NTR's EMK Show ఎన్టీఆర్ షోలో కోటి గెలిచిన పోలీస్ తరువాతి కంటెస్టెంట్ ఎంత గెలిచారో తెలుసా?
నందమూరి తారక రామారావు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు అరుదైన సన్నివేశం ఆవిష్కృతమైంది. ఈ సీజన్‌లో కోటి రూపాయలు గెలుచుకొన్న తొలి కంటెస్టెంట్‌గా రాజా రవీంద్ర అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నారు. ఆయన గెలుచుకుని వెళ్ళిపోయినా తరువాత ఆట మళ్ళీ మొదలైంది. మరి ఈరోజు ఎపిసోడ్ లో ఏం విశేషాలు జరిగాయనేది చూద్దాం.

ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్న
భారత జాతీయ గీతంలోని ఈ పదాలను అవి కనిపించే క్రమంలో అమర్చండి
A : మరాఠ
B: ఉత్కళ
C: ద్రావిడ
D: బంగా
answer : a,c,b,d
అందరికంటే వేగంగా, కరెక్ట్ గా సమాధానం ఇచ్చింది చంద్రశేఖర్. ఆయన హాట్ సీట్ కు వెళ్ళే అవకాశం దక్కింది. వరంగల్ జిల్లాకు చెందిన చంద్రశేఖర్ ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో డిప్యూటీ ఎమ్మార్వోగా పనిచేస్తున్నారు.

1000 రూపాయల ప్రశ్న
ఈ తెలుగు సామెతను పూరించండి: మూర్తి కొంచమైనా__ విస్తారము
A: బస్తీ
B: ఆస్తి
C: కుస్తీ
D: కీర్తి
అయితే చంద్రశేఖర్ గారికి ఈ సమాధానం తెలియకపోవడంతో లైఫ్ లైన్ లో ఒకటి అయిన ఆడియన్స్ పోల్ అనే ఆప్షన్ ఎంచుకున్నారు.. ఈ క్రమంలో ఎక్కువ మంది D: కీర్తి అనే ఆప్షన్ ని ఎంచుకున్నారు.. చంద్రశేఖర్ కూడా ఆడియన్స్ ఇచ్చిన సమాధానాన్ని నమ్ముతూ D: కీర్తి అనే ఆప్షన్ ని ఫిక్స్ చేశారు. అదే నిజం అయింది.

2000 రూపాయల ప్రశ్న
సమయపాలనలోని 'IST'లో, 'S' దేనికి సంకేతం?
A: స్టాండర్డ్
B: స్టాట్యూటరీ
C: సెకండ్
D:స్లో
Answer : A: స్టాండర్డ్

3000 రూపాయల ప్రశ్న
ఈ పాటలో కనిపించిన నటిని గుర్తించండి
A: రకుల్ ప్రీత్ సింగ్
B : రెజీనా
C: సదా
D: దీక్షా సేథ్
Answer : C: సదా

5000 రూపాయల ప్రశ్న
హిందూ పురాణంలో, వీరిలో పాండవులలో ఒకరి కుమారుడు ఎవరు?
A : అభిమన్యుడు
B: లవుడు
C: కుశుడు
D: అంగదుడు
Answer : C: సదా

10000 రూపాయల ప్రశ్న
ఈ చిత్రంలోని కట్టడాన్ని గుర్తించండి అంటూ కుతుబ్ మినార్ ఫోటో ప్రదర్శించారు.
A: ఆగ్రా కోట
B: బీబీ కా మక్బారా
C: కుతుబ్ మినార్
D: బులంద్ దర్వాజా
Answer : C: కుతుబ్ మినార్

20000 రూపాయల ప్రశ్న
2019 ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన జట్టు ఏది?
A: న్యూజిలాండ్
B: ఇంగ్లాండ్
C: ఇండియా
D: దక్షిణాఫ్రికా
అయితే చంద్రశేఖర్ గారికి ఈ సమాధానం తెలియకపోవడంతో లైఫ్ లైన్ లో ఒకటి అయిన 50-50 ఆప్షన్ ఎంచుకున్నారు.. ఈ క్రమంలో ఏ,సి ఆప్షన్స్ రిమూవ్ చేసి బీ, డీ ఆప్షన్స్ ఉంచారు. చివరికి ఆయన బీ. ఇంగ్లాండ్ ఆప్షన్ ఎంచుకోగా అదే కరెక్ట్ అయింది.

400000 రూపాయల ప్రశ్న
తెలుగు నవల 'అంపశయ్య' రచయిత ఎవరు?
A: నవీన్
B: గోగు శ్యామల
C: శ్రీరాజ్ గిన్నె
D: అడవి బాపిరాజు
అయితే చంద్రశేఖర్ గారికి ఈ సమాధానం తెలియకపోవడంతో లైఫ్ లైన్ లో చివరిది అయినా వీడియో కాల్ ఎ ఫ్రెండ్ ఆప్షన్ ఎంచుకున్నారు.. ఈ క్రమంలో ఆయన భాస్కర్ అనే తన స్నేహితుడికి కాల్ చేశారు. ఆయన నవీన్ అని సమాధానం ఇచ్చారు. దానినే చంద్రశేఖర్ చెప్పగా అది కరెక్ట్ సమాధానం అయింది.

800000 రూపాయల ప్రశ్న
సెప్టెంబర్ 2021లో ఆంధ్ర ప్రదేశ్ న్ని తాకిన తుఫాను పేరేమిటి?
A: మేఘ
B: గులాబ్
C: హుద్ హుద్
D: వాయు
Answer : B: గులాబ్

160000 రూపాయల ప్రశ్న
కంబాలకొండ రిజర్వ్ ఫారెస్ట్ మధ్యలో ఉన్న ఇందిరా గాంధీ జూలాజికల్ వీటిలో ఏ ప్రదేశంలో ఉంది?
A: విశాఖపట్నం
B: విజయవాడ
C: హైదరాబాద్
D: అనంతపురం
Answer : A: విశాఖపట్నం

320000 రూపాయల ప్రశ్న
వీరిలో, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా మరియు భారత రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి ఎవరు?
A: ఆర్ వెంకటరామన్
B: ఏపిజె అబ్దుల్ కలాం
C: కె ఆర్ నారాయణన్
D: శంకర్ దయాళ్ శర్మ
Answer : D: శంకర్ దయాళ్ శర్మ

6,40,000 రూపాయల ప్రశ్న
వీరిలో, ఏ వ్యక్తి పేరు మీదుగా ఒక రసాయన మూలకానికి పేరు పెట్టలేదు?
A: ఐజాక్ న్యూటన్
B: ఆల్బర్ట్ ఐన్ స్టీన్
C: నికోలస్ కోపర్నికస్
D: అల్ఫ్రెడ్ నోబెల్
Answer : A: ఐజాక్ న్యూటన్ కాగా చంద్రశేఖర్ C: నికోలస్ కోపర్నికస్ అనే పేరు చెప్పడంతో 320000 రూపాయలతో వెనుతిరిగారు.
Recommended Video

ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్న
ఈ రంగులను లేత నుండి ముదురు రంగులకి అమర్చండి.
A: పసుపు
B: నలుపు
C: తెలుపు
D: వంకాయ రంగు
Answer : C, A, D, B
అందరికంటే ముందుగా పద్మావతి అనే కంటెస్టెంట్ వేగంగా పెట్టడంతో ఆమె హాట్ సీట్ మీదకు వెళ్లి కూర్చోగానే బజర్ మోగింది. దీంతో నేటి ఆటకు ముగింపు పలికారు.


Click it and Unblock the Notifications











