బిగ్ బాస్‌ రిజల్ట్‌పై అనుమానాలు: అన్నీంటిలోనూ గెలిచారు.. చివరి క్షణంలో మార్చేస్తున్నారు

ఓ మూస ధోరణిలో సాగిపోతోన్న బుల్లితెరను ఒక్కసారిగా హైలైట్ చేసిన షో బిగ్ బాస్. ఇంగ్లీష్‌లో ప్రసారం అయ్యే 'బిగ్ బ్రదర్' అనే షో ద్వారా రూపొందిన ఈ రియాలిటీ షో దాదాపు పద్నాలుగేళ్ల నుంచి హిందీలో ప్రసారం అవుతోంది. అలాగే, దేశంలోని మిగిలిన భాషల్లోనూ ఇది ప్రారంభం అయింది. మరీ ముఖ్యంగా తెలుగులో నాలుగేళ్ల క్రితం మొదలైన ఈ షో.. గత ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేతో నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ రిజల్ట్ గురించి తాజాగా ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. అసలేంటది? పూర్తి వివరాలు మీకోసం!

అక్కడ ఏకంగా ఐదుగురు గెలుపు

అక్కడ ఏకంగా ఐదుగురు గెలుపు

2006లో హిందీలో ప్రారంభం అయింది బిగ్ బాస్ షో. సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా చేస్తున్న ఈ రియాలిటీ ఇప్పటికే పదమూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. అందులో ఐదుగురు మహిళలు విజయం సాధించారు. పురుషులకే ఎక్కువ ఓటింగ్ జరుగుతోన్న పరిస్థితుల్లో అక్కడ వాళ్లు గెలవడం అందరినీ ఆశ్చార్యనికి గురి చేసింది.

తమిళం, కన్నడంలో ఒక్కొక్కరు

తమిళం, కన్నడంలో ఒక్కొక్కరు

తమిళంలోనూ బిగ్ బాస్ మూడు సీజన్లను పూర్తి చేసుకుంది. కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్న ఈ షో కూడా సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. రెండేళ్ల క్రితం ప్రసారం అయిన రెండో సీజన్‌లో రిత్విక అనే నటి గెలుపొందింది. అలాగే, కిచ్చా సుదీప్ హోస్ట్ చేస్తున్న కన్నడ బిగ్ బాస్ ఇప్పటికే ఏడు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇందులో మూడో సీజన్‌లో శృతి అనే ఆర్టిస్టు గెలుపొందారు.

తెలుగు మొదటి సీజన్‌లో హారి తేజ

తెలుగు మొదటి సీజన్‌లో హారి తేజ

తెలుగులో మొదటి సీజన్‌ను జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేశాడు. ఏమాత్రం అంచనాలు లేకుండా సాగిన ఈ సీజన్‌ ఊహించని రీతిలో విజయాన్ని అందుకుంది. ఇందులో శివ బాలాజీ, హరి తేజ, ఆదర్శ్ బాలకృష్ణ, నవదీప్, ఆర్చన ఫినాలేకు చేరుకున్నారు. ఇందులో హరితేజ విన్నర్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ, ఆమె మూడో స్థానంతో సరిపెట్టుకోగా శివ బాలాజీ గెలిచాడు.

రెండో సీజన్‌లో గీతా మాధురే గెలుపు

రెండో సీజన్‌లో గీతా మాధురే గెలుపు

రెండో సీజన్‌ను నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేశాడు. ఎన్నో వివాదాల నడుమ ప్రసారం అయిన ఈ సీజన్ కూడా సూపర్ హిట్ అయింది. ఇందులో కౌశల్ మండా, గీతా మాధురి, సామ్రాట్, తనీష్, దీప్తీ నల్లమోతు ఫినాలేకు చేరుకున్నారు. వీరిలో గీతా మాధురినే విజయం సాధిస్తుందన్న టాక్ బాగా వినిపించింది. కానీ, చివర్లో అనూహ్య పరిణామాల నడుమ కౌశల్ టైటిల్‌ను సొంత చేసుకున్నాడు.

మూడో సీజన్ ఆ లేడీ యాంకర్ అని

మూడో సీజన్ ఆ లేడీ యాంకర్ అని

ఎన్నో అంచనాల నడుమ అక్కినేని నాగార్జున హోస్టింగ్ ప్రసారం అయింది బిగ్ బాస్ మూడో సీజన్. ఇందులో రాహుల్ సిప్లీగంజ్, శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, అలీ రేజా ఫినాలేలో నిలిచారు. వీళ్ల నుంచి శ్రీముఖి విజయం సాధిస్తుందని బాగా ప్రచారం జరిగింది. కానీ, ఓటింగ్‌లో రాహుల్‌ హవాను చూపించి విజేతగా నిలిచాడు. దీంతో వరుసగా మగవాళ్లే విన్నర్లు అయ్యారు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Netizens trolls bigg Boss for splitting winner Abhijeet prize money to Sohel
బిగ్ బాస్‌ రిజల్ట్‌పై అనుమానాలు స్టార్ట్

బిగ్ బాస్‌ రిజల్ట్‌పై అనుమానాలు స్టార్ట్

తాజా సీజన్‌లో అభిజీత్ టైటిల్ విన్నర్‌గా నిలిచాడు. నిజానికి అన్ని భాషల్లో కనీసం ఒకరైనా మహిళలు విజయం సాధించగా.. తెలుగులో ప్రసారం అయిన నాలుగు సీజన్లలోనూ మగవారే గెలుపొందారు. ప్రస్తుత సీజన్ మినహా అన్ని సార్లు ఆడవాళ్లే గెలుస్తారని ప్రచారం జరిగినా.. ఫలితం మరోలా వచ్చింది. దీంతో ఆయా సీజన్ల సమయంలో రిజల్ట్‌పై అనుమానాలు వ్యక్తమయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X