twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    NTR's EMK Oct 21st show: 12,50,000 ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయిన మహతి.. మీరు చెప్పగలరా?

    |

    ఎవరు మీలో కోటీశ్వరులు షోలో నల్గొండకు చెందిన మహతి అద్బుతంగా రాణించారు. ఎన్టీఆర్‌నే కాకుండా ప్రేక్షకులను కూడా ఆకట్టుకొంటూ ప్రశ్నలకు జవాబులు చకచకా చెప్పారు. 12,50,000 ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో ఆరు లక్షల నలభై వేలు తీసుకుని క్విట్ అయ్యారు. అయితే మహతి చెప్పిన జవాబు కరెక్ట్ కాకవడం గమనార్హం. అయితే ఆ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పగలరా? ఒకసారి ట్రై చేయండి..

    ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్న

    ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్న

    ఈ వస్తువులను వాటి పేర్లలో పేర్కొన్న ప్రదేశాల ప్రకారం, దక్షిణం నుండి ఉత్తరానికి అమర్చండి అని కోరారు.

    A: కాశ్మీర్ కుంకుమ
    B: మీరట్ కత్తెర
    C: నిర్మల్ పెయింటింగులు
    D: మైసూర్ పాక్

    Answer : D: మైసూర్ పాక్, C: నిర్మల్ పెయింటింగులు, B: మీరట్ కత్తెర, A: కాశ్మీర్ కుంకుమ

    ఈ ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ లో నల్గొండకు చెందిన బీటెక్ థర్డ్ ఇయర్ స్టూడెంట్ మహతి అందరికంటే సరైన సమాధానాలు ముందు చెప్పి హాట్ సీట్ కు చేరింది. ఆమె ఇండియన్ నేషనల్ ప్లెడ్జ్ భారతదేశం నా మాతృభూమి రాసిన మహా రచయిత. అలాంటి ఆయన మానవరాలిగా మహతి ఎంట్రీ ఇచ్చింది.

    1000 రూపాయల కోసం ప్రశ్న

    1000 రూపాయల కోసం ప్రశ్న

    ఈ క్రీడల్లో, బ్యాటర్లు, బౌలర్లు, మరియు వికెట్ కీపర్లు కలిగినటువంటి క్రీడ ఏది?

    A: ఫుట్బాల్
    B: నెట్ బాల్
    C: వాలీబాల్
    D: క్రికెట్

    Answer: D: క్రికెట్

    2000 రూపాయల కోసం ప్రశ్న

    2000 రూపాయల కోసం ప్రశ్న

    సాధారణంగా, వీటిలో పల్లవి, అనుపల్లవి మరియు చరణం అనే భాగాలు ఎందులో ఉంటాయి?

    A: చిత్రలేఖనాలు
    B: పాటలు
    C: శిల్పాలు
    D: నవలలు

    Answer: B: పాటలు

    3000 రూపాయల కోసం ప్రశ్న

    3000 రూపాయల కోసం ప్రశ్న

    వీటిలో, ఒక సైనిక వాహనాన్ని మరియు నీటిని నిల్వ చేసే అరని రెండింటినీ సూచించేది ఏది?

    A: బ్యాంక్
    B: ర్యాంక్
    C: ట్యాంక్
    D: థ్యాంక్

    Answer: C: ట్యాంక్

     5000 రూపాయల కోసం ప్రశ్న

    5000 రూపాయల కోసం ప్రశ్న

    హిందూ ఆచారాల ప్రకారం, వీటిలో తాంబూలంతో పాటు ఏది ఇస్తారు?
    A: టెంకాయ
    B: ఉల్లిపాయ
    C: వెల్లుల్లిపాయ
    D: బంగాళదుంప

    Answer: A: టెంకాయ

     10000 రూపాయల కోసం ప్రశ్న

    10000 రూపాయల కోసం ప్రశ్న

    కంప్యూటింగ్ లో సాధారణంగా, కీబోర్డ్ లోని Ctrl + C కలయిక ఏమి చేస్తుంది?
    A: క్రాప్
    B: కాపీ
    C: క్రియేట్
    D: క్రై

    Answer: B: కాపీ

    40000 రూపాయల కోసం ప్రశ్న

    40000 రూపాయల కోసం ప్రశ్న

    ఈ చిత్రంలోని క్రీడాకారుడిని గుర్తించండి అంటూ ఒక ఫోటో డిస్ప్లే చేశారు.

    A: పుల్లెల గోపీచంద్
    B: ప్రకాష్ పడుకోనె
    C: చేతన్ ఆనంద్
    D: పారుపల్లి కశ్యప్

    Answer: A: పుల్లెల గోపీచంద్

    80000 రూపాయల కోసం ప్రశ్న

    80000 రూపాయల కోసం ప్రశ్న

    కావేరి నది ఏ రాష్ట్రంలో ఉద్భవించింది?

    A: తమిళనాడు
    B: కేరళ
    C: కర్ణాటక
    D: మహారాష్ట్ర

    పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో ఒక లైఫ్ లైన్ ఉపయోగించుకున్నారు. 50-50 లైఫ్ లైన్ ఉపయోగించకోవడంతో తమిళనాడు, కేరళలను తప్పించారు. కార్నాటక అని సమాధానం చెప్పడంతో అదే జవాబు కరెక్ట్ కావడంతో 80 వేలు గెలుచుకున్నారు.

    160000 రూపాయల కోసం ప్రశ్న

    160000 రూపాయల కోసం ప్రశ్న

    వీటిలో, 'మన ఊరు మన చెరువు' అనే ఉపశీర్షిక దేనికి సంబంధించినది?

    A: మిషన్ కాకతీయ
    B: ధరణి
    C: హరితహారం
    D: మిషన్ భగీరథ

    పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో రెండో లైఫ్ లైన్ ఉపయోగించుకున్నారు. వీడియో కాల్ ఏ ఫ్రెండ్ ఆప్షన్‌ను ఉపయోగించకోవడంతో తను చెప్పిన సదానంద్ అనే వ్యక్తికి కాల్ చేశారు. ఆయన సరిగా A: మిషన్ కాకతీయ అని సమాధానం చెప్పడంతో అదే జవాబు చెప్పి లక్షా అరవై వేలు గెలుచుకున్నారు.

    320000 రూపాయల కోసం ప్రశ్న

    320000 రూపాయల కోసం ప్రశ్న

    వీటిలో, ఎస్ ఐ ప్రమాణం 'న్యూటన్'లతో కొలిచేది ఏది?

    A: కాలం
    B: బలం
    C: సామర్థ్యం
    D: శక్తి

    Answer: B: బలం

    ఇక్కడితో సెకండ్ సేఫ్ పాయింట్ రీచ్ అయ్యారు.

    640000 రూపాయల కోసం ప్రశ్న

    640000 రూపాయల కోసం ప్రశ్న

    అనంతపురం జిల్లాలో నిమ్మలకుంట మరియు గుంటూరు జిల్లాలోని నరసరావుపేట వీటిలో దేనికి ప్రసిద్ధి?

    A: కుండలు
    B: ఇత్తడి సామాను
    C: తోలుబొమ్మ
    D: తివాచీలు

    పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో చివరి, మూడో లైఫ్‌లైన్ ఉపయోగించుకొన్నారు. ఆడియెన్స్ పోల్ ఆప్షన్‌ను ఉపయోగించుకోవడంతో ప్రేక్షకులు తమ సమాధానంచెప్పారు. ఎక్కువ మంది తోలుబొమ్మ అని సమాధానం చెప్పడంతో మహతి కూడా అదే జవాబు చెప్పి ఆరు లక్షల నలభై రూపాయలు గెలుచుకున్నారు.

    Recommended Video

    AR Rahman Bathukamma Song 2021: Gautham Vasudev Directs | Telangana Jagruthi
    12,50,000 రూపాయల కోసం ప్రశ్న

    12,50,000 రూపాయల కోసం ప్రశ్న

    వీటిలో, సింధూ లోయకు చెందిన మొహెంజొదారో తవ్వకాల్లో బయటపడిన పశుపతి ముద్రికపై కనిపించని జీవి ఏది?

    A: పులి
    B : ఖడ్గమృగం
    C: దున్నపోతు
    D: గుర్రం

    ఈ ప్రశ్నకు సమాధానం తెలియక పోవడంతో మహతి షోకి క్విట్ చెప్పేశారు. దీంతో ఆమె ఆరు లక్షల నలభై వేలు సంపాదించినట్టు అయింది. అయితే దీనికి ఏదో ఒక ఆప్షన్ ఎంచుకోమనగా మహతి C: దున్నపోతును ఎంచుకున్నారు. ఇక అది తప్పు సమాధానం అని గుర్రం సరైన సమాధానం అని తేలింది. ఇక ఆమె వెళ్ళిపోగానే బజర్ కూడా మోగింది.

    English summary
    NTR's Evaru Meelo Koteeswarulu Show October 21st Episode: Surendranath of Rajamundri is the roll over contestant for October 20th episode. Earlier he won 640000. after he quit the game. Indraneel comes onto the Hot seat.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X