అలా చేస్తే ఎక్కడెక్కడ తగులుతుందో అవసరమా? అమ్మ రాజశేఖర్‌కు నోయల్ కౌంటర్
బిగ్ బాస్ షో ముగిసినా కూడా అక్కడ జరిగిన కొన్ని విషయాలు ఎప్పుడూ కంటెస్టెంట్లను వెంటాడుతూనే ఉంటాయి. అలా బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో ఎన్నో ఘటనలు జరిగాయి. ఇంకెన్నో గొడవలు జరిగాయి. వివాదాస్పద సంఘటనలు కూడా జరిగాయి. అందులో ఒకటి తాజాగా మళ్లీ తెర మీదకు వచ్చింది. ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్లందరినీ ఒకే చోటకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ ఉత్సవం పేరిట రాబోతోన్న ఈ ఈవెంట్ ప్రోమోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

బిగ్ బాస్ ఉత్సవం..
బిగ్ బాస్ ఉత్సవం పేరిట నాలుగు సీజన్ల కంటెస్టెంట్లను ఒకే చోటకు పట్టుకొచ్చారు. మొత్తానికి బిగ్ బాస్ కంటెస్టెంట్ల హవా బుల్లితెరపై మళ్లి కనిపించబోతోంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 7న బిగ్ బాస్ ఉత్సవం ప్రసారం కాబోతోందని తెలిపాడు. ఇప్పటికే వచ్చిన ప్రోమోలు, షూటింగ్ సెట్‌లో నుంచి బయటకు వచ్చిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

నాల్గో సీజన్ ఇలా..
ముందుగా మొదటి మూడు సీజన్ల కంటెస్టెంట్లందరూ కలిసి షూటింగ్‌లో పాల్గొన్నారు. అయితే చివర్లో నాల్గో సీజన్ కంటెస్టెంట్లు సందడి చేయడంతో అందరికీ ఓ అనుమానం వచ్చింది. బిగ్ బాస్ మొత్తం నాలుగు సీజన్ల కంటెస్టెంట్లు కలిపి ఒకేసారి షో చేస్తున్నారా? లేదా ఏ సీజన్‌కు సంబంధించి ఆ సీజన్ కంటెస్టెంట్లతోనే షో చేస్తున్నారా? అనే అనుమానం నెటిజన్లలో తలెత్తింది.

తాజాగా అలా..
నాల్గో సీజన్ కంటెస్టెంట్లకు సంబంధించిన ప్రోమో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో సోహెల్ అరియానా ట్రాక్ బాగానే వర్కవుట్ అయ్యేలా ఉంది. ఇక హారిక బాక్సింగ్ ఆట కూడా క్లిక్ అయ్యేలా ఉంది. హారిక బాక్సింగ్ గ్లౌవ్స్ పెట్టుకుని వస్తుంటే.. కళ్లకు గంతలుపెట్టుకుని రా అని అమ్మ రాజశేఖర్ అన్నాడు.

నోయల్ కౌంటర్..
అలా హారికను అమ్మ రాజశేఖర్ అనడంతో నోయల్ ఓ కౌంటర్ వేశాడు. అవసరమా? మాస్టర్ అప్పుడు ఎక్కడెక్కడ తగులుతుందో తెలియదు.. ఎందుకు రిస్క్ తీసుకుంటారు అని నోయల్ రివర్స్ పంచ్ వేశాడు. అయితే ఇలా నోయల్ అనడంతో ఒక్కసారిగా గతంలోకి వెళ్లాల్సి వచ్చింది.
Recommended Video

గతంలో అలా..
బిగ్ బాస్ ఇంట్లో ఓ సారి కెప్టెన్సీ పోటీలో అరియానా, హారిక, అమ్మ రాజశేఖర్ కళ్లకు గంతలు కట్టి ఓ టాస్క్ ఆడించారు. అందులో హారికను అమ్మ రాజశేఖర్ ఇష్టం వచ్చినట్టుగా తాకేశాడు. అప్పట్లో అది బాగానే వైరల్ అయింది. తాజాగా ఇలా మళ్లీ కామెంట్ చేయడంతో ఈ విషయం చర్చల్లోకి వచ్చింది.


Click it and Unblock the Notifications











