 ప్రారంభమైంది. అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవరిస్తున్న ఈ షో అంగరంగ వైభవంగా మొదలైంది. ఆరోజు 15 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంటర్ అయ్యారు. అప్పటి వరకు బయట జరుగుతున్న వివాదాలు కొంచెం తగ్గిపోయాయి. కానీ, ఈ పదిహేను మంది లోపలికి వెళ్లిన తర్వాత హౌస్‌లో ప్రారంభమయ్యాయి. మొదటి వారం రెండో ఎపిసోడ్‌లోనే గొడవలు జరిగాయి. దీంతో షో అప్పుడే ఆసక్తిని రేకెత్తిస్తోంది.

అందరిలో ఆసక్తి

అందరిలో ఆసక్తి

‘బిగ్ బాస్' సీజన్ -3 ప్రారంభమై ఫస్ట్ వీక్ పూర్తయిపోయింది. దీంతో ఎవరు ఎలిమినేట్ అవుతారని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 15 మంది కంటెస్టెంట్స్‌లో ఆరుగురు ఎలిమినేషన్‌ని నామినేట్ అయ్యారు. ఈ వారం ఎలిమినేషన్‌‌ని నామినేట్ అయిన వారిలో రాహుల్, పునర్నవి, వితికా, హిమజ, జాఫర్, హేమలు ఉన్నారు. వీరిలో హిమజ, పునర్నవి సేవ్ అయినట్లు నాగార్జున శనివారం ప్రకటించారు.

నలుగురిలో ఎవరు..?

నలుగురిలో ఎవరు..?

ఆరుగురిలో నుంచి ఇద్దరు సేఫ్ జోన్‌లోకి వెళ్లగా.. రాహుల్, జాఫర్, వితిక, హేమలు ఎలిమినేషన్ జోన్‌లోనే ఉన్నారు. వీరిలో ఎవరు బయటకు వెళ్లిపోతారు..? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే, రెండు రోజుల నుంచి హేమ ఎలిమినేట్ అవుతారని ప్రచారం జరుగుతోంది. ఆమెకు ఓట్లు చాలా తక్కువగా వచ్చాయని అంటున్నారు.

 ‘బిగ్ బాస్' సంచలన నిర్ణయం

‘బిగ్ బాస్' సంచలన నిర్ణయం

ఈ వారం ఎలిమినేషన్ విషయం ‘బిగ్ బాస్' నిర్వహకులు సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అదే.. ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియను రద్దు చేయాలనుకుంటున్నారట. ఎవరు ఎలిమినేషన్ అవుతారని అంతా ఆసక్తిరంగా చూస్తున్న నేపథ్యంలో ఈ వార్త బయటకు వచ్చింది. దీంతో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్‌గా మారింది.

ఓటింగ్ సిస్టమ్ కారణమట

ఓటింగ్ సిస్టమ్ కారణమట

గత రెండు సీజన్లతో పోలీస్తే ఈ సారి ‘బిగ్ బాస్' నిర్వహకులు సరికొత్త పంథాను ఫాలో అయిపోతున్నారు. హౌస్‌లో మార్పులు చేయడంతో పాటు ఓటింగ్ సిస్టమ్‌ను కూడా పూర్తిగా చేంజ్ చేసేశారు. గతంలో గూగుల్ నుంచి ఓట్లు వేసే పద్దతిని పెట్టిన స్టార్ మా యాజమాన్యం.. ఇప్పుడు హాట్ స్టార్‌లో ఈ సౌకర్యాన్ని కల్పించింది. దీంతో ఓట్ వేయడం తెలియక చాలా మంది ఆసక్తి చూపడం లేదట. దీంతో అందరికీ తక్కువ ఓట్లు పోలయ్యాయని సమాచారం.

నాగ్ చెప్పకనే చెప్పాడు

నాగ్ చెప్పకనే చెప్పాడు

ఇదే సమయంలో మరో విషయాన్ని కూడా పలువురు వీక్షకులు ప్రస్తావిస్తున్నారు. శనివారం ఎపిసోడ్ ముగింపు సందర్భంగా హౌస్‌మేట్స్ అందరికీ టాటా చెప్పే క్రమంలో నాగ్.. ‘సన్‌డే ఫన్‌డే కాబోతుంది' అన్నాడు. దీన్ని హౌసులో ఉన్న వాళ్లెవరూ పట్టించుకోలేదు. కానీ, నెటిజన్లు మాత్రం పట్టేశారు. అందుకే ఈ వార్త బాగా హల్‌చల్ చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X