twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    NTR's EMK November 4th Episode: కోతి చేష్టలతో ఎన్టీఆర్‌ను ఆటపట్టించిన తమన్, దేవీ, ఈ ప్రశ్నలకు జవాబు చెప్పగలరా?

    |

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోకు ప్రత్యేక ఆహ్వానితులుగా సంగీత దర్శకులు దేవీ శ్రీ ప్రసాద్, ఎస్ఎస్ థమన్ వచ్చారు. దీపావళీ ప్రత్యేక ఎపిసోడ్‌లో వీరిద్దరి అల్లరి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరికి తోడు ఎన్టీఆర్ కూడా జత కలవడంతో ఎపిసోడ్ చాలా రసవత్తరంగా, వినోదంగా సాగింది. ఎన్టీఆర్‌తో అనేక విషయాలు పంచుకొంటూ పంచులు వేశారు. తమన్, దేవీని కోతులు అంటూ ఎన్టీఆర్ ఆటపట్టిస్తూ సరదాగా గేమ్‌ను కొనసాగించారు. వీడియోకాల్ ఆప్షన్ ఉపయోగించుకోవడంతో ఓ విశిష్ట వ్యక్తి అందుబాటులోకి వచ్చారు. వీడియోకాల్ ద్వారా తమన్, దేవీకి సమాధానం చెప్పినది ఎవరు? తమన్, దేవీ శ్రీ ప్రసాద్ ఏ ప్రశ్నలకు తడబాటు పడ్డారు? ఎలాంటి ప్రశ్నలకు సమాధానం జోష్‌తో చెప్పారు? వారు ఎంత గెలుచుకొన్నారనే విషయంలోకి వెళితే..

    1000 రూపాయల కోసం ప్రశ్న

    1000 రూపాయల కోసం ప్రశ్న

    వీటిలో, 21 గేమ్ పాయింట్లకు ఆడే క్రీడ ఏది?
    a) రగ్బీ
    b) కబడ్డీ
    c) బాడ్మింటన్
    d) బేస్‌బాల్

    Answer: బాడ్మింటన్

    2000 రూపాయల కోసం ప్రశ్న

    2000 రూపాయల కోసం ప్రశ్న


    ఆడియోలో వినిపించే సంగీత వాయిద్యం ఏది?
    a) పియానో
    b) చల్లో
    c) వయోలిన్
    d) మాండలిన్
    Answer: మాండలిన్

    3000 రూపాయల కోసం ప్రశ్న

    3000 రూపాయల కోసం ప్రశ్న

    బైట్ డ్యాన్స్‌ సొంతమైన ఏ యాప్ చైనాలో డూయిన్‌గా ప్రసిద్ది?
    a) వీ ఛాట్
    b) టిక్ టాక్
    c) అలీబాబా
    d) స్నాప్ చాట్

    Answer: టిక్ టాక్

    5000 రూపాయల కోసం ప్రశ్న

    5000 రూపాయల కోసం ప్రశ్న

    ఈ చిత్రంలోని నిర్మాణం ఏ ప్రదేశంలో ఉన్నదో గుర్తించండి
    a) ముంబై
    b) బెంగళూరు
    c) కోల్‌కతా
    d) కన్యాకుమారి

    Answer: ముంబై

    10000 రూపాయల కోసం ప్రశ్న

    10000 రూపాయల కోసం ప్రశ్న


    సాధారణంగా, తేనెపట్టులోని ఒక సెల్ వీటిలో దేనీ ఆకారాన్ని పోలీ ఉంటుంది?
    a) త్రిభుజం
    b) షడ్బుజం
    c) వృత్తం
    d) చతురస్రం

    Answer: షడ్బుజం

    20000 రూపాయల కోసం ప్రశ్న

    20000 రూపాయల కోసం ప్రశ్న

    అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి చితరం దేవదాసు, మొదటగా ఏ భాషలో రాసిన పుస్తకం నుంచి తీసుకోబడింది?
    a) మరాఠీ
    b) ఒడియా
    c) బెంగాలీ
    d) ఉర్దూ

    Answer: బెంగాలీ

    40000 రూపాయల కోసం ప్రశ్న

    40000 రూపాయల కోసం ప్రశ్న


    13వ శతాబ్దంలో నిర్మించబడిన పాకాల చెరువును వీటిలో, ఏ ప్రదేశంలో చూడవచ్చు?
    a) హైదరాబాద్
    b) వరంగల్
    c) మెదక్
    d) రంగారెడ్డి

    పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో తొలి లైఫ్‌లైన్‌ను ఉపయోగించుకొన్నారు. ఆడియెన్స్ పోల్ ఉపయోగించుకోవడంతో వారు వరంగల్ అని 49 శాతం మంది సమాధానం చెప్పారు. తమన్, దేవీ శ్రీ ప్రసాద్ అదే సమాధానాన్ని చెప్పి గేమ్‌లో ముందుకు పోయారు.
    Answer: వరంగల్

    80000 రూపాయల కోసం ప్రశ్న

    80000 రూపాయల కోసం ప్రశ్న

    సంస్కృతంలో పెదవులు లేకుండా అనే అర్ధం ఉన్న రాగ నిరోష్టలో ఏ రెండు స్వరాలు ఉండవు?
    a) ష, రి
    b) గ, ద
    c) రి, ని
    d) మ, ప

    Answer: మ, ప


    160000 రూపాయల కోసం ప్రశ్న

     160000 రూపాయల కోసం ప్రశ్న

    160000 రూపాయల కోసం ప్రశ్న

    విజయవంతంగా క్లోన్ చేయబడిన ఏ మొదటి క్షీరదానికి డాలీ పేరు ఇవ్వబడింది?
    a) ఆవు
    b) గొర్రె
    c) బర్రె
    d) కుందేలు

    పై ప్రశ్నకు జవాబు తెలియకపోవడంతో రెండో లైఫ్‌లైన్‌ను ఉపయోగించుకొన్నారు. 50:50 ఆప్షన్ ఉపయోగించుకోవడంతో స్క్రీన్ పై గొర్రె, బర్రె ఆప్షన్లు మిగిలాయి. దాంతో గొర్రె అని సమాధానం చెప్పారు. దాంతో వాళ్లు 160000 రూపాయలు గెలుచుకొన్నారు.

    Answer: గొర్రె

    320000 రూపాయల కోసం ప్రశ్న

    320000 రూపాయల కోసం ప్రశ్న


    ఈ సంగీత వాయిద్యాలలో ఒక వ్యక్తి పేరు పెట్టబడింది ఏది?
    a) సాక్సోఫోన్
    b) ట్రోంబోన్
    c) డిడ్జెరిడో
    d) ఒబో

    Answer: సాక్సోఫోన్

    640000 రూపాయల కోసం ప్రశ్న

    640000 రూపాయల కోసం ప్రశ్న


    ఈ నటులలో, చెన్నైలో జన్మించిన వారు ఎవరు?
    a) అనిల్ కపూర్
    b) రజనీకాంత్
    c) అజిత్ కుమార్
    d) మహేశ్ బాబు

    Answer: మహేశ్ బాబు

    1250000 రూపాయల కోసం ప్రశ్న

    1250000 రూపాయల కోసం ప్రశ్న


    ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రదర్శన చేసిన మొదటి భారతీయ సంగీత కారులు ఎవరు?
    a) కిషోరీ అమోంకర్
    b) ఏఆర్ రెహమాన్
    c) ఎంఎస్ సుబ్బలక్ష్మి
    d) జాకీర్ హుసేన్

    Answer: ఎంఎస్ సుబ్బలక్ష్మి

    పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో వీడియో కాల్ ఆప్షన్‌ను ఉపయోగించుకొన్నారు. అయితే అందులో ఎన్టీఆర్ పేరు ఉండటంతో హోస్ట్ ఎన్టీఆర్‌కు కాల్ చేయమని తమన్, దేవీ శ్రీ ప్రసాద్ అడిగారు. ఎన్టీఆర్‌కు కాల్ చేయగా, స్విచ్ఛాఫ్ అని వచ్చింది. దాంతో మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మకు కాల్ చేయగా.. ఆయన ఎంఎస్ సుబ్బలక్ష్మి అని సమాధానం చెప్పారు. దాంతో వారు 1250000 గెలుచుకొన్నారు.

    Recommended Video

    Samantha : NTR కోసం మొదటిసారి సమంత అలా Naga Chaitanya ఎక్కడా తగ్గట్లేదుగా | RRR || Filmibeat Telugu
    2500000 రూపాయల కోసం ప్రశ్న

    2500000 రూపాయల కోసం ప్రశ్న


    వీరిలో, ఏ నటుడు ఉత్తమ నేపథ్య గానానికి గాను జాతీయ చలనచిత్ర పురస్కారం పొందారు?
    a) ఎంజీ రామచంద్రన్
    b) కిషోర్ కుమార్
    c) అమితాబ్ బచ్చన్
    d) రాజ్‌కుమార్

    Answer: రాజ్‌కుమార్

    పై పాటను కన్నడ కంఠీరవ, పునీత్ రాజ్‌కుమార్ తండ్రి రాజ్ కుమార్ ఈ పాటను పాడారు. ఆయనకు జాతీయ ఉత్తమ నేపథ్య గాయకుడి అవార్డు లభించింది. అయితే 50 లక్షల ప్రశ్న కోసం వెళ్తుండగా, శంఖం మోగింది. దాంతో గురువారం ఆట ఆగింది. దాంతో సెలబ్రిటీ ఎపిసోడ్ ముగిసింది.

    English summary
    NTR's Evaru Meelo Koteeswarulu Show November 4th Episode: Music Director Devi Sri Prasad and SS Thaman come as special guests for NTR's Evaru Meelo Koteeswarulu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X