ప్రేమ గాయాల నుంచి కోలుకోలేదా?.. బిగ్ బాస్ ఉత్సవంలో టచ్ చేసిన నోయల్
నోయల్ ర్యాప్ సాంగ్స్, ఆయన లిరిక్స్, ఆల్బమ్స్ గురించి అందరికీ తెలిసిందే. ఎవరి మీదైనా సరే ఇట్టే ర్యాప్ రాయగలడు. అందుకు బిగ్ బాస్, నాగార్జున, చిరంజీవి ఇలా అందరి మీద ర్యాప్ పాడేసి ఆకట్టుకున్నాడు. బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సమయంలోనూ కంటెస్టెంట్లందరి మీదా ర్యాప్ పాడేశాడు. అది బాగానే క్లిక్ అయింది. మరీ ముఖ్యంగా లాస్య, హారిక, అభిజిత్‌ల మీద నోయల్ రాసిన ర్యాప్ బాగానే వర్కవుట్ అయింది.

తాజాగా మళ్లీ..
ప్రస్తుతం బిగ్ బాస్ కంటెస్టెంట్లందరినీ ఒకే చోటకు తీసుకొచ్చే ఓ ప్రోగ్రాం రాబోతోన్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ ఉత్సవం పేరిట రాబోతోన్న ఈ షోలో కంటెస్టెంట్లందరూ కూడా పాల్గొంటున్నారు. అయితే ఇందులో నాలుగు సీజన్ల కంటెస్టెంట్లందరూ కూడా ఫుల్ రచ్చ చేసినట్టున్నారు.

బిగ్ బాస్ ఉత్సవం అలా..
బిగ్ బాస్ ఉత్సవం పేరిట ఫిబ్రవరి 7న రాబోతోన్న షోలో కంటెస్టెంట్లందరూ కూడా దుమ్ములేపేశారు. ఈ పాటికే బయటకు వచ్చిన వీడియోలు, ఫోటోలు, షూటింగ్ సెట్‌లో సందడి అంతా కూడా అందరికీ తెలిసిందే. దీనికి తోడు ఇప్పటి వరకు వచ్చిన ప్రోమోలు కూడా అదిరిపోయాయి.

నాల్గో సీజన్ మాత్రమే..
బిగ్ బాస్ ఉత్సవం పేరిట వస్తోన్న ప్రోమోల్లో కేవలం నాల్గో సీజన్ కంటెస్టెంట్ల హంగామానే కనిపిస్తోంది. మిగతా మూడు సీజన్ల కంటెస్టెంట్లకు, వారితో జరిపిన షూటింగ్, ఆ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోలు ఇంకా బయటకు రావడం లేదు.

అభిజిత్ శ్రీముఖిల రచ్చ..
బిగ్ బాస్ ఉత్సవం షోను శ్రీముఖి అభిజిత్ ముందుండి నడుపుతున్నట్టు కనిపిస్తోంది. ఈమేరకు వదిలిన ప్రోమోలు బాగానే వైరల్ అవుతోంది. అయితే తాజాగా నోయల్ పాడిన పాటను ప్రోమోగా వదిలారు. ఆ పాట వింటుంటే.. నోయల్ తన ప్రేమ గాయాలు, ఆ అనుభవాలను ఇంకా మరిచిపోలేదేమోనని అనిపిస్తోంది.

మారదే మారదే ఈ ప్రేమ..
మారదే మారదే ఈ ప్రేమ అంటూ నోయల్ పాడిన ఈ పాటకు అందరూ ఫిదా అయినట్టున్నారు. తన ఈ పాటను బిగ్ బాస్ ఉత్సవం నాడు రిలీజ్ చేయబోతన్నట్టు ఆ తరువాత తన చానెల్‌లో అది అందుబాటులో ఉంటుందని నోయల్ తెలిపాడు. అయితే ఈ పాటను విని బిగ్ బాస్ కంటెస్టెంట్లు నిజంగానే ఎమోషనల్ అయినట్టు కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











