twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'మీలో ఎవరు కోటీశ్వరుడు' లో ఎన్టీఆర్

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఎన్టీఆర్ న్నాన్నకు ప్రేమతో సినిమాకు సంబందించిన ప్రమోషన్స్ ప్రారంబించాడు. దీనిలో భాగంగా ఎలాంటి అవకాశాన్ని వదులుకునేటట్టు కనిపించడంలేదు. నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహిరిస్తున్న సక్సెస్ ఫుల్ షో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' సెషన్ -3 లో 'నాన్నకు ప్రేమతో' ప్రమోషన్స్ కి సంబందించి ఎన్టీఆర్ పాల్గోనున్నారు. దీనికోసం ఎన్టీఆర్ ను నాగర్జున ఇన్ వైట్ చెయ్యడం సర్ఫైజ్ గా మారింది.

    ఎన్టీఆర్ తో పోటి పడుతున్న నాగర్జునే ఈ ప్రోగ్రామ్ కు హైలెట్ అవుతాడో లేక అతిధిగా వచ్చిన ఎన్టీఆర్ హైలెట్ అవుతాడో చూడాలి అంటున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే ఈ ఇద్దరు హీరోలు సంక్రాంతికి పోటిపడుతున్నారు.

    NTR in 'Meelo Evaru Koteeshwarudu' Season 3

    నాన్నకు ప్రేమతో చిత్రం విడుదల విషయానికి వస్తే..సంక్రాంతికి విడుదల అవుతున్న మిగతా చిత్రాల కన్నా భారీగా ఈ సినిమాని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 1700 స్క్రీన్స్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయటానికి రిలియన్స్ వారు, డిస్ట్రిబ్యూటర్స్ కలిసి ప్లాన్ చేసినట్లు ట్రేడ్ వర్గాల సమచారం.

    బిజినెస్ విషయానికి వస్తే...సీడెడ్, నార్త్ ఇండియా తప్ప అన్ని ఏరియాలు బిజినెస్ పూర్తైనట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ రెండు ప్రాంతాల్లోనూ ఈ సినిమాను సమర్పిస్తున్న రిలియన్స్ వారే రిలీజ్ చేస్తున్నట్లు చెప్తున్నారు. మరో ప్రక్క ..., ఆడియో పాటు విడుదలైన దియోటర్ ట్రైలర్ కి మంచి స్పందన వస్తొంది. ఆ ట్రైలర్ ని ఇక్కడ చూడండి.

    రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ భారీ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార, అమిత్‌, తాగుబోతు రమేష్‌, గిరి, నవీన్‌ తదితరులు నటిస్తున్నారు.

    ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఫోటోగ్రఫీ: విజయ్‌ చక్రవర్తి, ఆర్ట్‌: రవీందర్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, పాటలు: చంద్రబోస్‌, డాన్స్‌: రాజు సుందరం, శేఖర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సుధీర్‌, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్‌.

    English summary
    NTR is also promoting his movie on Meelo Evaru Koteeshwarudu Season 3, the highly popular show hosted by Nagarjuna.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X