Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
బిగ్‌బాస్ నుంచి నోయల్ సీన్ బయటకు.. అనూహ్య పరిస్థితిలో ఇంటి నుంచి అవుట్.. విషాదంలో..
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో మరో అనుహ్యమైన పరిణామం చోటుచేసుకొన్నది. కొద్ది వారాల క్రితం అస్వస్థతకు గురై ఇంటి నుంచి గంగవ్వ వెళ్లిపోవడం ఇంటి సభ్యులకే కాకుండా ప్రేక్షకులకు షాకిచ్చింది. ఆ ఘటన మరిచిపోక ముందే ఇంటి నుంచి నోయల్ సీన్ వెళ్లిపోవడం మరో షాక్ తగిలింది. నోయల్ సీన్‌కు అసలు ఏమైందంటే..
రెండు వారాల క్రితమే గంగవ్వ
రెండు వారాల క్రితం ఇంట్లో అస్వస్థతకు గురికావడంతో గంగవ్వకు మెరుగైన వైద్య సేవలు అందించే ప్రయత్నం చేశారు. అయినా ఆరోగ్యం కుదుటపడక పోవడంతో ఆమెను తప్పని సరి పరిస్థితుల్లో ఇంటి నుంచి బయటకు పంపే అనుమతి ఇస్తూ బిగ్‌బాస్ నిర్ణయం తీసుకొన్నారు.
రెండు రోజులుగా నోయల్ సీన్ అనారోగ్యంతో
ఇక రెండు రోజులుగా ఇంట్లో నోయల్ సీన్ ఇంట్లో బాధపడుతున్నారు. లగ్జరీ బడ్జెట్ టాస్క్ సందర్భంగా అరోగ్యం మరింత క్షీణించడంతో నోయల్ వైద్యం కోసం ఆర్థించారు. నోయల్‌కు ఆరోగ్య పరీక్షలు జరిపించడానికి బిగ్‌బాస్ వైద్యులను పంపించారు. అంతేకాకుండా టాస్క్ ఆడకుండా రెస్ట్ తీసుకోమని చెప్పారు.
బిగ్‌బాస్ సూచన మేరకు నోయల్ వైద్య పరీక్షలు
కన్ఫెషన్ రూమ్ నుంచి బయటకు వచ్చిన నోయల్ తన బాధను ఇంటి సభ్యులకు పంచుకొన్నారు. దాంతో నోయల్‌కు అభిజిత్ ఆరోగ్య పరంగా చిట్కాలు చెప్పి.. మరింత తీవ్రం కాకుండా చూసుకోవాలని సలహా ఇచ్చారు. ఇంకా ఏడు వారాలు ఇంట్లో ఉండాలి కాబట్టి.. హెల్త్‌ను కాపాడుకోవాలని సూచించాడు. ఆ తర్వాత నోయల్ టాస్క్ బాధ్యతలను అభిజిత్‌కు అప్పగించి రెస్ట్ తీసుకొన్నారు.
మరింత మెరుగైన చికిత్స కోసం నోయల్ బయటకు
ఇక గురువారం రోజున నోయల్ పరిస్థితి మరింత విషమించడంతో మెరుగైన వైద్యం కోసం బయటకు పంపించారు. కన్ఫెషన్ రూమ్‌లో నోయల్‌తో బిగ్‌బాస్ మాట్లాడుతూ.. వైద్యుల కోరిక మేరకు మరింత మెరుగైన వైద్యం కోసం మీరు బయటకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. దాంతో విచారంగా కన్ఫెషన్ రూమ్ బయటకు వచ్చాడు.
విషాదంలో ఇంటి సభ్యులు
నోయల్ పరిస్థితి చూసి ఇంటి సభ్యులు విచారంలో మునిగిపోయారు. ఇంటి సభ్యులందరితో ఆప్యాయంగా కౌగిలించుకొని ఇంటి నుంచి బయటకు వచ్చారు. నోయల్‌ను బయటకు పంపుతూ ఇంటి సభ్యులందరూ విషాదంలో మునిగిపోయారు.