NTR's EMK November 2nd Episode: ఎన్టీఆర్ షోలో తొలి ప్రశ్నకే కంటెస్టెంట్ అవుట్? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా నిర్వహిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోలో ఒకే రోజు ఇద్దరు డబ్బు తీసుకోకుండా గేమ్ నుంచి నిష్క్రమించారు. చంద్రశేఖర్, సాయిచంద్ 5 ప్రశ్నలకు సమాధానం చెప్పి గేమ్ నుంచి బయటకు వెళ్లారు. సాయిచంద్ తొలి ప్రశ్నకే ఇంటి నుంచి నిష్క్రమించారు. అయితే తాజా ఎపిసోడ్‌లో అడిగిన ప్రశ్నలకు సమాధానాలను మీరు చెప్పగలరా?

3000 రూపాయల కోసం ప్రశ్న

3000 రూపాయల కోసం ప్రశ్న

ఈ చిత్రంలో కనిపించే వస్త్రాలు ఏ నృత్యరూపానికి సంబంధించినవో గుర్తించండి
a) కూచిపూడి
b) భరత నాట్యం
c) కథాకళి
d) మణిపూరి

Answer: కథాకళి

 5000 రూపాయల కోసం ప్రశ్న

5000 రూపాయల కోసం ప్రశ్న

విలువైన రత్నాల బరువుని కొలిచే ప్రమాణం క్యారెట్స్‌లో ఒక క్యారెట్ అంటే ఎన్ని గ్రాములు
a) 0.2
b) 2
c) 200
d) 0.5

పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో లైఫ్‌లైన్ ఉపయోగించుకొన్నారు. వీడియో కాల్ ఆప్షన్ ఉపయోగించుకొన్న తర్వాత తన స్నేహితుడు సమాధానం తెలియదని చెప్పడంతో మరో లైఫ్‌లైన్ ఉపయోగించుకొన్నారు. 50:50 లైఫ్‌లైన్ ఉపయోగించుకోవడంతో స్క్రీన్ మీద 0.2, 2 గ్రాములు అనే సమధానాలు మిగిలాయి. దాంతో 2 గ్రాములు అని సమాధానం చెప్పారు. జవాబు తప్పుకావడంతో గేమ్ నుంచి నిష్క్రమించి వెళ్లిపోయారు. అయితే ఐదు ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవడంతో కనీసం 10 వేలు గెలుచుకోకపోయారు. దాంతో ఏమీ గెలుచుకోకుండా ఇంటి నుంచి వెళ్లిపోయారు.

Answer: 0.2

ఈ పోలీస్ ర్యాంకులను, వాటి స్థాయి ఆధారంగా తక్కువ నుంచి ఎక్కువకు అమర్చండి

ఈ పోలీస్ ర్యాంకులను, వాటి స్థాయి ఆధారంగా తక్కువ నుంచి ఎక్కువకు అమర్చండి

చంద్రశేఖర్ వెళ్లిపోయిన తర్వాత ఫాస్టెస్ ఫింగర్ ఫస్ట్‌ను ముందుకు తెచ్చారు.


A) డైరెక్టర్ జనరల్
B) ఇన్స్‌పెక్టర్
C) సూపరింటెండెంట్
D) కానిస్టేబుల్
Answer: D, B, C, A

పై ప్రశ్నకు చాలా వేగంగా సాయిచంద్ అనే కంటెస్టెంట్ సమాధానం చెప్పారు. దాంతో నిజమాబాద్‌లోని ఆలయంలో అర్చకుడిగా పనిచేసిన ఆయన హాట్ సీట్‌పైకి చేరారు.

1000 రూపాయల కోసం ప్రశ్న

1000 రూపాయల కోసం ప్రశ్న

ఒక తెలుగు నానుడి ప్రకారం మాటలకు ఏది లేదు?
a) పెద్దరికం
b) కనికరం
c) పేదరికం
d) మంచితనం

పై ప్రశ్నకు సమాధానం తెలియకోవడంతో ఆడియెన్స్ పోల్ ఆప్షన్‌ను ఉపయోగించుకొన్నారు. అయితే ఎక్కువ మంది పెద్దరికం అంటూ ఓటు వేశారు. అయితే కాన్ఫిడెన్స్‌గా ఉంటే లాక్ చేస్తాను చెబితే.. మరో లైఫ్‌లైన్ ఉపయోగించుకొన్నారు. 50:50 ఆప్షన్ ఉపయోగించుకోవడంతో స్క్రీన్ మీద పెద్దరికం, పేదరికం మిగిలాయి. దాంతో పెద్దరికం అనే జవాబు చెప్పారు. దాంతో ఆయన గేమ్ నుంచి నిష్క్రమించారు. తొలి ప్రశ్నకే సమాధానం చెప్పలేక సాయిచంద్ ఎలాంటి ప్రైజ్ మనీ తీసుకెళ్లకుండా వెళ్లిపోయారు.

Answer: పేదరికం


సాయిచంద్ నిష్రమించిన తర్వాత మరో ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్నను కంటెస్టెంట్ల ముందుకు తీసుకువచ్చారు.

అతిపెద్దదానితో మొదలుపెట్టి, వీటిని వాటి సాధారణ పరిమాణాల ఆధారంగా ఎక్కువ నుంచి తక్కువకు అమర్చండి

అతిపెద్దదానితో మొదలుపెట్టి, వీటిని వాటి సాధారణ పరిమాణాల ఆధారంగా ఎక్కువ నుంచి తక్కువకు అమర్చండి

A) కణజాలం
B) అంగము
C) కణము
D) జీవి
Answer: D, B, A, C

పై ప్రశ్నకు అతి వేగంగా జగన్నాథ శర్మ సమాధానం చెప్పారు. అమితాబ్ నుంచి నాగార్జున వరకు నేను కేబీసీకి రావాలని కోరుకొన్నాను. చివరికి మీతో కలిసి ఆడే అవకాశం, అదృష్టం లభించిందిన చెప్పారు. రిటైర్డ్ రైల్వే అధికారి.

రూ. 1000 కోసం ప్రశ్న

రూ. 1000 కోసం ప్రశ్న

కాఫీ పండించే పెద్ద ప్రాంతాన్ని, వీటిలో ఏమని పిలుస్తారు?
a) మైగ్రేట్
b) ప్రస్టేట్
c) ఎస్టేట్
d) నైట్రేట్

Answer: ఎస్టేట్

Recommended Video

Samantha : NTR కోసం మొదటిసారి సమంత అలా Naga Chaitanya ఎక్కడా తగ్గట్లేదుగా | RRR || Filmibeat Telugu
రూ. 2000 కోసం ప్రశ్న

రూ. 2000 కోసం ప్రశ్న

ఈ చిత్రంలోని కట్టడం ఏ నగరంలో ఉంది?
a) ప్యారిస్
b) లండన్
c) బెర్లిన్
d) రోమ్

Answer: ప్యారిస్

రూ. 3000 కోసం ప్రశ్న

రూ. 3000 కోసం ప్రశ్న

మీరు మైసూర్‌లో మైసూర్ పాక్‌ తింటే, మీరు ఏ రాష్ట్రంలో ఉన్నారు?
a) కేరళ
b) తమిళనాడు
c) కర్ణాటక
d) ఆంధ్రప్రదేశ్

Answer: కర్ణాటక

రూ. 5000 కోసం ప్రశ్న

రూ. 5000 కోసం ప్రశ్న

వీటిలో, 32 మరియు 55 ఇంచుల పరిమాణంలో ఏ గృహోపకరణాలు వస్తాయి?
a) టెలివిజన్
b) ఇస్త్రీ పెట్టె
c) మిక్సర్
d) మైక్రోవేవ్ ఓవెన్

Answer: టెలివిజన్

రూ. 10000 కోసం ప్రశ్న

రూ. 10000 కోసం ప్రశ్న

సాధారణంగా, వీటిలో ఎనిమిది చేతులు ఉన్న జీవి ఏది?
a) చీమ
b) సీతాకోకచిలుక
c) తేనేటిగ
d) ఆక్టోపస్

Answer: ఆక్టోపస్

రూ. 20000 కోసం ప్రశ్న

రూ. 20000 కోసం ప్రశ్న

మహాభారతం ప్రకారం, కుంతీదేవికి మరియు వీరిలో ఎవరికి కర్ణుడు జన్మించాడు?
a) ఇంద్రుడు
b) అగ్ని
c) సూర్యుడు
d) వాయువు

Answer: సూర్యుడు

రూ. 40000 కోసం ప్రశ్న

రూ. 40000 కోసం ప్రశ్న

పిల్లల కోసం రాసిన 2018 పుస్తకం ఎగ్జాం వారియర్స్ రచయిత ఎవరు?
a) మన్మోహన్ సింగ్
b) నరేంద్ర మోడీ
c) రాహుల్ గాంధీ
d) అటల్ బిహారీ వాజ్‌పేయి

పై ప్రశ్నకు జవాబు తెలియకోవడంతో ఆడియెన్స్ పోల్ ఆప్షన్‌ను ఉపయోగించుకొన్నారు. దాంతో ఆడియెన్స్ నరేంద్రమోడీ అని ఓటు వేశారు. దాంతో ఆ సమాధానం చెప్పి గేమ్‌లోకి వెళ్లిపోయారు.

Answer: నరేంద్ర మోడీ

80000 వేల రూపాయల కోసం ప్రశ్న

80000 వేల రూపాయల కోసం ప్రశ్న

అక్టోబర్ 2021లో, ఏ దేశం అంతరిక్షంలో సినిమా షూట్ చేయడానికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సిబ్బందిని పంపించింది?

a) యూఎస్ఏ
b) రష్యా
c) జపాన్
d) కెనడా

Answer: రష్యా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X