For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  NTR's EMK Show ఎన్టీఆర్ షోలో రూ. కోటిపై పోలీస్ ఇన్స్‌పెక్టర్ టార్గెట్.. ఆ ప్రశ్నలకు జవాబు చెప్పగలరా?

  |

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు నవంబర్ 15, 16 ఎపిసోడ్స్ ప్రత్యేకతను సంతరించుకొన్నాయి. ఈ షో చరిత్రలో తొలిసారి కోటి రూపాయలు గెలుచుకొన్న ఎపిసోడ్‌ ఇది. కొత్తగూడెం జిల్లా సుజాత నగర్‌కు చెందిన సైబర్ క్రైమ్ ఇన్స్‌పెక్టర్ రాజా రవీంద్ర ఎవరు మీలో కోటీశ్వరులు షోలో అద్భుతమైన ప్రతిభను చాటుకొన్నారు. ఎలాంటి తడబాటు లేకుండా స్పష్టంగా ప్రశ్నలకు జవాబులు చెబుతూ ఆకట్టుకొన్నారు. కోటి రూపాయల గేమ్‌ను గెలుచుకొన్న రాజా రవీంద్ర ముందుకు వచ్చిన ప్రశ్నలు వాటికి ఆయన చెప్పిన సమాధానాలు ఇవే..

  హైదరాబాద్ నుంచి వాటి దూరాల ప్రకారం ఈ నగరాలను తక్కువ నుంచి ఎక్కువకు అమర్చండి

  హైదరాబాద్ నుంచి వాటి దూరాల ప్రకారం ఈ నగరాలను తక్కువ నుంచి ఎక్కువకు అమర్చండి

  A) న్యూయార్క్
  B) ముంబై
  C) దుబాయ్
  D) విజయవాడ

  పై ప్రశ్నకు రాజా రవీంద్ర అత్యంత వేగంగా సమాధానం చెప్పారు. కేవలం 2.6 సెకన్లలో సమాధానం చెప్పి హాట్ సీట్‌పైకి వచ్చారు. హాట్ సీట్‌పైకి వచ్చిన ఆయన చకచకా సమాధానాలు చెప్పారు. రాజా రవీంద్ర పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో గన్ షూటింగ్ పోటీలలో దేశం తరఫున పలు పతకాలు గెలుచుకొన్నారు. కరాటేలో బ్రౌన్ బెల్ట్ సాధించాడు. దేశం తరఫున గ

  Answer: D, B, C, A

   1000 రూపాయల కోసం ప్రశ్న

  1000 రూపాయల కోసం ప్రశ్న

  సాధారణంగా, వీటిలో దేని మీద చెల్లుబాటు తేదీ ముద్రించి ఉండదు?
  a) ఆధార్ కార్డు
  b) పాస్‌పోర్టు
  c) డెబిట్ కార్డు
  d) డ్రైవింగ్ లైసెన్స్

  Answer: ఆధార్ కార్డు

  2000 రూపాయల కోసం ప్రశ్న

  2000 రూపాయల కోసం ప్రశ్న

  ఈ విగ్రహంలో కనిపిస్తున్న వారిని గుర్తించండి

  a) మహావీర
  b) బాహుబలి
  c) బుద్దుడు
  d) గురునానక్

  Answer: బుద్దుడు

  3000 రూపాయల కోసం ప్రశ్న

  3000 రూపాయల కోసం ప్రశ్న

  భారతదేశం కన్నా ఎక్కువ జనాభా ఉన్న దేశాలు ఎన్ని?
  a) ఒకటి
  b) రెండు
  c) మూడు
  d) నాలుగు

  Answer: ఒకటి

  5000 రూపాయల కోసం ప్రశ్న

  5000 రూపాయల కోసం ప్రశ్న

  5000 రూపాయల కోసం ప్రశ్న
  2019లో భారత హోంశాఖామాత్యులుగా బాధ్యతలు చేపట్టిన వారు ఎవరు?
  a) నిర్మలా సీతారామన్
  b) నితిన్ గడ్కరీ
  c) రవిశంకర్ ప్రసాద్
  d) అమిత్ షా

  Answer: అమిత్ షా

   10000 రూపాయల కోసం ప్రశ్న

  10000 రూపాయల కోసం ప్రశ్న

  వీటిలో, కత్తిసాము, సిలంబం, మరియు కలరిపయట్టు అనేవి దేనికి ఉదాహరణలు?
  a) నృత్యం
  b) సంగీతం
  c) చిత్రలేఖనం
  d) మార్షల్ ఆర్ట్స్

  Answer: మార్షల్ ఆర్ట్స్

   20000 రూపాయల కోసం ప్రశ్న

  20000 రూపాయల కోసం ప్రశ్న

  రేడియో ప్రసారాలలోని AM మరియు FMలో M దేనిని సూచిస్తుంది?
  a) మీటర్
  b) మాడ్యులేషన్
  c) మాగ్నిట్యూడ్
  d) మిషన్

  Answer: మాడ్యులేషన్

   40000 రూపాయల కోసం ప్రశ్న

  40000 రూపాయల కోసం ప్రశ్న

  40000 రూపాయల కోసం ప్రశ్న
  వీటిలో, ఆంధ్రప్రదేశ్‌లోని అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలిసే నది ఏది?
  a) కృష్ణ
  b) తుంగభద్ర
  c) పెన్నా
  d) గోదావరి

  Answer: గోదావరి

  80000 రూపాయల కోసం ప్రశ్న

  80000 రూపాయల కోసం ప్రశ్న

  ఏ మానవ అవయవాలలో, ఐరిస్, లెన్స్, మరియు రెటీనా ఉంటాయి?
  a) ఊపిరితిత్తులు
  b) చెవులు
  c) కళ్లు
  d) కడుపు

  Answer: కళ్లు

  160000 రూపాయల కోసం ప్రశ్న

  160000 రూపాయల కోసం ప్రశ్న

  హిందూ పురాణాలలో, వీరిలో కర్ణుడి గురువు ఎవరు?
  a) వ్యాసుడు
  b) పరుశురాముడు
  c) పాండురాజు
  d) కృష్ణుడు

  Answer: పరుశురాముడు

   320000 రూపాయల కోసం ప్రశ్న

  320000 రూపాయల కోసం ప్రశ్న

  ఆగస్టు 2021లో, అపరేషన్ దేవీశక్తిలో భాగంగా ఏ ప్రాంతం నుంచి భారత ప్రభుత్వం 800 పైచిలుకు జనాన్ని తరలించింది?
  a) అఫ్ఘనిస్థాన్
  b) ఇరాక్
  c) సిరియా
  d) మయన్మార్

  పై ప్రశ్నకు జవాబు తెలియకపోవడంతో రాజా రవీంద్ర తన తొలి లైఫ్ లైన్ ఉపయోగించుకొన్నారు. ఆడియెన్స్ పోల్ ఆప్షన్‌ను ఉపయోగించుకొన్నారు. ఆడియెన్స్‌లో ఎక్కువగా మంది అఫ్ఘనిస్థాన్ అని సమాధానం ఇవ్వడంతో అదే సమాధానాన్ని చెప్పి 320000 గెలుచుకున్నారు.

  Answer: అఫ్ఘనిస్థాన్

  640000 రూపాయల కోసం ప్రశ్న

  640000 రూపాయల కోసం ప్రశ్న

  భారత స్వాతంత్య్రం పొందినప్పుడు బ్రిటీష్ వైస్రాయ్ ఉన్నది ఎవరు?
  a) లార్డ్ వేవెల్
  b) లార్డ్ మౌంట్ బాటెన్
  c) లార్డ్ ఎల్గిన్
  d) లార్డ్ రిప్పన్

  Answer: లార్డ్ మౌంట్ బాటెన్

  Samantha : NTR కోసం మొదటిసారి సమంత అలా Naga Chaitanya ఎక్కడా తగ్గట్లేదుగా | RRR || Filmibeat Telugu
  1250000 రూపాయల కోసం ప్రశ్న

  1250000 రూపాయల కోసం ప్రశ్న

  ఒకే పారాఒలింపిక్స్‌లో బహుళ పతకాలు సాధించిన మొదటి భారత మహిళ ఎవరు?
  a) అవనీ లేఖరా
  b) దీపా మాలిక్
  c) అంజలీ భగవత్
  d) భవీనా పటేల్

  Answer: అవనీ లేఖరా

  ఎవరు మీలో కోటీశ్వరులు గేమ్ షోలో 1250000 గెలచుకొన్న రాజా రవీంద్ర రాబోయే ఎపిసోడ్‌లో కోటి రూపాయల ప్రశ్నకు సరైన సమాధానం చెప్పి చరిత్ర సృష్టించారు. ఈ గేమ్ షోలో కోటి రూపాయలు గెలుచుకొన్న తొలి వ్యక్తిగా హిస్టరీ క్రియేట్ చేశారు. మంగళవారం (16, నవంబర్‌న) ప్రసారమయ్యే షోలో మరో మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పి రాజా రవీంద్ర కోటీశ్వరుడు అయ్యారు.

  English summary
  NTR's Evaru Meelo Koteeswarulu Show November 15th Episode: Raja Ravindra of Sujatha Nagar is participant in the EMK Show. He has won 1 crore in the Show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X