టీవిలో ‘’రభస’’ ప్రీమియర్ షో...డిటేల్స్

By Srikanya

హైదరాబాద్ : బెల్లంకొండ సురేష్ సమర్పణలో యువ నిర్మాత బెల్లంకొండ గణేష్‌బాబు శ్రీలక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన భారీ చిత్రం ‘రభస' ఈ చిత్రం ఆగస్ట్ 29న వరల్డ్‌వైడ్‌గా విడుదల అయ్యింది. ఎన్టీఆర్, సమంత, ప్రణీత కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రం మార్నింగ్ షో కే ఫ్లాప్ టాక్ తెచ్చుకుని, ఎన్టీఆర్ కెరీర్ లో ఓ మచ్చగా మిగిలిపోయింది. అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్ వినోదాన్ని బాగా పండించాడనేది మాత్రం నిజం.

ఇప్పుడది టీవీ ప్రేక్షకులను ఆలరించనుంది. టీవీలో మొదటి ప్రీమియర్ షో ఈ ఆదివారం సాయింత్రం వేయనున్నారు. జెమెనీ టీవీ వారు ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని పొందారు. రిలీజ్ కు ముందు విపరీతమైన క్రేజ్ ఉండటంతో ఎనిమిది కోట్లకు ఈ శాటిలైట్ రైట్స్ అమ్ముడయ్యాయని తెలుస్తోంది. ఇప్పుడవి ఎంతవరకూ రికవరీ అవుతాయో వేచి చూడాలి.

NTR ‘’Rabhasa’’ 1st premiere show details

చిత్రం కథేమిటంటే... కార్తీక్‌ (ఎన్టీఆర్‌) ...తన తల్లి(జయసుధ) కి మరదలు(మామయ్య షాయీజీ షిండే కూతురు)నే పెళ్లి చేసుకుంటానని మాట ఇస్తాడు. అయితే అంత ఈజీ కాదు. తన చిన్నప్పుడే ఆ మామయ్య తన తండ్రి(నాజర్)తో విభేదించి సిటీకి వెళ్లి ఎదుగుతాడు. దాంతో ఇప్పుడు తన మరదలుని వెతుక్కుంటూ సిటీకి వస్తాడు. అక్కడకి వచ్చాక బాగ్యం(ప్రణీత)ని చూసి పొరబడి ఆమే తన మరదలు అనుకుని ఆమె వెంటబడతాడు.

కొంత దూరం ఆ ప్రేమ ప్రయాణం జరిగాక... తన మరదలు ఆమెకాదు... తను ఎప్పుడూ గొడవపడే ఇందు (సమంత)అని రివిల్ అవుతుంది. సర్లే ఇందునే లైన్ లో పెడదామనుకుంటే ఇందు ఆల్రెడీ వేరే వ్యక్తితో ప్రేమలో ఉంటుంది. అలాంటి పరిస్ధుతుల్లో కార్తీక్ తన తల్లికి ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకున్నాడు...ఇందుని ఎలా ఒప్పించాడు అనేది రక రకాల ట్విస్ట్ లతో కూడిన కథ.

ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో ప్రణీత మరో హీరోయిన్. బ్రహ్మనందం,ఆలీ, బ్రహ్మాజీ, నాజర్, జయసుధ, సీత, జయప్రకాశ్‌రెడ్డి, మీనా తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X