twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    NTR's EMK October 11th show: ఎన్టీఆర్ షోలో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? ఆటలో ఇద్దరు మహిళలు అలా

    |

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు రియాలిటీ షో ఆసక్తికరంగా సాగుతున్నది. సోమవారం ప్రారంభమైన ప్రస్తుత వారంలో పద్మలత, స్వప్న అనే ఇద్దరు మహిళలు గేమ్‌లో పాల్గొన్నారు. అయితే చాలా కాన్ఫిడెంట్‌గా ఆడుతున్నట్టు కనిపించిన పద్మావతి తప్పు సమాధానం ఇచ్చి గేమ్ నుంచి అవుట్ అయ్యారు. ఆ తర్వాత స్వప్ప గేమ్‌లోకి వచ్చారు. అయితే పద్మావతి ఎంత గెలుచుకొన్నారు? స్వప్న ఎంత సంపాదించారు? అనే వివరాల్లోకి వెళితే..

    ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్న

    ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్న


    మహిషా షషుర మర్ధిని స్త్రోత్రంలో మొదటి పంక్తి వచ్చేలా, ఈ పదాలను సరైన క్రమంలో అమర్చండి

    A) నందిత
    B) మేదిని
    C) అయిగిరి
    D) నందిని

    Answer: C, A, D, B

    పై ప్రశ్నకు సమాధానం చెప్పిన పద్మావతి హాట్ సీట్‌పైకి చేరుకొన్నారు. ఆమె ఎదుర్కొన్న ప్రశ్నలు ఇవే..

    1000 రూపాయల కోసం ప్రశ్న

    1000 రూపాయల కోసం ప్రశ్న

    సాధారణంగా, వీటిలో మణికట్టుకు ధరించేది ఏది?
    a) ఉంగరం
    b) కమ్మలు
    c) కిరీటము
    d) కడియము

    Answer: కడియము

    2000 రూపాయల కోసం ప్రశ్న

    2000 రూపాయల కోసం ప్రశ్న

    ఈ పురాణ దేవతలలో అష్టమి నాడు జన్మించిన వారు ఎవరు?
    a) రాముడు
    b) గణేశుడు
    c) కృష్ణుడు
    d) ఇంద్రుడు

    Answer: కృష్ణుడు

    3000 రూపాయల కోసం ప్రశ్న

    3000 రూపాయల కోసం ప్రశ్న

    ఈ ఆడియో పాటలో కనిపించే నటిని గుర్తించండి
    a) జెనీలియా
    b) సౌందర్య
    c) మీనా
    d) రాధిక

    Answer: రాధిక

    5000 రూపాయల కోసం ప్రశ్న

    5000 రూపాయల కోసం ప్రశ్న

    హవాయి, బెల్లీలు, పంపులు, కొల్హాపూరిలు వీటిలో ఏ రకాలు?
    a) పాదరక్షలు
    b) అద్దాలు
    c) చేతి తొడుగులు
    d) బ్యాగులు

    Answer: పాదరక్షలు

    10000 రూపాయల కోసం ప్రశ్న

    10000 రూపాయల కోసం ప్రశ్న

    ఈ చిత్రంలోని ప్రాణిని గుర్తించండి

    a) సీల్
    b) పెంగ్విన్
    c) డాల్ఫిన్
    d) సీ హార్స్

    Answer: డాల్ఫిన్

    20000 రూపాయల కోసం ప్రశ్న

    20000 రూపాయల కోసం ప్రశ్న

    వీటిలో పౌడర్, దంబింగ్, క్వీన్ లాంటి పదాలను ఏ ఆటలో ఉపయోగిస్తారు?
    a) బాడ్మింటన్
    b) క్యారం
    c) లూడో
    d) క్రికెట్

    Answer: క్యారం

    40000 రూపాయల కోసం ప్రశ్న

    40000 రూపాయల కోసం ప్రశ్న

    ఏ కళారూపాలలో అందెలు అనబడే రింగులను జింగిల్స్‌గా ఉపయోగిస్తారు?

    a) యక్షగానం
    b) కథక్
    c) బుర్ర కథ
    d) భరతనాట్యం

    పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో పద్మావతి తన తొలి లైఫ్ లైన్ ఉపయోగించుకొన్నారు. 50:50 ఆప్షన్ ఉపయోగించుకోవడంతో స్క్రీన్‌పై బుర్రకథ, భరతనాట్యం రెండు సమాధానాలు మిగిలాయి. దాంతో పద్మావతి బుర్రకథ అని సమాధానం చెప్పి 40 వేల రూపాయలు గెలుచుకొన్నారు.

    Answer: బుర్ర కథ

    80000 రూపాయల కోసం ప్రశ్న

    80000 రూపాయల కోసం ప్రశ్న

    వీరిలో జూలై 2021 నాటికి కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్న సికింద్రాబాద్ నియోజకవర్గ పార్లమెంట్ సభ్యుడు ఎవరు?
    a) గడ్డం రంజిత్ రెడ్డి
    b) జీ కిషన్ రెడ్డి
    c) మన్నె శ్రీనివాస్ రెడ్డి
    d) అసదుద్దీన్ ఓవైసీ

    Answer: జీ కిషన్ రెడ్డి

    160000 రూపాయల కోసం ప్రశ్న

    160000 రూపాయల కోసం ప్రశ్న

    1893 సెప్టెంబర్ 11న చికాగోలో జరిగిన ప్రపంచ మత సమ్మేళనంలో స్వామి వివేకానంద తన ప్రసంగాన్ని వీటిలో ఏ సంబోధనతో ప్రారంభించారు?
    a) సిస్టర్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా
    b) మై డియర్ ఫ్రెండ్స్ ఆఫ్ ద యూఎస్
    c) ఫెలో సిటిజన్స్ ఆఫ్ యూఎస్ఏ
    d) నమస్తే అమెరికా

    పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో తన రెండో లైఫ్ లైన్ ఉపయోగించుకొన్నారు. ఆడియెన్స్ పోల్ ఆప్షన్ ఉపయోగించుకోవడంతో ఎక్కువ మంది సిస్టర్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అనే ఆప్షన్‌కు ఓటు వేశారు. దాంతో ఆమె 160000 రూపాయల గెలుచుకొన్నారు

    Answer: సిస్టర్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా

    320000 రూపాయల కోసం ప్రశ్న

    320000 రూపాయల కోసం ప్రశ్న

    గంగోత్రి వద్ద గంగానది ఉద్భవించినప్పుడు ఏమని పిలుస్తారు?
    a) అలకనంద
    b) రాంగంగ
    c) గోమతి
    d) భాగీరథి

    Answer: భాగీరథి

    అయితే ఈ ప్రశ్నకు తప్పు సమాధానం చెప్పిన పద్మావతి గేమ్ నుంచి అవుట్ అయ్యారు. అప్పటి వరకు 160000 గెలుచుకొన్న ఆమె 10000 రూపాయలతో వెళ్లిపోయారు.

    వారు పుట్టిన కాలం ఆధారంగా, ఈ మహిళామణులను కాలక్రమంలో అమర్చండి?

    వారు పుట్టిన కాలం ఆధారంగా, ఈ మహిళామణులను కాలక్రమంలో అమర్చండి?


    A) రుద్రమదేవి
    B) సావిత్రి
    C) సరోజిని నాయుడు
    D) పీవీ సింధు

    Answer: A, C, B, D

    పై ప్రశ్నకు సమాధానం వేగంగా చెప్పిన స్వప్ప హాట్ సీట్‌పైకి వచ్చారు. వరంగల్ జిల్లా మచ్చాపురం గ్రామానికి చెందిన ఈమె ఎంఎస్‌సీ చదువుకొన్నారు. సివిల్స్ కోసం ప్రిపేర్ కావాలని అనుకొన్నారు. కానీ కుటుంబ కారణంగా మధ్యలో వదిలేశారు.

    రూ.1000 కోసం మొదటి ప్రశ్న

    రూ.1000 కోసం మొదటి ప్రశ్న

    వీటిలో సింహం అనే అర్ధం కూడా వచ్చే కలిగిన పదం ఏమిటి?
    a) కాలా
    b) కేసరి
    c) శ్వేతం
    d) నీలం

    Answer: కేసరి

    రూ.2000 కోసం మొదటి ప్రశ్న

    రూ.2000 కోసం మొదటి ప్రశ్న

    సాధారణంగా వీటిలో ఏది తయారు చేయడానికి అతి తక్కువ సమయం పడుతుంది.?
    a) బిర్యాని
    b) చికెన్ 65
    c) పులావ్
    d) ఆమ్లెట్

    Answer: ఆమ్లెట్

    Recommended Video

    Samantha : NTR కోసం మొదటిసారి సమంత అలా Naga Chaitanya ఎక్కడా తగ్గట్లేదుగా | RRR || Filmibeat Telugu
    రూ.3000 కోసం మొదటి ప్రశ్న

    రూ.3000 కోసం మొదటి ప్రశ్న


    హిందూ పురాణాలలో, వీరిలో విష్ణువు అవతారం కానిది ఎవరు?
    a) పరశురాముడు
    b) నరసింహుడు
    c) హనుమంతుడు
    d) రాముడు

    Answer: హనుమంతుడు

    ఇక మరో ప్రశ్నకు సమాధానం చెప్పడానికి సిద్దమవుతున్న నేపథ్యంలో శంఖం మోగింది. దాంతో గేమ్ సోమవారం ఆట ముగిసింది. స్వప్న రోల్ ఓవర్ కంటెస్టెంట్‌గా మారింది. రేపు ఎంత గెలుచుకొంటుందో వేచి చూడాల్సిందే.

    English summary
    NTR's Evaru Meelo Koteeswarulu Show October 11th Episode: Padmalatha out from EMK, Swapna hot seat. Padmavati gained 160000 in the show but, She has given wrong answer and left with 100000
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X