Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మొదటిసారి రెమ్యునరేషన్ లేకుండా తారక్ టాక్ షో.. స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే?
జునియర్ ఎన్టీఆర్ చాలా వరకు సింపుల్ గా ఉండేందుకు ఎక్కువగా ప్రయత్నం చేస్తుంటాడు. వీలైనంత వరకు కాంట్రవర్సీలకు వెళ్లకుండా అలాగే ప్రొడక్షన్ లాంటి రిస్క్ పనులు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటాడు. గతంలో ఒకసారి ప్రొడక్షన్ హౌజ్ ను స్థాపించడానికి ప్రయత్నాలు జరిగినట్లు టాక్ వచ్చింది. కానీ అందులో నిజం లేదని తెలిసిపోయింది. ఇక ఇప్పుడు మొదటిసారి ఒక టాక్ షో కోసం తన సొంత డబ్బును ఖర్చు చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
షో కోసం డిఫరెంట్ లుక్
ప్రస్తుతం జునియర్ ఎన్టీఆర్ RRR సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల కొమురం భీమ్ టీజర్ తోనే సరికొత్తగా కనిపించి ఆడియెన్స్ లో అంచనాలను పెంచిన యంగ్ టైగర్ త్వరలోనే ఒక రియాలీటి షోలో మరో డిఫరెంట్ లుక్కుతో ఆకట్టుకొనున్నట్లు తెలుస్తోంది. షోకి సంబంధించిన కొన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు సోషల్ మీడియాలో అనేక రకాల న్యూస్ లు వైరల్ అవుతున్నాయి.
ప్రోమో ద్వారానే అఫీషియల్ ఎనౌన్స్మెంట్
జెమిని టీవీలో ప్రసార కాబోయే ఆ షో కోసం అన్నపూర్ణ స్టూడియోలో స్పెషల్ గా సెట్స్ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఆ పనులు పూర్తయ్యాక తారక్ ప్రోమో కోసం షూట్ లో పాల్గొంటాడట. ప్రోమోతోనే అఫిషియల్ గా ఎనౌన్స్మెంట్ ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
టీవీ షో కోసం ప్రొడక్షన్..
ఇక షో కోసం తారక్ రెమ్యునరేషన్ ఎంత అనే విషయంలో అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతున్నాయి. కానీ నిజానికి ఎన్టీఆర్ రెమ్యునరేషన్ లేకుండా షోను మొదలు పెట్టబోతున్నాడాట. కాన్సెప్ట్ నచ్చడంతో సొంతంగా డబ్బులు పెట్టేందుకు కూడా రెడీ అయ్యారని సొంతంగా లాభాలు అందుకునేందుకు ఎన్టీఆర్ ఆ విధంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Recommended Video
షో స్టార్ట్ అయ్యేది ఎప్పుడో..
బిగ్ బాస్ లో హోస్ట్ గా వ్యవహరించిన తారక్ ఏ స్థాయిలో క్రేజ్ అందుకున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మొదటి సీజన్ లో తారక్ వచ్చిన ప్రతి ఎపిసోడ్ రేటింగ్ అమాంతంగా పెరుగుతూ వచ్చింది. ఏ రోజు కూడా బిగ్ బాస్ రేంజ్ తగ్గలేదు. ఇక మరోసారి బిగ్ బాస్ హోస్ట్ గా ఆఫర్ వచ్చినప్పటికీ తారక్ ఒప్పుకోలేదు. ఇక ఇప్పుడు మాత్రం సొంతంగా టాక్ షోను స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యాడు. జనవరి తరువాతనే షో స్టార్ అయ్యే ఛాన్స్ ఉందట.