twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ANR ఎలా హీరో అయ్యాడు? అజిత్ తెలంగాణలో ఎక్కడ పుట్టాడో తెలుసా? తమన్, దేవీకి ఎన్టీఆర్ షాకింగ్ విషయాలు

    |

    ఎన్టీఆర్‌తో ఉన్న అనుబంధాన్ని గురించి తమన్ చెబుతూ.. నా మొదటి సినిమా రిలీజ్ కాకముందే... నాకు బృందావనం సినిమాను ఇచ్చారు. అది నాపై ఉన్న పెద్ద నమ్మకానికి అది సాక్ష్యం. ఆ సినిమా నాకు మంచి లైఫ్ ఇచ్చింది. అందుకు నేను ఎప్పుడూ సంతోషపడుతుంటాను. అలాగే అలవైకుంఠపురంలో సినిమా రిలీజ్ తర్వాత ఫస్ట్ కాల్ నాకు ఎన్టీఆర్ చేశాడు. సాధారణంగా సినిమా రిలీజ్ తర్వాత డిస్టిబ్యూటర్లు కాల్ చేస్తారు.. కానీ ఎన్టీఆర్ చేసి అభినందించడం మరిచిపోలేనటు అనుభూతి అని తమన్ చెప్పారు.

     దేవీ శ్రీ ప్రసాద్‌తో అనుబంధం ఇలా

    దేవీ శ్రీ ప్రసాద్‌తో అనుబంధం ఇలా

    ఇక దేవీ శ్రీ ప్రసాద్‌తో అనుబంధం గురించి ఎన్టీఆర్ చెబుతూ.. చాలా కాలం క్రితం నేను హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్తుంటే.. అదే విమానంలో దేవీ శ్రీ ప్రయాణిస్తున్నాడు. నన్ను చూసి వచ్చి.. నేను దేవీ శ్రీ ప్రసాద్ అంటూ పరిచయం చేసుకొంటే.. నీవు నాకు తెలియకపోవడం ఏమిటని అన్నాను. అలా నాకు బాగా దగ్గరైన వ్యక్తి దేవీ అంటూ ఎన్టీఆర్ అన్నారు. అయితే తమ మధ్య జరిగిన ఓ సంఘటనను ఎన్టీఆర్‌కు దేవీ చెబుతూ.. ఓ రోజు నాకు ఫోన్ చేసి ఎన్టీఆర్ అని అన్నాడు.. అయితే ఎవరో ప్రాంక్ చేస్తున్నాడనుకొని నా పక్కనే ఉన్న మరో వ్యక్తికి ఫోన్ ఇస్తే.. మీరా అంటూ ఆయన ఎన్టీఆర్ చెప్పగానే షాక్ అయ్యాను అంటూ దేవీ శ్రీ ప్రసాద్ చెప్పుకోచ్చారు.

    మాండలిన్ శ్రీనివాస్ గురువుగా అంటూ

    మాండలిన్ శ్రీనివాస్ గురువుగా అంటూ

    మాండలిన్ గురించి వచ్చిన ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాత.. దేవీ శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. నేను మాండలిన్ శ్రీనివాస్ వద్ద మాండలిన్ వాయిద్యాన్ని నేర్చుకొన్నాను. జీవితంలో గురువు లభించడమే కష్టం. అలాంటిది నాకు శ్రీనివాస్ లాంటి గురువు లభించడం నా జీవితం ధన్యం అని దేవీ అన్నారు. అయితే మాండలిన్ నేర్చుకొన్న తర్వాత నీవు జీవితంలోని పరమార్థాన్ని వెతుకొన్నావనే ఫీలింగ్ నాకు కలిగింది అంటూ ఎన్టీఆర్ చెప్పుకొంటూ వచ్చారు. తమన్ నాకు డ్రమ్ ఇష్టమైన వాయిద్యమని చెప్పారు.

    మాండలిన్ శ్రీనివాస్ గురువుగా అంటూ

    మాండలిన్ శ్రీనివాస్ గురువుగా అంటూ

    మాండలిన్ గురించి వచ్చిన ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాత.. దేవీ శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. నేను మాండలిన్ శ్రీనివాస్ వద్ద మాండలిన్ వాయిద్యాన్ని నేర్చుకొన్నాను. జీవితంలో గురువు లభించడమే కష్టం. అలాంటిది నాకు శ్రీనివాస్ లాంటి గురువు లభించడం నా జీవితం ధన్యం అని దేవీ అన్నారు. అయితే మాండలిన్ నేర్చుకొన్న తర్వాత నీవు జీవితంలోని పరమార్థాన్ని వెతుకొన్నావనే ఫీలింగ్ నాకు కలిగింది అంటూ ఎన్టీఆర్ చెప్పుకొంటూ వచ్చారు. తమన్ నాకు డ్రమ్ ఇష్టమైన వాయిద్యమని చెప్పారు.

    దేవదాసు సినిమాకు ఏ పుస్తకం ఆధారంగా

    దేవదాసు సినిమాకు ఏ పుస్తకం ఆధారంగా

    అక్కినేని నాగేశ్వరరావు జంటగా నటించిన దేవదాసు సినిమా ఏ పుస్తకం ఆధారంగా రూపొందింది అనే ప్రశ్నకు బెంగాలీ అని సమాధానం చెప్పారు. అయితే దానిని ఎవరు రాశారని అడిగితే మాకు తెలియదని చెప్పారు. దాంతో దేవదాసు పుస్తకం రాసింది.. 1917లో శరత్ చంద్ర చటర్జీ రాశారు అని ఎన్టీఆర్ వివరించారు. అయితే తమన్‌కు, అక్కినేని నాగేశ్వరరావుకు ఓ అవినాభవ సంబంధం ఉంది. అక్కినేని నటించిన తొలి సినిమా బాలరాజు సినిమాను తమన్ తాతగారు ఘంటసాల గారు నిర్మించారు. స్వర్గీయ అక్కినేనికి ఆ సినిమా తొలి చిత్రం అని ఎన్టీఆర్ చెప్పారు.

    స్వర్గీయ అక్కినేని ఎలా హీరో అయ్యారంటే..

    స్వర్గీయ అక్కినేని ఎలా హీరో అయ్యారంటే..

    అలాగే అక్కినేని నాగేశ్వరరావు ఎలా హీరో అయ్యారో తెలుసా అంటూ ఎన్టీఆర్ చెబుతూ.. ఒకరోజు ట్రైన్‌లో ఘంటసాల గారు చెన్నై వెళ్తున్నారు. ట్రైన్ గుడివాడలో ఆగింది. ఆ స్టేషన్‌లో నిలుచున్న ఓ వ్యక్తిని చూస్తూనే ఉండిపోయారు. ఆ వ్యక్తిని చూస్తు కనురెప్ప కూడా కొట్టలేదంట.. అలా అంత అందంగా ఉన్నారట. ఆ తర్వాత ఆ స్టేషన్ నుంచి ట్రైన్ చెన్నైకి వెళ్లిపోయింది. కొద్ది రోజులకు మీరు మా సినిమాలో హీరోగా నటిస్తున్నారనే కబురు ఆ వ్యక్తికి అందింది. ఆ వ్యక్తే అక్కినేని నాగేశ్వరరావు. ఆ సినిమా బాలరాజు. ట్రైన్‌లో ఆ వ్యక్తిని చూసి ఘంటసాల గారు అని ఎన్టీఆర్ చెప్పారు. దాంతో ప్రతిభ బ్యానర్‌పై ఆ సినిమా తీశారు. అలాగే ఎన్టీఆర్‌తో రేచుక్క కూడా తీశారు అని తమన్ చెప్పారు.

     గొర్రెకు సింగర్ పేరు అంటూ

    గొర్రెకు సింగర్ పేరు అంటూ

    ఇక విజయవంతంగా క్లోన్ చేయబడిన ఏ మొదటి క్షీరదానికి డాలీ అని నామకరణం చేశారనే ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో లైఫ్‌లైన్ ఉపయోగించుకొని గొర్రె అని సమాధానం చెప్పారు. అయితే గొర్రెకు పెట్టిన డాలీ పేరు ఓ సింగర్ పేరు. ఆ సింగర్ పేరు డాలీ పార్టన్ అని ఎన్టీఆర్ చెప్పారు. 1997లో క్లోనింగ్ పద్దతి ద్వారా డాలీని శాస్త్రవేత్తలు సృష్టించారు. అలాగే ఏ వాయిద్యానికి సంగీతకారుడి పేరు పెట్టారు అని ప్రశ్నకు సాక్సోఫోన్‌ అని సమాధానం చెప్పారు.

     మహేష్ బాబు, అజిత్ ఎక్కడ పుట్టారంటే..

    మహేష్ బాబు, అజిత్ ఎక్కడ పుట్టారంటే..

    ఈ నటులలో, చెన్నైలో జన్మించిన వారు ఎవరు అనే ప్రశ్నకు అనిల్ కపూర్, రజనీకాంత్, అజిత్ కుమార్, మహేష్ బాబు ఆప్షన్లు ఇచ్చారు. అయితే తమన్ మహేష్ బాబు అని సమాధానం లాక్ చేశారు. అయితే అనిల్ కపూర్ తన తొలి సినిమా వంశవృక్షం అనే చిత్రంలో నటించారు. దర్శకుడు బాపు వద్ద అసిస్టెంట్‌గా పనిచేశారు అని ఎన్టీఆర్ చెప్పగానే వారిద్దరూ షాక్ తిన్నారు. రజనీకాంత్ బెంగళూరులో పుట్టారు. అజిత్ కుమార్ ప్రస్తుతం తెలంగాణలోని సికింద్రాబాద్‌లో జన్మించారు అని క్లారిటీ ఇచ్చారు. అయితే చివరకు మహేష్ బాబు చెన్నైలో పుట్టారు... అనిల్ కపూర్ ముంబైలో జన్మించారు అని చెప్పారు.

    English summary
    NTR's Evaru Meelo Koteeswarulu Show November 4th Episode: Music Director Devi Sri Prasad and SS Thaman come as special guests for NTR's Evaru Meelo Koteeswarulu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X