Noel Sean ఆరోగ్య సమస్య ఏమిటి? లాంటి వ్యాధితో బాధపడుతున్నారంటే.. బిగ్‌బాస్‌లోకి రాకముందే

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో మరో కంటెస్టెంట్ అనారోగ్యానికి గురయ్యాడు. గంగవ్వ తర్వాత నోయల్ సీన్ అస్వస్థతకు గురి కావడంతో ఇంటి సభ్యులు, ప్రేక్షకులకు ఆందోళనకు గురి అయ్యారు. అయితే మెరుగైన చికిత్స కోసం నోయల్‌ను పంపిస్తున్నాం. సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి రావాలని కోరుకొంటున్నామని నోయల్ సీన్‌కు బిగ్‌బాస్ వెల్లడించడంతో కాస్త ఊరట చెందే విషయం. అయితే నోయల్ సీన్‌ ఎలాంటి వ్యాధితో బాధపడతున్నారంటే..

నోయల్ సీన్‌కు కరోనా అనే వార్తలతో

నోయల్ సీన్‌కు కరోనా అనే వార్తలతో

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో ప్రారంభానికి చాలా రోజుల ముందు నోయల్ సీన్‌ కరోనావైరస్ బారిన పడ్డారనే వార్త మీడియాలో వెలుగు చూసింది. అయితే నోయల్ సీన్ బిగ్‌బాస్ ఇంటిలోకి వస్తారా? లేదా అనేది అప్పట్లో చర్చనీయాంశమైంది. అయితే ఆ వార్తలపై నోయల్ సీన్ వివరణ ఇవ్వడం తో ఆ గందరగోళానికి తెరపడింది.

బిగ్‌బాస్ ఎంట్రీకి ముందు క్వారంటైన్‌లో

బిగ్‌బాస్ ఎంట్రీకి ముందు క్వారంటైన్‌లో

ఇక బిగ్‌బాస్ తెలుగు 4 రియాలిటీ షో ప్రారంభానికి ముందు ఎంపికైన ఇంటి సభ్యులందరిని క్వారంటైన్‌లో పెట్టారు. దాదాపు 20 రోజులపాటు గృహ నిర్బంధంలో ఉంచారు. షో ప్రారంభానికి ముందు వారికి కరోనావైరస్ టెస్టులు నిర్వహించి నెగిటివ్ రిపోర్టులు వచ్చిన తర్వాతే బిగ్‌బాస్ ఇంటిలోకి అనుమతించారు. అలాంటి పరీక్షలను ఎదుర్కొని నోయల్ సీన్ ఇంటిలోకి ప్రవేశించారు.

ఇంటిలోకి వెళ్లిన తర్వాత క్రమంగా

ఇంటిలోకి వెళ్లిన తర్వాత క్రమంగా

అయితే బిగ్‌బాస్ ఇంటిలో నోయల్ సీన్‌ ఆరోగ్యం క్రమంగా క్షీణించడం మొదలుపెట్టింది. పలుమార్లు ఆరోగ్యం బాగా ఉండటం లేదనే విషయం తాను స్వయంగా చెప్పుకోవడం ద్వారా, బిగ్‌బాస్ వెల్లడించే విషయం ఆధారంగా బయటకు వచ్చింది. సోమవారం మొదలైన బీబీ డే కేర్ టాస్క్ సందర్భంగా నోయల్ ఆరోగ్య పరిస్థితి మరింత తీవ్రమైంది.

కండరాల సంబంధిత వ్యాధితో

కండరాల సంబంధిత వ్యాధితో


ఇదిలా ఉండగా, నోయల్ సీన్‌ కండరాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నట్టు స్పష్టమైంది. కీళ్ల నొప్పులు, కండరాల పట్టివేత, బాడీ పెయిన్స్‌ లాంటి విషయాలు ఆయనను వెంటాడుతున్నాయి. సోమవారం నుంచి వైద్యుల పర్యవేక్షణలో నోయల్ సీన్ ఉన్నాడు. అయితే తప్పని సరి పరిస్థితుల్లో మెరుగైన చికిత్స కోసం బయటకు పంపించాల్సి రావడంతో ఆయన ఇంటి నుంచి బయటకు వెళ్లిన రెండో వ్యక్తిగా మారారు.

Recommended Video

Bigg Boss Telugu 4: Bigg Boss show was once again criticised for its elimination process
ప్రముఖ హాస్పిటల్‌లో మెరుగైన చికిత్స

ప్రముఖ హాస్పిటల్‌లో మెరుగైన చికిత్స

ఇదిలా ఉండగా, నోయల్ సీన్‌ను చికిత్స కోసం ప్రముఖ హాస్పిటల్‌కు తరలించారు. మెరుగైన చికిత్స ఆయనకు కొనసాగుతున్నట్టు సన్నిహితులు తెలిపారు. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో బిగ్‌బాస్ ఇంటిలోకి ఆయన ప్రవేశిస్తారని చెబుతున్నారు. బహుశా ఈ వారాంతం రోజున అంటే ఆదివారం గానీ, లేదా సోమవారం ఇంట్లోకి ప్రవేశించే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X