Naga Panchami: మోక్ష అలా చేస్తే పంచమి జీవితంలో పాముగా మారదట.. నిజం చెప్పిన నాగసాధువు!
నాగ పంచమి సీరియల్ రోజురోజుకూ అద్భుతమైన టీఆర్పీని సొంతం చేసుకుంటూ దూసుకెళ్తోంది. ముఖ్యంగా అదిరిపోయే ట్విస్టులు అంతకు మించిన సస్పెన్స్ తో ప్రతీ ఎపిసోడ్ ఓ సినిమాను తలపిస్తోంది. ఇటీవలే పంచమి జన్మ రహస్యం తెలుసుకున్న మోక్ష.. తాను చనిపోతైనని ఫిక్స్ అయిపోయాడు. తాను ఏమైపోయినా ఫర్వాలేదనుకుని.. సుబ్బు మాటలతో పంచమికి దగ్గరయ్యాడు. అయితే నాగలోకం నుంచి యువరాజు ఫణీంద్ర రావడం మరింత భయంలోకి పంచమి వెళ్లడం చూపిస్తున్నారు. ఇదంతా ఇలా ఉండగా.. మోక్ష మాత్రం పంచమి కోసం ఏదైనా చేయాలనుకుంటున్నాడు.
ఈక్రమంలోనే నాగులవరం వెళ్లిన మోక్ష నాగ సాధువును కలిశాడు. పంచమి గురించి తెలిసి కూడా నువ్వు పంచమితోనే ఉన్నావంటే నువ్వు అందరిలో ఒక్కడికి కావంటూ స్వామిజీ చెప్పాడు. తన భార్య అంటే చాలా ఇష్టం అని.. ఆమె మీద అతి ప్రేమతోనే తానిలా చేస్తున్నట్లు వివరించాడు. తాను చనిపోతానని తనకు ఏమాత్రం భయం లేదని.. కానీ చనిపోయేలోపు పంచమికి ఏదైనా చేయాలని అనుకుంటాడు. ఈక్రమంలోనే మీదగ్గరకు వచ్చానంటూ నాగ సాధువుకు వివరిస్తాడు. అందుకు స్పందించిన స్వామీజీ.. ఒక ఉపాయం ఉందని.. కానీ అందులో ఓ మెలిక కూడా ఉందని చెబుతాడు.

పంచమి తల్లిగా మారితే ఆమె పాముగా జీవితంలో మారలేదని వివరిస్తాడు. ఇది చాలు స్వామి నాకు అంటూ మోక్ష చెప్పగా... కానీ నాగ కన్యతో సంభోగం చేసిన వారు ప్రాణాలతో ఉండరని చెప్తాడు. ఈ ఉపాయం చెప్పారు చాలు.. తర్వాత ఏం చేయాలనేది నేను డిసైడ్ చేసుకుంటానంటూ మోక్ష వెళ్లిపోవడం రేపటి ఎపిసోడ్ లో చూడవచ్చు. ఇలాగే పంచమి గుడికి వెళ్లడం, అక్కడ దేన్నో చూసి షాకవ్వడం కూడా తరువాయి భాగంలో చూపించారు. అయితే రేపు ఏం జరగనుందో రేపటి ఎపిసోడ్ చూస్తే పూర్తిగా తెలుస్తోంది.
అయితే ఈరోజుటి ఎపిసోడ్ లో ముందుగా కరాళీ పంపిన భటులు ఇంట్లోని డబ్బు, నగలను కింద పడేస్తారు. ఇల్లంతా పిచ్చిగా మారుస్తారు. ముందుగా దీన్ని చూసిన చిత్ర, జ్వాలలు తమ మీదకు ఎక్కడ వస్తోందనని గదిలోంచి బయటకు వెళ్లిపోతారు. ముఖ్యంగా బీరువా తాళాలు పంచమి వద్ద ఉండడంతో ఆమె దగ్గరకు వెళ్లి నిలదీస్తారు. తమ వెంట తీసుకువచ్చి మరీ పంచమిపైకి ఫైర్ అవుతారు. గది మొత్తం డబ్బులు, నగలు పడి ఉండడం చూసి భయపడుతూ కిందకు వస్తుంది. సోఫా మీద కూర్చొని బాధగా ఉంటుంది.
ఈక్రమంలోనే సుబ్బు పైకి వెళ్తాడు. ఇక ఆ తర్వాత చిత్ర, జ్వాలలు కుటుంబ సభ్యులందరినీ పిలిచి ఆ గదిలోకి తీసుకు వెళ్తారు. పంచమి కూడా వారి వెంటే గజగజవణికిపోతూ వెళ్తుంది. కానీ అప్పటికి అక్కడ కింద డబ్బులు, నగలు ఏమీ ఉండవు. అది చూసిన చిత్ర, జ్వాలలు ఏం జరిగిందో తెలియక భయపడుతూ ఉంటారు. మీరెందుకు ఇలా చేశారంటూ కుటుంబ సభ్యులంతా వారిద్దరినీ తిడతారు. లేదు బీరువాలో డబ్బు, నగలు లేవు చూడండి అనగా.. మోక్ష తల్లి పంచమి వద్ద నుంచి తాళాలు తీసుకొని మరీ బీరువా తాళాలు తీస్తుంది. డబ్బు, నగలు ఎక్కడివి అక్కడ ఉండగా చిత్ర, జ్వాలలు షాకవుతారు.

ముఖ్యంగా అన్నీ అలాగే ఉన్నప్పటికీ మీరిద్దరూ ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారంటూ కుటుంబ సభ్యులు గట్టిగా నిలదీస్తారు. వారు వెళ్లిపోగానే మరోసారి పట్టి పట్టి చూసిన వారికి అవన్నీ కొత్త నోట్ల కట్టలు అని తెలుస్తాయి. కావాలనే సుబ్బు ఇలా చేసి ఉంటాడంటూ మాట్లాడుకుంటారు. ఆ తర్వాత పంచమి కూడా ఏం జరిగిందో తెలియక టెన్షన్ పడుతుంటే.. సుబ్బు ఏం ఫర్వాలేదు పంచమి ఇదంతా మర్చిపో అంటాడు. నీవు భ్రమ పడి ఉన్నట్లున్నావు అందుకే అలా జరిగిందని అంటాడు. లేద సుబ్బు అని పంచమి అనగా.. దాని గురించి మర్చిపో అని చెబుతాడు. ఇలా ఈరోజుటి ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


Click it and Unblock the Notifications











