నోయల్ సీన్ రీ ఎంట్రీ.. రచ్చ చేస్తా.. కుమ్మేస్తా.. ర్యాప్‌స్టార్ వీడియో రిలీజ్
బిగ్‌బాస్ తెలుగు 4 షో నుంచి అనూహ్య పరిస్థితుల్లో బయటకు వచ్చిన నోయల్ సీన్ యూట్యూబ్ లైవ్‌లో రియాలిటీ అభిమానులతో ముచ్చటించారు. తన ఎలిమినేషన్ సమయంలో జరిగిన విషయాలపై క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఈ సందర్బంగా తన ఆరోగ్యం గురించి, బిగ్‌బాస్ రీ ఎంట్రీ గురించి వెల్లడించిన ఆసక్తికరమైన విషయాలు ఏమిటంటే..

నా ఆరోగ్యం బాగుంది
బిగ్‌బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత నా ఆరోగ్యం బాగుంది. ప్రస్తుతం మంచి ఉన్నాను. ఏ మాత్రం అవకాశం ఉన్నా రీ ఎంట్రీ ఇస్తాను. ఇంట్లోకి ప్రవేశించి రచ్చ చేయాలని ఉంది. 8 వారాల కష్టపడిన తర్వాత ఇలా నేను వస్తానని అనుకోలేదు. అలా రావడం నాకు బాధగా ఉంది అంటూ నోయల్ సీన్ చెప్పాడు.

స్ట్రాంగ్‌గా ఉండి.. బయటకు రావడం
ఇంటిలో అందరితోపాటు స్ట్రాంగ్‌గా ఉండి ఇలా రావడం నాకు నచ్చడం లేదు. సానుభూతి కోసం డ్రామాలు ఆడుతున్నాడంటే అవి నాకు పిచ్చ లైట్. సింపతి పొందాలనుకొంటే చాలా దారులు ఉన్నాయి. కానీ నేను అలా చేయను. చేయదలచుకొలేను అని నోయల్ సీన్ అన్నాడు

బిగ్‌బాస్ అవకాశం కోసం ఎదురుచూస్తున్నా
బిగ్‌బాస్ నాకు రీ ఎంట్రీ ఇస్తే మామూలుగా ఉండదు. కుమ్మి పడేస్తా. ఆ అవకాశం కోసం వేచి చూస్తున్నాను. అందుకు రెడీగా ఉన్నాను. నాకు కచ్చితంగా వెళ్లాలని ఉంది. హౌజ్‌లో నేను ఎలా ఉంటానో వేదిక మీద చెప్పాను. నేను బయటకు రాకపోయినా డెఫినెట్‌గా నేను అవినాష్, అమ్మా రాజశేఖర్‌ను ఇదే విధంగా నామినేట్ చేసే వాడిని అని నోయల్ చెప్పాడు.
Recommended Video

రెండుసార్లు కెప్టెన్‌గా
బిగ్‌బాస్ ఇంటిలో నేను రెండుస్లార్లు కెప్టెన్ అయ్యాను. అది నాకు మంచి బలాన్ని ఇచ్చింది. ఒకసారి ఇంట్లో వాళ్లందరూ నాకు సపోర్ట్ చేస్తే నేను కెప్టెన్ అయ్యాను. మరోసారి టాస్క్ గెలిచి కెప్టెన్‌గా అయ్యాను. అందులో నా కష్టం ఎక్కువగా ఉంది అంటూ నోయల్ సీన్ అన్నాడు.


Click it and Unblock the Notifications











