Bigg Boss Telugu 7: మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్.. ఆ టాప్ ప్లేయర్ కోసమే ఊహించని నిర్ణయం
సాధారణంగా బుల్లితెరపై ఎలాంటి షో అయినా ఆలస్యంగానే సక్సెస్ అవుతుంటుంది. కానీ, ఒకే ఒక్క కార్యక్రమం మాత్రం తక్కువ సమయంలోనే సెన్సేషన్ అయింది. అదే బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. ముఖ్యంగా తెలుగులో ఇది దేశంలోనే ఏ షోకూ రానంత రేటింగ్‌ను రాబట్టి చరిత్ర సృష్టించింది. అందుకే వరుసగా సీజన్లను తీసుకు వస్తూనే ఉన్నారు. ఇలా ఇప్పుడు ఏడో దాన్ని దిగ్విజయంగా నడుపుతున్నారు. ఇందులో ఇప్పుడు మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగాల్సి ఉంది. కానీ, దీనిపై నిర్వహకులు ఊహించని నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఆ వివరాలు మీకోసమే!
Recommended Video

ఫైనలిస్టులుగా ఈ ఆరుగురే : బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి వైల్డ్ కార్డ్‌తో కలిపి 19 మంది కంటెస్టెంట్లు వచ్చారు. అందులో ప్రతి వారం ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతూ వచ్చారు. ఈ క్రమంలోనే చివరి ఏడుగురు సభ్యుల్లో శోభా శెట్టి గత వారంలో ఎలిమినేట్ అయిపోయింది. ఫలితంగా మిగిలిన ఆరుగురు సభ్యులు ప్రియాంక జైన్, అమర్‌దీప్ చౌదరి, శివాజి, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, అర్జున్‌లు ఫైనలిస్టులు అయ్యారు.

రెండు వారాల ఓట్ల లెక్కనే : సాధారణంగా ఏ బిగ్ బాస్ సీజన్‌లో అయినా విజేతను నిర్ణయించే ఓటింగ్ చివరి వారంలోనే జరుగుతుంది. కానీ, ఏడో సీజన్ ఉల్టా పుల్టా కావడంతో దీన్ని 14వ వారంలోనే తీసుకు వచ్చారు. దీని ఆధారంగానే ఆ వారంలో శోభా శెట్టిని ఎలిమినేట్ చేశారు. అదే సమయంలో ఓటింగ్ చివరి నాటికి ఎవరు టాప్‌లో ఉంటారో వాళ్లనే విజేతగా ప్రకటిస్తామని కూడా నాగార్జున వెల్లడించాడు.
మిడ్ వీక్‌లో ఎలిమినేషన్ : బిగ్ బాస్ ఏడో సీజన్‌లో కూడా ఆరుగురు కంటెస్టెంట్లను ఫినాలే వీక్‌కు చేరుకున్నారు. అయితే, వీళ్లలో ఒకరు ఈ వారం మధ్యలోనే ఎలిమినేట్ అవబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 14వ వారం నుంచి జరుగుతున్న ఓటింగ్‌లో ఇప్పుడు ఎవరికైతే తక్కువ ఓట్లు నమోదు అవుతాయో వాళ్లే ఎలిమినేట్ అవుతారు. ఇది బుధవారం నుంచి శుక్రవారం వరకూ ఎప్పుడైనా జరగొచ్చని అన్నారు.
శుక్రవారం ఔట్.. విన్నరలా : తాజా సీజన్‌లో టాప్ 5 కంటెస్టెంట్లను నిర్ణయించే చివరి (మిడ్ వీక్) ఎలిమినేషన్ ప్రక్రియ శుక్రవారం రాత్రి జరగబోతుందని వార్తలు వస్తూనే ఉన్నాయి. అప్పటి నుంచి టాప్ 5 సభ్యులకు మాత్రమే ఓటింగ్ జరగబోతుంది. వీళ్లలో విజేతను నిర్ణయించే ఎపిసోడ్ మాత్రం వచ్చే ఆదివారం (డిసెంబర్ 17వ తేదీ) సాయంత్రం ఏడు గంటలను నుంచి ప్రసారం అవుతుందని తెలిసింది.

వాళ్లిద్దరిలో ఒకరు వెళ్తారు : బిగ్ బాస్ ఏడో సీజన్‌లో చివరి వారానికి చేరుకునే సమయానికి ఆరుగురు కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు. అందులో ఒకరు మధ్యలోనే ఎలిమినేట్ అవుతారు. ఇప్పటి వరకూ ఉన్న ఓటింగ్ ట్రెండ్ ప్రకారం.. మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో ప్రియాంక జైన్ లేదా అంబటి అర్జున్‌లలో ఒకరు బయటకు వెళ్లిపోతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో వాళ్ల ఫ్యాన్స్ ఆందోళనగా ఉన్నారు.
ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్ : బిగ్ బాస్ మిడ్ వీక్ ఎలిమినేషన్ గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. అదే సమయంలో ఫలానా కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతున్నారు అని కూడా టాక్ వస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఈ సీజన్‌లో మిడ్ వీక్ ఎలిమినేషన్ లేదని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇప్పుడు హౌస్‌లో ఉన్న ఆరుగురు కంటెస్టెంట్లను ఫినాలేకు పంపుతారని సమాచారం.
అతడి కోసమే ఈ నిర్ణయం : ఫినాలే వీక్‌కు సంబంధించిన ఓటింగ్‌లో ప్రియాంక జైన్‌కు తక్కువ ఓటింగ్ ఉన్నా.. ఫైనలిస్టుల్లో అమ్మాయిని ఉంచాలి కాబట్టి అంబటి అర్జున్‌ను ఎలిమినేట్ చేసే పరిస్థితి ఏర్పడినట్లు తెలిసింది. అతడిని బయటకు పంపించేందుకు బిగ్ బాస్ టీమ్ సిద్ధంగా లేదని అంటున్నారు. అందుకే మొత్తానికి మిడ్ వీక్ ఎలిమినేషన్‌ను తీసేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











