అమ్మా రాజశేఖర్, నోయల్ మధ్య పాట పెట్టిన చిచ్చు.. ఇది చాలా బోరింగ్ బిగ్ బాస్
బిగ్ బాస్ 4 ఒకరోజు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంటే మరో రెండు మూడు రోజులు బోరింగ్ గా కొనసాగుతోంది. హౌజ్ కంటెస్టెంట్స్ మధ్య గొడవలు సర్వసాధారణమని అందరికి తెలిసిన విషయమే. కానీ మాటల తూటాలు అంతగా పేలడం లేదు. ఫిజికల్ టాస్క్ లు వస్తే చాలు వివాదాలు మరింత ముదురుతున్నాయి. ఎవరికి వారు.. వారి మాటే నెగ్గాలని ఊహించని విధంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. 47వ ఎపిసోడ్ లో అందరిది ఒక గొడవలా అనిపిస్తే నోయల్, అమ్మా రాజశేఖర్ సాయిల మధ్య జరిగిన వివాదం మాత్రం చాలా కామెడీగా అనిపించిందనే కామెంట్స్ వస్తున్నాయి.

కొత్త కెప్టెన్ గా అవినాష్
మొత్తానికి ఇంటికి కొత్త కెప్టెన్ గా అవినాష్ సెలెక్ట్ అయ్యాడు. మొన్నటి ఎపిసోడ్ లో రాక్షసులుగా బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చిన అవినాష్, అరియానాను కెప్టెన్సీ పోటీలో ఉంచిన బిగ్ బాస్ ఇంటి సభ్యులను రెండు గ్రూపులుగా విడదీసి టాస్క్ ఇచ్చారు. ఇక బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చిన అరియానా, అవినాష్ లలో అవినాష్ ని సెలెక్ట్ చేశారు.

అమ్మా రాజశేఖర్ పై నోయల్ సీరియస్
ఇక అందరితో మరో గొడవ అయితే అమ్మా రాజశేఖర్ నోయల్ మధ్యలో మరో గొడవ మొదలైంది. వీరిద్దరి మధ్య గతంలో ఒక ర్యాంప్ సాంగ్ కి సంబంధించిన చర్చ మొదలైంది. పాటను రాయమని చెప్పినా అమ్మా ఏ మాత్రం స్పంధించలేదని చెప్పడంతో నోయల్ చాలా సీరియస్ అయ్యాడు. అమ్మ కూడా ఆ విషయంలో సరిగ్గా రెస్పాన్డ్ కాలేదని అనడంతో వివాదం మరింత హీటెక్కింది.

గతంలో కుమార్ సాయితో కూడా
నోయల్ ఎప్పుడు గొడవ పెట్టుకున్న కూడా కారణం చాలా కామెడీగా ఉందనే కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. గత వారం కుమార్ సాయి టాస్క్ విషయంలో కూడా అభ్యంతరం వ్యక్తం చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. నోయల్ గతంలో ఎప్పుడు లేని విధంగా కుమార్ తో గొడవ పడటం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఒక్కరోజైనా నిజం మాట్లాడతావాని అనుకున్నా అంటూ నోయల్ సెటైర్ వేయడంతో కుమార్ కూడా అదే తరహాలో మాటల డోస్ పెంచాడు గాని చివరికి అతనే బలయ్యాడు.
Recommended Video

మరోసారి బోర్ కొట్టించిన కంటెస్టెంట్స్
ఇక ఇప్పుడు అమ్మా రాజశేఖర్ తో అలా సాంగ్ విషయంలో నోయల్ ప్రవర్తించిన తీరు కూడా సిల్లిగానే అనిపిస్తోందనే కామెంట్స్ వచ్చాయి. మీతో సాంగ్ చేయనని హెచ్చరిక ఇవ్వడంతో ఒక్కసారిగా హౌజ్ హీటెక్కింది. అందుకు సంబంధించిన మీమ్స్ కూడా సోషల్ మీడియాలో చాలానే వైరల్ అవుతున్నాయి. ఇక బిగ్ బాస్ గురువారం అంత ఇంట్రెస్టింగ్ గా ఏమి అనిపించలేదనే చెప్పాలి.


Click it and Unblock the Notifications











