ఢీ 10 రికార్డ్: ఎన్టీఆర్ ఎఫెక్టుతో టాప్ లేచిన టీఆర్పీస్
Recommended Video

ఇటీవల జరిగిన ఢీ 10 గ్రాండ్ ఫినాలెకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్టుగా హాజరైన సంగతి తెలిసిందే. జులై 18న ఈటీవీ తెలుగు ఛానల్‌లో ప్రసారం అయిన ఈ షో రికార్డ్ స్థాయి టీఆర్పీ రేటింగ్స్ సొంతం చేసుకుంది. ఎన్టీఆర్ హాజరు కావడం వల్లనే ఈ స్థాయిలో రేటింగ్స్ వచ్చాయని, ఇదంతా యంగ్ టైగర్ మ్యాజికే అని అంటున్నారు.

సక్సెస్‌ఫుల్ షో
తెలుగులో ప్రసారం అవుతున్న మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీవీ రియాల్టీ షోలలో ‘ఢీ' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ డాన్స్ రియాల్టీ షోకు మంచి ఆదరణ ఉంది కాబట్టే విజయవంతంగా 10 సీజన్లు పూర్తి చేసుకుంది. 10వ సీజన్‌ను గత సీజన్ల కంటే పెద్ద హిట్ చేయాలనే ఉద్దేశ్యంతోనే గ్రాండ్ ఫినాలెకు ఎన్టీఆర్‌ను చీఫ్ గెస్టుగా ఆహ్వానించారు.

నెల రోజల ముందే షూట్
టీవీలో ప్రసారం అవ్వడానికి కొన్ని రోజుల ముందే ఈ ఫైనల్ ఎపిసోడ్ ను స్పెషల్‌గా షూట్ చేశారు. ఎన్టీఆర్ ఈ షోకు గెస్టుగా హాజరైన విషయం దాదాపు నెల రోజుల ముందే ట్విట్టర్లో ఫోటోలు, వీడియోల రూపంలో లీక్ అయింది. ఇలా లీక్ అవ్వడం కూడా ఈ షో మరింత హిట్టవ్వడానికి దోహద పడింది.

‘ఢీ' షో చరిత్రలోనే రికార్డ్
కాగా... ఢీ 10 రికార్డు స్థాయిలో 13.9 టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకుంది. ‘ఢీ' షో చరిత్రలోనే ఇది హయ్యెస్ట్ రేటింగ్ అని తెలుస్తోంది. ఒక సక్సెస్‌ఫుల్ షోకు ఎన్టీఆర్ స్ఠార్ ఇమేజ్ తోడైతే ఫలితాలు ఎలా ఉంటాయో మరోసారి రుజువైంది.

ఎన్టీఆర్ ఎఫెక్టుతో బిగ్‌బాస్ సైతం
గతంలో ఎన్టీఆర్ బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ హోస్ట్ చేసినపుడు కూడా రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్స్ వచ్చిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ తెలుగు మొదటి సీజన్ ప్రారంభం సందర్భంగా 16.18 రేటింగ్ వచ్చింది, తర్వాత గ్రాండ్ ఫినాలెకు 14. 13 రేటింగ్ వచ్చింది. ఇపుడు ఎన్టీఆర్ ఢీ 10 ఫైనల్‌కు హాజరు కావడంతో 13.9 టీఆర్పీ రేటింగ్ వచ్చింది.


Click it and Unblock the Notifications











