నన్ను అలా తొక్కేశారు.. బిగ్‌బాస్‌పై నోయల్ సీన్ అనుమానం
బిగ్‌బాస్ ఇంటి నుంచి అనారోగ్యంతో బయటకు వచ్చిన కంటెస్టెంట్ నోయల్ సీన్ తాజాగా యూట్యూబ్ లైవ్ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అయితే తాను ఇంటిలో చాలా బాగా ఆడినప్పటికీ.. తనకు సంబంధించిన కంటెంట్‌ను సరిగా చూపించలేదు అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. ఇంటిలో రెండు, మూడు వారాలపాటు నేను అన్ని విషయాల్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేశాను. కానీ చూపించలేదు అంటూ డౌట్ పడ్డారు.
ఇంటిలో నేను, స్వాతి దిక్షిత్‌తో మంచి విషయాలు, ఎక్కువగా మాట్లాడుకొన్నాయి. ఇద్దరం కలిసి చాలా విషయాలు షేర్ చేశాం. కానీ ఆమెతో నాకు సంబంధించిన ఒక్క సీన్, సన్నివేశం కూడా ప్రసారం చేయలేదు. చాలా వరకు నాకు సంబంధించిన కంటెంట్‌ను ప్రసారం చేయలేదు. అదే నాకు అర్ధం కావడం లేదు అంటూ నోయల్ సీన్ అన్నారు.

ఇన్ని వారాలు ఇంటిలో ఉంటే.. నా కంటెంట్ లేకపోవడం, నేను కనిపించకపోవడమంటే.. నేను బాత్రూలో ఉన్నానా? మరెక్కడైనా దాచుకొన్నానా అంటూ కామెంట్ చేశాడు. ఇలా నా ఫుటేజ్ చూపించకపోతే ప్రేక్షకులకు అనుమానం రాదా అని నోయల్ సీన్ అన్నాడు.


Click it and Unblock the Notifications











