For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కలిసి పోయిన ఎన్టీఆర్ - రామ్ చరణ్ ఫ్యాన్స్.. ఆర్ఆర్ఆర్ టీం ఫుల్ హ్యాపీ!

  |

  దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో మెగా పవర్​స్టార్ రామ్​చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచే ఈ సినిమా మీద ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఐదు భారతీయ భాషలలో కాక మరో ఐదు విదేశీ భాషల్లో కూడా రిలీజ్ అవుతుంది. అయితే ముందు నుంచి ఈ సినిమా విషయంలో ఎన్టీఆర్-చరణ్ ఫ్యాన్స్ ఒకరి మీద ఒకటి దుమ్మెత్తి పోసుకునే వారు. కానీ తాజాగా వారు కలిసిపోయారు. ఆ వివరాల్లోకి వెళితే

  ఎక్కడా తగ్గేదేలే

  ఎక్కడా తగ్గేదేలే

  తెలుగు సినిమా సత్తాను కేవలం భారతదేశానికి మాత్రమే కాక ప్ర‌పంచానికి తెలియ‌జెప్పిన బాహుబలి దెబ్బకు రాజమౌళి రేంజ్ మారిపోయింది. రెండు భాగాలుగా రూపొందిన ఈ చిత్రం దాదాపు రూ.2400 కోట్ల క‌లెక్ష‌న్స్‌ను సాధించి ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీకి బద్దలు కొత్త లేని రికార్డుగా నిలిచింది. ఇక ఈ సినిమా పలు విదేశీ భాషల్లో కూడా రిలీజ్ అయి తెలుగు సినిమా సత్తా ప్రపంచానికి చాటి చెప్పింది. చెప్పి తెలుగు వాడు ఎందులోనూ తక్కువ కాదని నిరూపించింది.

  రౌద్రం ర‌ణం రుధిరం

  రౌద్రం ర‌ణం రుధిరం

  బాహుబలి క్రేజ్ తో పాటు హాలీవుడ్ మొదలు బాలీవుడ్ దాకా అనేక మంది నటీనటులు కూడా సినిమాలో భాగం కావడంతో ఈ ఆర్ఆర్ఆర్ సినిమా కోసం అన్ని బాషల ప్రేక్షకులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే రాజ‌మౌళి టాలీవుడ్ టాప్‌ హీరోలయిన ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌ల‌తో అన్ని బాషల నటులను మొహరించి ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

  RRR Movie Streaming Details, బిజినెస్ 1200 కోట్ల పైనే || Filmibeat Telugu
  అక్టోబ‌ర్ 13న పక్కా

  అక్టోబ‌ర్ 13న పక్కా

  అక్టోబ‌ర్ 13న ప్రపంచ వ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్ (రౌద్రం ర‌ణం రుధిరం)'ను విడుద‌ల చేస్తామని ఈ మధ్య యూనిట్ నుంచి వచ్చిన లేటెస్ట్ పోస్టర్ లో కూడా పేర్కొన్నారు. కరోనా వైరస్ దాటికి షూటింగ్ వాయిదా పడిన నేపథ్యంలో సినిమా అక్టోబర్ నెల 13వ తేదీన రిలీజ్ కావడం అనేది దాదాపు అసాధ్యం అని అన్నా అదే డేట్ కి వచ్చేసేలా ప్లాన్ చేస్తున్నారు జక్కన్న అండ్ టీమ్.

  ఎన్టీఆర్ ఫ్యాన్స్ vs చరణ్ ఫ్యాన్స్

  ఎన్టీఆర్ ఫ్యాన్స్ vs చరణ్ ఫ్యాన్స్

  కొన్నాళ్ళ క్రితం దాకా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలాగే రామ్ చరణ్ ఫ్యాన్స్ ప్రతి చిన్న విషయానికి గొడవ పడేవారు. ట్వీట్టర్‌లో #FanBaseLessNTR అంటూ రాంచరణ్ ఫ్యాన్స్, #FanBaseLessRamCharan అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ దారుణంగా ట్వీట్లు చేసుకోవడం కూడా తలనొప్పిగా మారాయి. హీరో రాంచరణ్ ని కించపరుస్తూ హీరో ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ని కించపరుస్తూ హీరో రామ్ చరణ్ ఫ్యాన్స్ అసభ్యకరమైన పోస్టులు పెట్టడం చర్చనీయాంశమైంది. అలా రచ్చ చేసుకున్న ఈ ఇద్దరి హీరోల అభిమానులు ఇప్పుడు మారిపోయారు.

  ఆర్ఆర్ఆర్ కు ప్రేమతో

  ఆర్ఆర్ఆర్ కు ప్రేమతో

  ఇప్పుడు నాకు మన ఆర్ఆర్ఆర్ సినిమా కంటే ఏది ఎక్కువ అనిపించడం లేదు రా అని నాన్నకు ప్రేమతో సినిమా లో రాజీవ్ కనకాల ఎన్టీఆర్ తో చెబుతున్నట్లుగా ఉన్న మీమ్ ఒకటి క్రియేట్ చేశారు. అందులో రాజీవ్ కనకాల ఎన్టీఆర్ ఫ్యాన్స్ గా ఎన్టీఆర్ ను రామ్ చరణ్ ఫ్యాన్స్ గా చూపిస్తూ వారిద్దరూ ఒక్కటయిపోయినట్లు చూపించడంతో పక్కనే ఉన్న అవసరాల శ్రీనివాస్ అంటే రాజమౌళి ఆనంద పడుతున్నట్లు గా చూపించారు. ఇక బృందావనం సినిమాలో శ్రీహరి కళ్ళు తుడుచుకుంటున్న జిఫ్ తో ఆర్ఆర్ఆర్ యూనిట్ దానికి రిప్లై ఇచ్చింది.

  English summary
  As we all know Roudram Ranam Rudhiram (RRR) will be getting ready release on October 13, 2021. from the begining ram charan fans and ntr fans are involved in some fan wars. no they both become one.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X