Bigg Boss Telugu 6: బిగ్ బాస్ సంచలన నిర్ణయం.. షో చరిత్రలోనే తొలిసారి.. ఇబ్బందిగా ఉందన్న నాగార్జున

తెలుగు టెలివిజన్ హిస్టరీలోనే ఎవరూ ఊహించని స్థాయిలో ప్రేక్షకుల నుంచి స్పందనను అందుకుని నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. సరికొత్త కాన్సెప్టుతో నడిచే షోనే అయినా.. ఆడియెన్స్ దీనికి ఫిదా అయిపోయారు. గతంలో ఎన్నడూ చూడని టాస్కులు, గొడవలు, లవ్ ట్రాకులు, రొమాన్స్ ఇలా ఎన్నో రకాల అంశాలు కనిపించడంతో దీనికి ఆదరణ అంతకంతకూ పెరుగుతూనే వస్తోంది. ఫలితంగా తెలుగులో ఈ షో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో సీజన్ కూడా ప్రారంభం అయింది. ఇందులో మొదటి వారం షో చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా ఓ ఊహించని పరిణామం కనిపించింది. అసలేం జరిగింది? దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

ఒక దానికి మించి మరొకటి హిట్

ఒక దానికి మించి మరొకటి హిట్

బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఎన్నో అనుమానాల మధ్య తెలుగులోకి వచ్చింది. అసలు ఇలాంటి వాటిని మన వాళ్లు ఎంకరేజ్ చేస్తారా? ఇక్కడ ఇది క్లిక్ అవుతుందా? ఇలా అనుకుంటోన్న పరిస్థితుల్లో ఈ షోకు భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లు ఒకదానికి మించి ఒకటి సూపర్ సక్సెస్ అయ్యాయి. దీంతో ఇది దేశంలోనే టాప్‌ ప్లేస్‌కు చేరింది.

మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌తో

మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌తో

బిగ్ బాస్ గత సీజన్లు అన్నీ సూపర్ సక్సెస్ అవడంతో ఆరో దానిపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ సీజన్‌లో మరింత ఎంటర్‌టైన్‌మెంట్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే టాస్కుల్లో వైవిధ్యాన్ని చూపిస్తూ.. జనరంజకమైన అంశాలపై ఫోకస్ చేస్తూ వస్తున్నారు. మొత్తంగా మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించబోతున్నారు.

21 మందితో రికార్డు సృష్టించారు

21 మందితో రికార్డు సృష్టించారు

తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే తొలిసారి ఈ సీజన్‌లో ఏకంగా 21 మంది కంటెస్టెంట్లు కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, రేవంత్‌‌లు హౌస్‌లోకి అడుగు పెట్టారు.

నామినేషన్ ఛేంజ్.. ఏడుగురు

నామినేషన్ ఛేంజ్.. ఏడుగురు

సాధారణంగా బిగ్ బాస్ లో నామినేషన్స్ ప్రక్రియ సోమవారం రాత్రి ప్రసారం అవుతుంది. కానీ, ఆరో సీజన్‌లో మాత్రం బుధవారానికి మార్చారు. ఇది కూడా ఎన్నో గొడవలతో రచ్చ రచ్చగా సాగింది. ఇక, ఈ ప్రక్రియలో బాలాదిత్య, రేవంత్, ఫైమా, శ్రీ సత్య, ఇనాయా సుల్తానా, అభినయశ్రీ, చలాకీ చంటి నామినేట్ అయ్యారు. అయితే, చివర్లో బాలాదిత్యను అరోహీ రావ్‌తో స్వైప్ చేశారు.

ఎలిమినేషన్స్‌లో సర్‌ప్రైజ్‌తో

ఎలిమినేషన్స్‌లో సర్‌ప్రైజ్‌తో

బిగ్ బాస్ షో అంటేనే ఎన్నో ఊహించని పరిణామాలతో సాగుతుంది. దీంతో అసలు ఇందులో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా చెప్పలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ఆరో సీజన్ మొదటి వారంలో ఎలిమినేషన్‌ లేకుండా కొత్త ప్రయోగం చేశారు. ఇందులో చివర్లో అభినయశ్రీ, ఇనాయా సుల్తానా ఉండగా.. ఇద్దరినీ సేఫ్ చేసి బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చేశారు.

షో చరిత్రలోనే తొలిసారి ఇలా

షో చరిత్రలోనే తొలిసారి ఇలా

తెలుగు బిగ్ బాస్ చరిత్రలో మొదటి సీజన్‌లో జ్యోతి, రెండో సీజన్‌లో సంజన, మూడో సీజన్‌లో హేమ, నాలుగో సీజన్‌లో సూర్య కిరణ్, ఇప్పుడు ఐదో సీజన్‌లో సరయు రాయ్.. నాన్ స్టాప్ సీజన్‌లో ముమైత్ ఖాన్‌లు మొదటి వారంలోనే ఎలిమినేట్ అయిపోయారు. అయితే, బిగ్ బాస్ ఆరో సీజన్‌లో మాత్రం ఫస్ట్ వీక్‌లో ఎలిమినేషన్ లేకుండా చేసి సరికొత్త రికార్డును క్రియేట్ చేసుకున్నారు.

ఎలిమినేషన్‌పై నాగార్జున క్లారిటీ

ఎలిమినేషన్‌పై నాగార్జున క్లారిటీ

బిగ్ బాస్ ఆరో సీజన్‌కు సంబంధించి మొదటి వారం జరగాల్సిన ఎలిమినేషన్ తీసేయడంతో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక, దీనిపై ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో నాగార్జున మాట్లాడుతూ.. 'అప్పుడే హౌస్‌లోకి వచ్చిన వాళ్లను ఎలిమినేట్ చేయడం ఇబ్బందికరంగా అనిపించింది. అందుకే బిగ్ బాస్ ఈ నిర్ణయం తీసుకున్నారు' అంటూ వివరణ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X