బిగ్ బాస్ విషయంలో అనుకున్నదే చేసిన నోయల్: వాళ్లిద్దరి పేర్లు ముందే లీక్ చేసేశాడు!

నోయల్ సీన్.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు పెద్దగా పరిచయం చేయనవసరం లేని పేరిది. సింగర్‌గా కెరీర్‌ను ఆరంభించి.. ర్యాపర్‌గా, లిరిసిస్ట్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎన్నో విద్యలను ప్రదర్శించి ఫేమస్ అయ్యాడతను. అదే సమయంలో యాక్టర్‌గానూ రాణించి మంచి గుర్తింపును అందుకున్నాడు. ఇక, ప్రస్తుతం ప్రసారం అవుతోన్న నాలుగో సీజన్‌‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న అతడు.. అనివార్య కారణాలతో ముందే బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత బిగ్ బాస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. షో ఫినాలేకు చేరుకున్న సమయంలో ఇద్దరి పేర్లను లీక్ చేసి షాకిచ్చాడు. ఆ వివరాలు మీకోసం!

Recommended Video

Bigg Boss Telugu 4 : Rahul Sipligunj Controversial Post On Bigg Boss Contestants
 టైటిల్ ఫేవరెట్‌గా ఎంట్రీ.. మంచోడిగా పేరు

టైటిల్ ఫేవరెట్‌గా ఎంట్రీ.. మంచోడిగా పేరు


\టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు నోయల్ సీన్. ఈ క్రమంలోనే ఎన్నో సినిమాలకు పని చేశాడు. కెరీర్ సాఫీగా సాగిపోతోన్న సమయంలో బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో పెద్దగా పేరున్న వాళ్లు చాలా తక్కువ మంది ఉండడంతో నోయల్‌ను టైటిల్ ఫేవరెట్ అనుకున్నారంతా. అందుకు తగ్గట్లే షోలోనూ మంచి పేరు తెచ్చుకున్నాడు.

టాస్కుల్లో సత్తా చాటాడు.. సేవ్ అయ్యాడు

టాస్కుల్లో సత్తా చాటాడు.. సేవ్ అయ్యాడు

బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే నోయల్ తన సత్తాను నిరూపించుకున్నాడు. సీజన్ ఆరంభం నుంచే ప్రతి టాస్కులో వందకు వంద శాతం శ్రమను చూపిస్తూ సత్తా చాటాడు. అదే సమయంలో ఎవరితోనూ గొడవలకు దిగకుండా ప్రతి విషయాన్ని సున్నితంగా పరిష్కరించాడు. ఫలితంగా పలుమార్లు నామినేషన్స్‌లోకి వచ్చినా ప్రేక్షకుల ఓట్ల ద్వారా సేవ్ అయ్యాడు.

నారోగ్యంతో బిగ్ బాస్ నుంచి బయటకు

నారోగ్యంతో బిగ్ బాస్ నుంచి బయటకు

బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో అనారోగ్యంతో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు నోయల్. అయినప్పటికీ చాలా రోజుల పాటు అలాగే షోలో కొనసాగాడు. కానీ, పరిస్థితి చేయిదాటి పోవడంతో మెరుగైన వైద్యం కోసం బయటకు వెళ్లాల్సిందేనని డాక్టర్లు సూచించారు. దీంతో తప్పని పరిస్థితుల్లో షో నుంచి బయటకు వచ్చేశాడతను. వస్తూ వస్తూ హారిక, లాస్య, అభిజీత్‌కు మద్దతు ప్రకటించాడు.

 బిగ్ బాస్ షోపై సంచలన వ్యాఖ్యలు చేసి

బిగ్ బాస్ షోపై సంచలన వ్యాఖ్యలు చేసి

రియాలిటీ షో నుంచి అనూహ్యంగా బయటకు వచ్చేసిన నోయల్.. బిగ్ బాస్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడని జోరుగా ప్రచారం జరిగింది. అలాంటి సమయంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతడు ‘అసలు బిగ్ బాస్‌కు ఎందుకు వెళ్లానో అర్థం కావట్లేదు. అసలు ఆ షో మనకి అవసరమే కాదు. బయటికొచ్చాక అది చూడడమే మానేశాను' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఇచ్చిన మాట ప్రకారమే చేసిన నోయల్

ఇచ్చిన మాట ప్రకారమే చేసిన నోయల్

బిగ్ బాస్ షోపై సంచలన వ్యాఖ్యలు చేసి తన ఆగ్రహాన్ని, ఆవేదననూ వెల్లగక్కిన నోయల్ సీన్.. గతంలో ఇచ్చిన మాట ప్రకారం.. అభిజీత్, దేత్తడి హారికకు మద్దతు తెలుపుతూనే ఉన్నాడు. నామినేషన్‌లో ఉన్న ప్రతిసారీ వాళ్లకు ఓట్లు వేయడంతో పాటు తన ఫ్యాన్స్‌ అందరితో ఆ పని చేయించాడు. ఈ విషయాన్ని ప్రతిరోజూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేస్తుండేవాడు.

వాళ్లిద్దరి పేర్లు ముందే లీక్ చేసేశాడుగా

వాళ్లిద్దరి పేర్లు ముందే లీక్ చేసేశాడుగా

షో నుంచి బయటకు వచ్చే రోజు అభిజీత్, హారికను ఫినాలేలో ఉంచేందుకు ప్రయత్నిస్తా అని నోయల్ వాళ్లకు మాటిచ్చాడు. అందుకు అనుగుణంగానే వాళ్లిద్దరూ టాప్ -5కి చేరినట్లు ఒకరోజు ముందే లీక్ చేసేశాడతను. మోనాల్ గజ్జర్ ఎలిమినేట్ అయిందని ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇప్పుడు నోయల్ చేసిన పోస్టుతో దానికి బలం చేకూరినట్లైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X