twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    NTR's EMK Oct 18th show: ఎన్టీఆర్ షోలో 1250000 ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయిన షర్మిల.. మీరు చెప్పగలరా?

    |

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరికొత్తగా ఎవరు మీలో కోటీశ్వరుడు షోతో ముందుకొచ్చారు. తాజా వారంలో ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్నకు వేగంగా సమాధానం చెప్పిన కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్‌కు చెందని షర్మిల హాట్ సీట్ పైకి వచ్చారు. బీటెక్ పూర్తి చేసి ఇండియా పోస్ట్ (పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్‌గా పరిచేస్తున్నారు. కరోనావైరస్ సమయంలో ఫ్రంట్ లైన్ వర్కర్‌గా పనిచేసింది. షర్మిలా చెప్పిన సమాధానాలకు మీరు జవాబు చెప్పగలరా?

    ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్న ఇదే..

    ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్న ఇదే..

    ప్రస్తుతం వారంలో హాట్ సీట్‌పైకి రావాలనే ఔత్సాహిక కంటెస్టెంట్లకు ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ గేమ్ ఆడించారు. ఆ ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్న ఇదే..

    మహాభారతంలోని ఈ కుంతీ పుత్రులను వారు పుట్టిన కాలక్రమంలో అమర్చండి

    A) కర్ణుడు
    B) అర్జునుడు
    C) ధర్మరాజు
    D) భీముడు

    Answer: A, C, D, A

    1000 రూపాయల కోసం ప్రశ్న

    1000 రూపాయల కోసం ప్రశ్న

    ఈ హిందూ దేవుళ్లలో మురారి అని పిలువబడేది ఎవరు?
    a) శివుడు
    b) గణేశుడు
    c) కృష్ణ
    d) హనుమంతుడు

    Answer: కృష్ణ

    2000 రూపాయల కోసం ప్రశ్న

    2000 రూపాయల కోసం ప్రశ్న

    సాధారణంగా, మానవ శరీరంలో, వీటిలో ఏది రెండు కంటే ఎక్కువ సంఖ్యలో ఉంటుంది?

    a) మెదడు
    b) చెవులు
    c) కిడ్నీలు
    d) కాలివేళ్లు

    Answer: కాలివేళ్లు

    3000 రూపాయల కోసం ప్రశ్న

    3000 రూపాయల కోసం ప్రశ్న

    ఒక పిల్లలపాట ప్రకారం, బుజ్లిమేక మేతకు ఎక్కడికి వెళ్లింది?
    a) రాజుగారి తోట
    b) రాణిగారి తోట
    c) మంత్రిగారి తోట
    d) సిపాయిగారి తోట

    పై ప్రశ్నకు సమాధానం షర్మిలకు తెలియకపోవడంతో తన మొదటి లైఫ్‌లైన్‌ను ఉపయోగించుకొన్నారు. ఆడియెన్స్ పోల్‌ను ఉపయోగించుకోవడం జరిగింది. అయితే ఎక్కువ మంది రాజుగారి కోట అని జవాబు ఇవ్వడంతో ఆమె దానిని తన సమాధానంగా చెప్పి తదుపరి ప్రశ్న కోసం ముందుకెళ్లారు.

    Answer: రాజుగారి తోట

    5000 రూపాయల కోసం ప్రశ్న

    5000 రూపాయల కోసం ప్రశ్న

    డిసెంబర్ మరియు జనవరి నెలల్లో మొత్తంగా ఎన్ని రోజులు ఉంటాయి?

    a) 62
    b) 59
    c) 65
    d) 64

    Answer: 62

    10000 రూపాయల కోసం ప్రశ్న

    10000 రూపాయల కోసం ప్రశ్న

    ఈ పాటలో కనిపించిన నటిని గుర్తించండి
    a) ఆసిన్
    b) స్నేహ
    c) శ్రీయసరన్
    d) భూమిక చావ్లా

    Answer: భూమిక చావ్లా

    20000 రూపాయల కోసం ప్రశ్న

    20000 రూపాయల కోసం ప్రశ్న

    టోక్యో ఒలంపిక్స్‌లో, భారతదేశానికి బంగారు పతకం సాధించిన వారు ఎవరు?
    a) నీరజ్ చోప్రా
    b) మీరాభాయి ఛాను
    c) రవికుమార్ దహియా
    d) బజరంగ్ పూనియా

    Answer: నీరజ్ చోప్రా

    40000 రూపాయల కోసం ప్రశ్న

    40000 రూపాయల కోసం ప్రశ్న

    సాధారణంగా చిత్రాలలో, ఈ వ్యక్తులలో ఎవరు పొడవాటి గడ్డంతో కనిపిస్తారు?

    a) మహాత్మా గాంధీ
    b) రవీంద్రనాథ్ ఠాగోర్
    c) జవహర్ లాల్ నెహ్రూ
    d) బీఆర్ అంబేద్కర్

    Answer: జవహర్ లాల్ నెహ్రూ

    80000 రూపాయల కోసం ప్రశ్న

    80000 రూపాయల కోసం ప్రశ్న

    ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు మరియు కంప్యూటర్ చిప్స్ తయారీలో వీటిలో ప్రధానంగా దేనిని ఉపయోగిస్తారు
    a) సిలికాన్
    b) టెప్లాన్
    c) నైలాన్
    d) నియాన్

    Answer: సిలికాన్

    160000 రూపాయల కోసం ప్రశ్న

    160000 రూపాయల కోసం ప్రశ్న

    కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో భాగమైన యానాం జిల్లా, ఆంధ్రప్రదేశ్‌లోని ఏ జిల్లాలో ఉంది?

    a) విజయనగరం
    b) విశాఖపట్నం
    c) తూర్పు గోదావరి
    d) శ్రీకాకుళం

    Answer: తూర్పు గోదావరి

    320000 రూపాయల కోసం ప్రశ్న

    320000 రూపాయల కోసం ప్రశ్న

    2019లో ఆవిష్కరించబడిన జాతీయ యుద్ధ స్మారకం భారతదేశంలో ఎక్కడ ఉన్నది?
    a) కార్గిల్
    b) వాఘా
    c) పోర్ట్ బ్లెయిర్
    d) న్యూఢిల్లీ

    పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో లైఫ్‌లైన్‌ను ఉపయోగించుకొన్నారు. తనకు ఉన్న రెండు లైఫ్‌లైన్ల నుంచి వీడియో కాల్ ఆప్షన్‌ను ఉపయోగించుకొని తన స్నేహితుడికి కాల్ చేశారు. అయితే తన స్నేహితుడికి కూడా సమాధానం తెలియకపోవడంతో ఆ లైఫ్ లైన్ వేస్ట్ అయింది. ఇక తన మూడో లైఫ్‌లైన్ 50:50 ఆప్షన్‌ను ఉపయోగించుకోవడంతో రెండు సమాధానాలు స్క్రీన్‌పైకి రాగా, న్యూఢిల్లీ సమాధానం చెప్పి 320000 గెలుచుకొన్నారు.

    Answer: న్యూఢిల్లీ

    640000 రూపాయల కోసం ప్రశ్న

    640000 రూపాయల కోసం ప్రశ్న

    వీరిలో 1850లో దశకంలో ధవలేశ్వరం బ్యారేజ్‌ను మొదటగా నిర్మించిన ఇంజినీర్ ఎవరు?
    a) ఎం విశ్వేశ్వరయ్య
    b) సర్ ఆర్థర్ కాటన్
    c) జాన్ పెన్నిక్విక్
    d) కానూరి లక్ష్మణరావు

    Answer: సర్ ఆర్థర్ కాటన్

    Recommended Video

    Samantha : NTR కోసం మొదటిసారి సమంత అలా Naga Chaitanya ఎక్కడా తగ్గట్లేదుగా | RRR || Filmibeat Telugu
     1250000 రూపాయల కోసం ప్రశ్న

    1250000 రూపాయల కోసం ప్రశ్న

    వీరిలో ఎవరి పేరుని నంది పురస్కారాలలో ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రానికి ఇచ్చే పురస్కారానికి పెట్టారు?
    a) పొట్టి శ్రీరాములు
    b) సర్వేపల్లి రాధాకృష్ణ
    c) సరోజిని నాయుడు
    d) గూడ అంజయ్య

    Answer: సరోజిని నాయుడు

    English summary
    NTR's Evaru Meelo Koteeswarulu Show October 18th Episode: Hanuman Junction's Sharmila won Rs.640000. She unable to answer 1250000 question and she quit the show.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X