For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  NTR's EMK Oct 19th show: ఎన్టీఆర్ షోలో 2500000 ప్రశ్న.. దానికి మీరు జవాబు చెప్పగలరా? ఒకేరోజు ఇద్దరు అవుట్

  |

  ఎవరు మీలో కోటీశ్వరులు షోలో రాజమండ్రికి చెందిన సురేంద్రనాథ్ అద్బుతంగా రాణించారు. ఎన్టీఆర్‌నే కాకుండా ప్రేక్షకులను కూడా ఆకట్టుకొంటూ ప్రశ్నలకు జవాబులు చకచకా చెప్పారు. 2500000 ప్రశ్నకు సమాధానం తెలిసినా కాన్ఫిడెన్స్ కాస్త తక్కువగా ఉండటంతో క్విట్ అయ్యారు. వాస్తవానికి సురేంద్ర నాథ్ చెప్పిన జవాబు కరెక్ట్ కావడం గమనార్హం. అయితే ఆ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పగలరా? ఒకసారి ట్రై చేయండి..

  1250000 రూపాయల కోసం ప్రశ్న

  1250000 రూపాయల కోసం ప్రశ్న

  వీటిలో భారత హాకీ జట్టుకు అధికారికంగా స్పాన్సర్ చేసే రాష్ట్ర ప్రభుత్వం ఏది?
  a) బీహార్
  b) జార్ఖండ్
  c) పశ్చిమ బెంగాల్
  d) ఒడిషా

  Answer: ఒడిషా

  2500000 రూపాయల కోసం ప్రశ్న

  2500000 రూపాయల కోసం ప్రశ్న

  ఆర్థర్ విన్ చేత సృష్టించబడి మరియు 1913లో న్యూయార్క్ వరల్డ్‌లో మొదట ముద్రించబడినది ఏది?
  a) క్రాస్ వర్డ్ పజిల్
  b) కార్యూన్ స్ట్రిప్
  c) సుడోకు
  d) క్విజ్

  పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో చివరి, మూడో లైఫ్‌లైన్ ఉపయోగించుకొన్నారు. తన చేతిలో ఉన్న 50:50 ఆప్షన్‌ను ఉపయోగించుకోవడంతో కంప్యూటర్ స్క్రీన్ పై క్రాస్ వర్గ్ పజిల్, క్విజ్ మిగిలాయి. అయితే డౌట్ ఉండటంతో క్విట్ అయ్యాడు. చివరకు 1250000 గెలుచుకొని విజయగర్వంతో గేమ్ నుంచి నిష్క్రమించాడు

  Answer: క్రాస్ వర్డ్ పజిల్

  ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్న

  ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్న

  వారి తెరంగేట్ర చిత్రాల ఆధారంగా ఈ నటీనటులను కాలక్రమంలో అమర్చండి

  A) రష్మిక
  B) విజయశాంతి
  C) శారద
  D) తమన్నా

  Answer: C, B, D, A

  1000 రూపాయల కోసం ప్రశ్న

  1000 రూపాయల కోసం ప్రశ్న

  ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్నకు ఇంద్రనీల్ అతివేగంగా సమాధానం చెప్పి హట్ సీట్‌పైకి వచ్చారు. తిరుపతికి చెందిన ఇంద్రనీల్ డీ ఫార్మసీ చదివారు. ప్రస్తుతం సివిల్ సర్వీస్ పరీక్షలకు సిద్ధం అవుతున్నారు. బెస్ట్ ఇన్సిపిరేషన్ స్పీకర్‌గా 2019లో అవార్డు అందుకొన్నారు. ఖాళీ సమయంలో బాడ్మింటన్, క్రికెట్, టెన్నిస్ ఆడుతుంటారు.


  భారత దేశంలో ఏ వృత్తిలో స్త్రీని వ్యవహారికంగా సిస్టర్ అని సంభోదిస్తారు?
  a) ఇంజీనీరింగ్
  b) మార్కెటింగ్
  c) లా
  d) నర్సింగ్

  Answer: నర్సింగ్

  2000 రూపాయల కోసం ప్రశ్న

  2000 రూపాయల కోసం ప్రశ్న

  1989 నాటి చిత్రం శివలోని ఒక పాట వీటిలో ఏ పాఠ్యాంశంతో మొదలవుతుంది?
  a) బోటని
  b) మేథమేటిక్స్
  c) ఫిజిక్స్
  d) హిస్టరీ

  Answer: బోటని

  3000 రూపాయల కోసం ప్రశ్న

  3000 రూపాయల కోసం ప్రశ్న

  ఈ చిత్రంలోని జంతువును గుర్తించండి
  a) క్వాలా
  b) బర్రె
  c) ఖడ్గమృగం
  d) జెయింట్ పాండా

  Answer: జెయింట్ పాండా

  5000 రూపాయల కోసం ప్రశ్న

  5000 రూపాయల కోసం ప్రశ్న

  నోవాక్ జకోవిచ్ ఏ ఆటలో 2021 ఫ్రెంచ్ ఓపెన్ గెలిచారు?
  a) బాస్కెట్ బాల్
  b) క్రికెట్
  c) టెన్నిస్
  d) గోల్ఫ్

  Answer: టెన్నిస్

  10000 రూపాయల కోసం ప్రశ్న

  10000 రూపాయల కోసం ప్రశ్న

  పిజ్జా పుట్టిన దేశం ఏది?
  a) పోలాండ్
  b) ఇటలీ
  c) హంగేరి
  d) సెర్పియా

  పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో తొలి లైఫ్‌లైన్ ఉపయోగించుకొన్నారు. ఆడియెన్స్ పోల్ ఆప్షన్‌ను ఉపయోగించుకోవడంతో ప్రేక్షకులు తమ సమాధానంచెప్పారు. ఎక్కువ మంది ఇటలీ అని సమాధానం చెప్పడంతో ఇంద్రనీల్ కూడా అదే జవాబు చెప్పి పదివేల రూపాయలు గెలుచుకొన్నారు.

  Answer: ఇటలీ

  40000 రూపాయల కోసం ప్రశ్న

  40000 రూపాయల కోసం ప్రశ్న

  భారత ఎన్నికల సంఘం ఆవిర్భవ తేదీ జనవరి 25ను పురస్కరించుకొని ఏ దినోత్సవం జరుపుతారు?
  a) రాజ్యంగ దినోత్సవం
  b) ఓటర్ల దినోత్సవం
  c) సుపరిపాలన దినోత్సవం
  d) గణతంత్ర దినోత్సవం

  Answer: ఓటర్ల దినోత్సవం

  80000 రూపాయల కోసం ప్రశ్న

  80000 రూపాయల కోసం ప్రశ్న

  హిందూ పురాణాలలో, అమరావతి అనే నగరం ఎవరిది?
  a) విష్ణువు
  b) అగ్ని
  c) బ్రహ్మ
  d) ఇంద్రుడు

  పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో రెండో లైఫ్ లైన్ ఉపయోగించుకొన్నారు. వీడియో కాల్ ఏ ఫ్రెండ్ ఆప్షన్‌ను ఉపయోగించకోవడంతో తను చెప్పిన వ్యక్తికి కాల్ చేశారు. ఇంద్రుడు అని సమాధానం చెప్పడంతో అదే జవాబు చెప్పి 80 వేలు గెలుచుకొన్నారు.

  Answer: ఇంద్రుడు

  Samantha : NTR కోసం మొదటిసారి సమంత అలా Naga Chaitanya ఎక్కడా తగ్గట్లేదుగా | RRR || Filmibeat Telugu
  160000 రూపాయల కోసం ప్రశ్న

  160000 రూపాయల కోసం ప్రశ్న

  ఎవరి ఆత్మకథలో మొదటి చాప్టర్ ఫ్రం హైదరాబాద్ టు రెడ్‌మండ్ అని ఉంటుంది?
  a) మహ్మద్ అజారుద్దీన్
  b) సుందర్ పిచాయ్
  c) సత్య నాదెళ్ల
  d) శ్యామ్ బెనగల్

  పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో చివరి, మూడో లైఫ్‌లైన్ 50:50 ఆప్షన్‌ను ఉపయోగించుకొన్నారు. అయితే స్క్రీన్ పై సత్య నాదెళ్ల, శ్యామ్ బెనగల్ సమాధానం మిగలడంతో తొలుత సత్య నాదెళ్ల అని, ఆతర్వాత సమయం మించిపోతుండటంతో శ్యామ్ బెనగల్ అని సమాధానం ఫిక్స్ చేశారు. అయితే ఆ సమాధానం తప్పు కావడంతో గేమ్ నుంచి నిష్క్రమించారు. కేవలం 10 వేల రూపాయలతో గేమ్ నుంచి బయటకు వెళ్లారు.

  Answer: సత్య నాదెళ్ల

  English summary
  NTR's Evaru Meelo Koteeswarulu Show October 20th Episode: Surendranath of Rajamundri is the roll over contestant for October 20th episode. Earlier he won 640000. after he quit the game. Indraneel come onto Hot seat.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X