ఈటీవీ-3 తెలంగాణ ఛానల్ ప్రారంభమైంది
హైదరాబాద్: తెలుగు ప్రజలకు మరో వార్తా వాహిని ఈటీవీ-3 తెలంగాణ ఛానల్ ఈరోజు ఉదయం 9గంటలకు ప్రారంభమైంది. రామోజీ ఫిల్మ్‌సిటీలో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈటీవీ-3 తెలంగాణ ఛానల్ ప్రసారాలను సుమన్ తనయుడు సుజయ్‌బాబు లాంఛనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు, ఈనాడు ఎండీ కిరణ్, మార్గదర్శి ఎండీ శైలాజా కిరణ్, డాల్ఫిన్ హోటల్స్ ఎండీ విజయేశ్వరి, రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీ రామ్మోహన్‌రావు, ఈటీవీ సీఈవో బాపినీడు, సంస్థ ఉద్యోగులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











