twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    NTR's EMK Show 40,000 రూపాయల ప్రశ్నకే వెనుతిరిగిన కంటెస్టెంట్.. మీరు చెప్పగలరా?

    |

    ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షో ఆసక్తికరంగా సాగుతోంది. నవంబర్ 22వ తేదీ ఎపిసోడ్ లో చివరిగా యసస్విని అనే కంటెస్టెంట్ ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ రౌండ్ లో అందరి కంటే ఎక్కువ సమాధానాలు చెప్పి హాట్ సీట్ చేరుకున్నారు. అయితే నిన్న ఎపిసోడ్ ముగిసే సమయానికి ఆమె నాలుగు ప్రశ్నలకు సమాధానాలు చెప్పి పదివేల రూపాయల ప్రశ్నకి చేరుకున్నారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు గాను ఆమె రెండు లైఫ్ లైన్ లు ఉపయోగించుకున్నారు.. ఇంకా మీకు 50-50 లైఫ్ లైన్ ఒక్కటే మిగిలివుంది. ఇక రోజు ఎపిసోడ్ లో ఏం జరిగింది పరిశీలిద్దాం.

    20000 రూపాయల ప్రశ్న

    20000 రూపాయల ప్రశ్న

    భారత మహిళల క్రికెట్ జట్టు తమ మొదటి డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్ ఏ దేశంతో ఆడారు?

    a) ఇంగ్లాండ్
    b) పాకిస్థాన్
    c) ఆస్ట్రేలియా
    d)శ్రీలంక


    అయితే ఈ ప్రశ్నకు సమాధానం తెలియక పోవడంతో యశస్విని మిగిలి ఉన్న 50 లైఫ్ లైన్ కూడా తీసుకుంటా అని చెప్పింది.

    దీంతో ఆ లైఫ్ లైన్ ఆక్టివేట్ చేయడంతో ఏబీ ఆప్షన్స్ తొలగించారు. ఆమె సీ ఆప్షన్ ఎంచుకోగా అదే కరెక్ట్ అయింది.

    40000 రూపాయల ప్రశ్న

    40000 రూపాయల ప్రశ్న

    ఈ కింది ఋషులలో అరుంధతి ఎవరి భార్య?

    a)విశ్వామిత్రుడు
    b) దదేచి
    c) కశ్యపుడు
    d) వశిష్టుడు


    అయితే ఈ ప్రశ్నకు ఆమెకు సమాధానం తెలియక పోవడం రిక్వెస్ట్ చేస్తున్నాను అని ప్రకటించింది.. ఇక ఏదో ఒక సమాధానాన్ని ఎంచుకోమని ఎన్టీఆర్ కోరగా ఆమె నాలుగో ఆప్షన్ ఎంచుకుంది. అది కరెక్ట్ అయింది కానీ ఆమె అప్పటికే క్విట్ చేయడంతో 20 వేలతో వెనుతిగింది.

     ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్న

    ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్న

    ఈ క్రీడలను వాటి ఆట స్థలం పరిణామం ఆధారంగా తక్కువ నుంచి ఎక్కువకి అమర్చండి

    a) క్యారంస్
    b) టెన్నిస్
    c) ఫుట్ బాల్
    d) బిలియర్డ్స్

    కరెక్ట్ సమాధానం : ఏ, డీ, బీ, సీ

    దీనికి నలుగురు కరెక్ట్ సమాధానాలు చెప్పారు. నలుగురిలో రాజేష్ అనే వ్యక్తి ముందుగా ఆన్సర్ కరెక్ట్ గా చెప్పడంతో ఆయనకు హాట్ స్వీట్ మీదకు వెళ్లే అవకాశం దక్కింది. గుంటూరుకు చెందిన రాజేష్ సీఏ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్నారు. ఎవరు మీలో కోటీశ్వరుడు షోలో ఇది నా ప్రైజ్ మనీ గెలిస్తే తన భార్యను వెకేషన్ కి తీసుకువెళ్లాలి అనే కోరిక వ్యక్తం చేశారు.

     1000 రూపాయల ప్రశ్న

    1000 రూపాయల ప్రశ్న

    వీటిలో ఏ జంతువు వీపు మీద ఎక్కి పోలో ఆడతారు?

    a) గుర్రం
    b) కంచర గాడిద
    c) జింక
    d) జిరాఫీ

    answer: a

    2000 రూపాయల ప్రశ్న

    2000 రూపాయల ప్రశ్న

    మందార పువ్వు ఫోటో చూపి దానిని గుర్తు పట్టమని కోరారు.

    a) రోజా పువ్వు
    b) మందార పువ్వు
    c) చామంతి పువ్వు
    d) బంతి పువ్వు


    answer : b

     3000 రూపాయల ప్రశ్న

    3000 రూపాయల ప్రశ్న

    శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, శ్రీ వేంకటేశ్వర యూనివ్సిటీ ఎక్కడ ఉన్నాయి?

    a) కర్నూలు
    b) తిరుపతి
    c) కుప్పం
    d) విజయవాడ


    answer : b

    5000 రూపాయల ప్రశ్న

    5000 రూపాయల ప్రశ్న

    1957లోని మాయాబజార్ చిత్రంలోని వివాహ భోజనమును పాటలో వీటిలో ఏ తీపి పదార్ధాన్ని ప్రస్తావించలేదు.


    a) లడ్డు
    b) జిలేబీ
    c) పాయసం
    d) రసగుల్లా

    answer : d

    10000 రూపాయల ప్రశ్న

    10000 రూపాయల ప్రశ్న

    మహాభారతం ప్రకారం వీరిలో ముందు పుట్టిన వారు ఎవరు?

    a) యుధిష్ఠిరుడు
    b) కర్ణుడు
    c) నకులుడు
    d) సహదేవుడు

    answer : కర్ణుడు

    20000 రూపాయల ప్రశ్న

    20000 రూపాయల ప్రశ్న

    ఈ తెలంగాణ జిల్లాలో ఏ జిల్లా ఆంధ్ర ప్రదేశ్ తో బోర్డర్ కలిగి లేదు

    a) నారాయణ పేట
    b) నాగర్ కర్నూల్
    c) నల్గొండ
    d) సూర్యాపేట

    answer : నారాయణ పేట

    40000 రూపాయల ప్రశ్న

    40000 రూపాయల ప్రశ్న


    వీటిలో నీటి అడుగున ఊపిరి తీసుకోలేని జంతువు ఏది?

    a) షార్క్
    b) పీత
    c) డాల్ఫిన్
    d) స్క్విడ్


    answer : డాల్ఫిన్

    80000 రూపాయల ప్రశ్న

    80000 రూపాయల ప్రశ్న

    "దోసానమిక్స్' అనే భావన ఈ ఆర్థికవేత్తలలో ఎవరికి ఆపాదించబడింది?

    A: అమర్త్య సేన్
    B: రఘురాం రాజన్
    C: ఉర్జిత్ పటేల్
    D: శక్తికాంత దాస్

    ఈ ప్రశ్నకు సమాధానం తెలియక పోవడంతో ఆయన వీడియో కాల్ ఎ ఫ్రెండ్ ఆప్షన్ ఎంచుకుని చిరంజీవి అనే స్నేహితునికి కాల్ చేశారు. ఆయన ఏ, బీ అని రెండు ఆప్షన్స్ చెప్పారు. రాజేష్ ఏ ఆప్షన్ ను ఎంచుకున్నారు. కానీ అది తప్పు సమాధానం కావడంతో రాజేష్ వెను తిరగాల్సి వచ్చింది. ఆయన కేవలం 10 వేలు గెలుచుకున్నారు.


    Answer: రఘురాం రాజన్

    ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్న

    ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్న

    ఒక క్యాలెండర్ సంవత్సరంలో వీరి జన్మదినాల ఆధారంగా ఈ నాయకులను కాలక్రమంలో అమర్చండి
    A: ఎం కె గాంధీ
    B: సర్వేపల్లి రాధాకృష్ణ
    C: జవహర్లాల్ నెహ్రూ
    D: బి ఆర్ అంబేద్కర్

    Answer : D,B,A,C


    అందరికంటే ముందుగా సమాధానం చెప్పి అనంతపురంకు చెందిన డాక్టర్ కృష్ణ హర్ష హాట్ సీట్ లోకి వచ్చారు. డాక్టర్ అయిన ఆయన ఎన్టీఆర్ కు ఫ్యాన్ కూడా..డబ్బు గెలిచి ఎవరికైనా సాయం చేయాలని ఆయన కోరిక అని వెల్లడించారు.

    1000 రూపాయల ప్రశ్న

    1000 రూపాయల ప్రశ్న

    వీటిలో, 'వివాహం' మరియు 'శుభము' అనే అర్థాలు కలిగిన పదం ఏది?

    A కళ్యాణం
    B: దక్షిణ
    c.సర్వ
    D: విఘ్నం

    answer : a

    2000 రూపాయల ప్రశ్న

    2000 రూపాయల ప్రశ్న

    వీటిలో, సాధారణంగా తెగలను పంచడానికి, కత్తిరించడానికి దేనిని వాడుతారు?

    a) స్క్రూ డ్రైవర్
    b) డ్రిల్
    c) స్పాన్సర్
    d) ప్లయర్స్

    answer : d

    3000 రూపాయల ప్రశ్న

    3000 రూపాయల ప్రశ్న


    ఏ పవిత్రగ్రంథంలో భగవద్గీత కనిపిస్తుంది?

    A: ఉపనిషత్తులు
    B : మహాభారతం
    C: జాతక కథలు
    D: రామాయణం


    answer : B

    5000 రూపాయల ప్రశ్న

    5000 రూపాయల ప్రశ్న


    కంగారు ఫోటో డిస్ప్లే చేసి ఈ చిత్రంలోని ప్రాణిని గుర్తించండని కోరారు.

    A: కంగారూ
    B: జిరాఫీ
    C: జీబ్రా
    D: గాడిద


    answer : a

    Recommended Video

    RRR ట్రైలర్‌ విడుదల ఆ రోజే..? || Filmibeat Telugu
    10000 రూపాయల ప్రశ్న

    10000 రూపాయల ప్రశ్న

    ఒలింపిక్ ఈవెంట్లలో, వీటిలో దేనిని విసరరు?

    A. హ్యామర్
    B. డిస్కస్
    C. పోల్
    D: జావెలిన్


    హర్ష హ్యామర్ అని సమాధానం చెప్పగా అది తప్పయింది..కరెక్ట్ సమాధానం పోల్ కావడంతో 10000 కూడా గెలవకుండానే డాక్టర్ గారు వెనుతిరిగారు. ఇక్కడితో నవంబర్ 23 ఎపిసోడ్ ముగిసింది.

    answer : a

    English summary
    Ntr's EMK show : on November 23rd rajesh from guntur played the game.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X