Bigg Boss Telugu 7: ఎలిమినేషన్‌లో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్... ఉల్టాపుల్టా అంటే ఇదే కదా?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రోజు రోజుకు ఆసక్తి పెంచుతోంది. ఇక పది వారాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో.. 11వ వారం వీకెండ్ ఎపిసోడ్ కు కూడా రెడీ అయింది. ఇక ఈ వీకెండ్ ఎపిసోడ్ లో ఎవరు ఎలిమినేట్ కానున్నారు అనేది ఆసక్తిగా మారింది. ఇక మరో నాలుగు వారాల్లో ఈ షో ముగియనుంది.. ఇప్పటికే హౌస్ నుంచి 10 మంది ఎలిమినేట్ అయిపోయారు.. ఈసారి ఎవరు ఎలిమినేట్ కానున్నారు అనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు ఎవిక్షన్ పాస్.. బిగ్ బాస్ ఎలిమినేషన్.. ఇలా వీకెండ్ ఎపిసోడ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ ప్రేక్షకులకు ఊహించని షాక్ ఇచ్చాడని తెలుస్తోంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఇప్పటికే చివరి అంకానికి చేరుకుంది. మొదటి విడుతలో 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. ఇక ఐదో వారంలో ఐదుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చారు. దాంతో పాటు.. ఓ కంటెస్టెంట్ రీఎంట్రీ.. ఇలా ప్రేక్షకులకు ఉల్టా పుల్టా పేరుతో షాక్ లు, ట్విస్టులు ఇస్తునే ఉన్నాడు బిగ్ బాస్. ఇక గత వారం అంతా ఫ్యామిలీ వీక్ నడిచింది. ఇక ఈ వారం ఎవిక్షన్ పాస్ కోసం పోటీలు నిర్వహించాడు బిగ్ బాస్.

మొదట అర్జున్ అంబటికి ఎవిక్షన్ పాస్ రాగా.. ఆ తర్వాత యావర్ చేతికి వచ్చింది. అలా యావర్ చేతికి రావడంతో.. ఆ పాస్ తో ఎవరిని సేఫ్ చేస్తారు అనేది ఇంట్రెస్ట్ గా మారింది. ఇదిలా ఉంటే.. ఇది ఉల్టా పుల్టా కాబట్టి.. ఆ పాస్ కాపాడేది కాదు.. కాటేసేది అని తర్వాత తేలింది. ఆ పాస్ యూజ్ చేసి.. ఎవరినైనా ఎలిమినేట్ చేయొచ్చని చెప్పారు. ఇక వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున యావర్ చీటింగ్ గేమ్ గురించి అడగటంతో.. యావర్ ఆ పాస్ ను వెనక్కి ఇచ్చేశాడని తెలుస్తోంది.


కానీ ఇప్పుడు ఎలిమినేషన్ విషయంలో బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఊహించని షాక్ ఇచ్చారని సమాచారం. అదేంటంటే.. ఈ వారం నో ఎలిమినేషన్ అని తెలుస్తోంది. మీరు విన్నది నిజమే.. 11వ వారం ఎవరినీ ఎలిమినేట్ చేయలేదట. ఇక డేంజర్ జోన్ లో ఉన్న అశ్విని, రతికా, శోభా శెట్టి ఈ వారం కూడా సేఫ్ అయిపోయారు.

ఇక ప్రస్తుతం హౌస్ లో 10 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. శివాజీ, ప్రశాంత్, యావర్, అమర్ దీప్, గౌతమ్, అర్జున్, ప్రియాంక, రతికా రోజ్, శోభా శెట్టి, అశ్వినీ శ్రీ ఉన్నారు. ఈ వారం నామినేషన్స్ లో శివాజీ, ప్రశాంత్ తప్ప అందరూ ఉన్నారు. ఇక బిగ్ బాస్ ఊహించని నిర్ణయంతో ఈ వారం అంతా సేఫ్ అయిపోయారు. ఇక బిగ్ బాస్ మరో నాలుగు వారాల్లో ముగియనుండగా.. మరో రెండు వారాలు పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎందుకంటే.. టాప్ 5 కంటెస్టెంట్స్ ను ఫినాలికే పంపించాలంటే మరో రెండు వారాలు పొడిగించాలి. చూడాలి మరి ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











